- కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి భరోసా
- బాధిత కుటుంబాలకు రూ.3లక్షలు ఆర్థిక సాయం
అమలాపురం: అధైర్యపడొద్దు… పార్టీ మీ వెన్నంటే ఉందని కుటుంబ పెద్దలను కోల్పోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర బాబు సతీమణి భువనేశ్వరి భరోసా ఇచ్చా రు.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు గురువారం పీ గన్నవరం, అమలా పురం, రాజోలు,మండపేట నియోజకవర్గా ల్లో పర్యటించారు. మొదటగా పీ గన్నవరం నియోజకవర్గం, ఐనవల్లి మండలం, ఎస్ మూలపాలెం గ్రామంలో పార్టీ కార్యకర్త మోరెంపూడి మీరాసాహెబ్ కుటుంబాన్ని పరామర్శించారు.స్కిల్ డెవలప్మెంట్ కేసు లో చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టు కోలేక మనస్తాపానికి గురై మీరాసాహెబ్ (52) గత ఏడాది అక్టోబర్ 25వ తేదీన గుండెపోటుతో మృతి చెందారు. మీరాసా హెబ్ భార్య దుర్గమ్మ,తమ్ముడు బాలరాజు ను భువనేశ్వరి పరామర్శించి, వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రూ.3 లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేశారు. అనంతరం అమలాపురం నియోజకవర్గం, ఉప్పలగుప్తం మండలం, చల్లపల్లి గ్రామం లో సాలాది విశ్వనాథం కుటుంబాన్ని భువ నేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్ర మ అరెస్టును తట్టుకోలేక విశ్వ నాథం(58) గత ఏడాది అక్టోబర్ 20న గుండెపోటుతో మృతిచెందారు. విశ్వనాథం భార్య ఆది లక్ష్మి, కుమార్తెలు జీవనజ్యోతి, రత్నకుమా రి, కాంతలక్ష్మిలను భువనేశ్వరి ఓదార్చి, ధైర్యం చెప్పారు. వారికి రూ.3 లక్షల చెక్కు అందించి ఆర్థికసాయం చేశారు.
అనం తరం అమలాపురం నియోజకవర్గం, అల్ల వరం మండలం,రెల్లుగడ్డ గ్రామంలో కార్య కర్త నడిరపల్లి పల్లంరాజు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. పల్లంరాజు (77), గత ఏడాది అక్టోబర్ 1వ తేదీన గుండెపోటుతో మృతిచెందారు. పల్లంరాజు భార్య అన్నపూర్ణ, కొడుకు వెంకటరాజు, కుమార్తె దుర్గలను భువనేశ్వరి ఓదార్చారు. రూ.3లక్షల చెక్కు అందించి ఆర్థికసాయం చేశారు. అనంతరం రాజోలు నియోజక వర్గం, మల్కిపురం మండలం, విశ్వేశ్వరా యపురం గ్రామంలో పార్టీ కార్యకర్త చెల్లు బోయిన నరసింహారావు కుటుంబాన్ని భువ నేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్ర మ అరెస్టును జీర్ణించుకోలేక నరసింహా రావు(57) గత ఏడాది సెప్టెంబర్ 9న గుండెపోటుతో మృతిచెందారు. నరసింహా రావు భార్య వెంకటలక్ష్మి,కుమారుడు చంద్ర కాంత్‌లను భువనేశ్వరి ఓదార్చి, ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి రూ.3లక్షల ఆర్థికసాయం అందించారు. అనంతరం రాజోలు నియోజకవర్గం, రాజోలు మండ లం, సోంపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్త సరెళ్ల పెద్దిరాజు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరె స్టును తట్టుకోలేక పెద్దిరాజు(57), గత ఏడాది అక్టోబర్ 17న గుండెపోటుతో మృతిచెందారు.పెద్దిరాజు కుమారుడు రాం బాబు, కోడలు నాగలక్ష్మి, మనుమరాలు జాస్మిన్లను భువనేశ్వరి పరామర్శించి,వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థిక సాయం చేశారు. అనంతరం మండపేట నియోజక వర్గం,కపిలేశ్వరపురం మండలం, నల్లూరు గ్రామంలో పార్టీకార్యకర్త జొన్నకూటి రాజు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. రాజు కుమార్తె అన్నపూర్ణ, కుమారుడు విజ య్కుమార్లను భువనేశ్వరి పరామర్శించి, ఓదార్చారు. రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థిక సాయంచేశారు.చివరిగా మండపేట నియో జకవర్గం, మండపేట మండలం, పాలతో డు గ్రామంలో మందపల్లి ధర్మరాజు కుటు ంబాన్ని పరామర్శించారు.చంద్రబాబు అక్ర మ అరెస్టును తట్టుకోలేక ధర్మరాజు(51), గతఏడాది సెప్టెంబర్ 17న గుండెపోటుతో మృతిచెందారు. ధర్మరాజు భార్య మందపల్లి జ్యోతి, కుమార్తెలు వినీల, ప్రమీళ, కుమరు డు వరుణ్‌లను భువనేశ్వరి ఓదార్చి,ధైర్యం చెప్పారు. రూ.3లక్షల ఆర్థికసాయం చేసి ధైర్యం చెప్పారు. పరామర్శల అనంతరం అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండ లం,బలభద్రపురం గ్రామంలోబస చేశారు.