- రూ.700 కోట్ల జె-ట్యాక్స్ కోసమే కొత్త సీడ్, ఫీడ్ చట్టాలు
- జె-ట్యాక్స్ కోసం సినిమా హీరోలనే బెదిరించిన జగన్ రెడ్డి
- సమస్యల పరిష్కరించడం చేతగాక పోతే రాజీనామా చేసి వెళ్లిపోండి
- వైసిపి పాలనలో ఎకరానికి రూ.1.80 లక్షల అదనపు భారం
- ఇదేం ఖర్మ ఆక్వారైతాంగానికి సదస్సులో చంద్రబాబునాయుడు
అమరావతి : టిడిపి ప్రభుత్వ హయాంలో ఆక్వారంగాన్ని దేశంలో నెంబర్ 1 స్థానానికి తీసువెళ్లాం. రాష్ట్రంలో మేం చేపట్టిన చర్యల కారణంగా నాడు దేశంలో 65 శాతం రొయ్య లు, 22శాతం చేపలు ఉత్పత్తి ఇక్కడ జరిగేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం జె ట్యాక్స్ కోసం మొత్తం ఆక్వారంగాన్నే నాశనం చేసిందని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. మంగళగిరిలో ని టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఇదేం ఖర్మ ఆక్వా రైతాంగానికి పేరుతో నిర్వహించిన సద స్సుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున ఆక్వా రైతులు తరలివచ్చారు. సదస్సుకు ముఖ్యఅతిధిగా హాజరైన చంద్రబాబునాయుడు మాట్లాడుతూ… సీడ్, ఫీడ్ పరిశ్రమలను జె ట్యాక్స్ కోసం నాశనం చేశారు. ఈ దరిద్రం ఇలాగే ఉంటే ఆక్వా సాగులో ఎకరాకు లక్ష వసూలు చేస్తారు.
ఎమ్మెల్యే నుంచి సిఎం వరకు అందరూ వాటాలు అడుగుతారని అన్నారు. ముఖ్య మంత్రి జగన్‌రెడ్డి అండ్ కో ధనదాహం, అసమర్థత వల్లే రాష్ట్రంలో ఆక్వారంగం సంక్షోభంలో కూరుకు పోయిందని చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్రంలో దుర్మార్గమైన ముఖ్యమంత్రి కారణంగా ఆక్వారైతులు ఇదివరకెన్న డూ లేనివిధంగా అవస్థలు పడుతున్నారు, చేసే ప్రతి పనిలో నాకేమొస్తుందని జె-గ్యాంగ్ ఆలోచి స్తోంది. రాష్ట్రాభివృద్ధిని పక్కనబెట్టి డబ్బు, లాభం చూసు కుంటూ తన గల్లా పెట్టె కోసమే జగన్ పనిచేస్తున్నారు. ఆయన నిర్వాకం వల్లే రాష్ట్రంలో ఆక్వా రంగం నేడుసంక్షోభంలో కూరుకుపోయిందని దుయ్య బట్టారు.
రూ.700 కోట్ల జె-ట్యాక్స్ కోసం స్కెచ్
ఆక్వాలో కీలకమైన అన్ని వ్యవస్థలను నియంత్రిం చేందుకు సీడ్‌యాక్ట్, ఫీడ్ యాక్ట్ తీసుకువచ్చారు. జె- ట్యాక్స్ వసూళ్లకోసమే కొత్తచట్టాలు తెచ్చారు.ఒక్క ఫీడ్ ద్వారానే ఏడాదికి రూ.700కోట్లు అక్రమ సంపాదన కు స్కెచ్ వేశారు. ఈ అక్రమ సంపాదనతో మళ్లీ ఎన్ని కల్లో ఓట్లు కొనేందుకు జగన్ సిద్దం అవుతున్నాడు. నాడు నీటి పన్ను 1000 లీటర్లకు రూ.12 ఉండగా… నేడు రూ.120 చేశాడు. 12 రూపాయలు ఎక్కడ.. 120రూపాయలు ఎక్కడ. తిక్కసిఎం అనాలా.. సైకో సిఎం అనాలా?ఆక్వా రైతులు బాధలు పడుతు ంటే సిఎం భలేకొట్టాను ఆక్వారైతులను అని చూసి ఆనం దిస్తున్నాడు. మంత్రులు ఉప సంఘం కూర్చుని ఆక్వా రైతులను ఎలాకంట్రోల్ చెయ్యాలా అని చూశారు.
ధరల పెంపుతో మోయలేని భారం
టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆక్వా సంబంధిత ముడిసరుకుల ధరలన్నీ పెంచేశారు. 2019లో టన్ను మేత రూ.72,000 ఉండగా, నేడు రూ.91,550కి పెంచారు. ఎకరా పంటకు మేతపై అధనపు ఖర్చుదాదాపు రూ.76,245 అదనపు భారం పడిరది. ఆక్వాలో జోన్ విధానం తీసుకువచ్చి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చెరువులకు అనుమ తులు లేవని, 10ఎకరాలు కంటే ఎక్కువ ఉందని సబ్సిడీ ఎత్తివేసి కరెంట్ బిల్లు యూనిట్ రూ.3.85 చేశాడు. ఒకపంట కాలానికి కరెంట్ బిల్లుల రూపం లో అదనపు భారం సుమారు రూ.26,862 పడుతోం ది. నాడు ఒక్క నిముషం విరామం లేకుండా కరెంట్ ఇచ్చాం. కానీ ఇప్పుడు నిరంతరాయ సరఫరా కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వం కరెంట్ నిరంతరాయంగా ఇవ్వకపోవడంవల్ల ఎకరానికి డీజిల్ ఖర్చు రూ.70, 000 అదనపు భారంగా మారింది. వ్యవసాయ మార్కె ట్ కమిటీల ఆదాయం కోసం అంటూ 0.25% ఉండే సెస్సును అక్వాపై 1శాతం చేసి నాలుగు రెట్లు పెంచా రు. దీనివల్ల ఎకరానికి రూ.13,500ల అదనపు భారం పడిరది.
ఆక్వాతోపాటు హార్టికల్చర్‌కు కూడా దెబ్బ!
ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా ఇప్పు డు హార్టి కల్చర్,ఆక్వా కల్చర్…రెండూ దెబ్బతిన్నాయి. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి…వ్యవస్థల నాశనమే ఈ రోజు సంక్షోభాలకు కారణం. ఆక్వా రంగంలో నేడు నెలకొన్న సంక్షోభం ప్రభుత్వ ధనదాహానికి, అసమర్థత కు ప్రతిరూపంగా నిలుస్తోంది. అవినీతి ప్రభుత్వ అనా లోచిత చర్యల కారణంగా ఆక్వా రైతులు ఆత్మ హత్య లు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు.ఆక్వావిష యం లో ఈ ప్రభుత్వానివన్నీ తప్పుడు విధానాలు, తప్పుడు ఆలోచనలే. నేను ఏం చేసినా శాసనం అన్నట్లుగా రైతులకు ఈ జగన్‌రెడ్డి మరణశాసనం రాశారు.
టిడిపి వచ్చాక 1.50కే యూనిట్ విద్యుత్
టిడిపి అధికారంలోకి వచ్చాక ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్ అనే తేడా లేకుండా యూనిట్ విద్యుత్ రూ.1.50 ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. గత టిడిపి ప్రభుత్వ హయాంలో 1.40 లక్షల హెక్టార్ల నుంచి 2 లక్షల హెక్టార్లకు ఆక్వాసాగును తీసుకు వెళ్లాం. రాష్ట్ర జిఎస్ డిపిలో ఆక్వా రంగ వాటా 4.3శాతం ఆదాయం ఉంటే 7.4శాతానికి తీసుకు వెళ్లాం. సోలార్ విండ్ తెచ్చి ఆక్వా రైతులకు సబ్సిడీ ఇస్తాం. నాణ్యమైన సీడ్, ఫీడ్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం. జగన్‌రెడ్డి తన కమిషన్ వదులుకుంటే అవన్నీ ఇవ్వొచ్చు. టాస్క్ ఫోర్స్, విజి లెన్స్ పేరుతో ఆక్వా రైతులను బెదిరిస్తున్నారు.
ఆక్వా రైతులు ధైర్యంగా పోరాడాలి. మా అచ్చెన్నాయుడుని కూడా జైల్లో పెట్టారు. కానీ మేం భయపడ్డామా? అధి కారంలోకి రాగానే నీటిపన్ను, ఎఎంసి సెస్, టాన్స్ ఫార్మర్ల ధరను పాతరేట్లకే అందేలాచేస్తాం. మీరు సంపద సృష్టించేందుకు సహకరిస్తాం. 24గంటల పాటూ కరెంట్‌ఇస్తాం. డీజిల్ వాడకంతో ఆక్వా రైతులపై అద నపు భారం పడకుండా చూస్తాం. జనరేటర్లు, డీజిల్ అవసరం లేని విధంగా 24గంటలు విద్యుత్ సరఫరా చేస్తాం. ఏరియేటర్లు, బోర్లు, మోటార్లు 50శాతం సబ్సి డీపై ఇస్తాం. ఆక్వా రైతులకు ఇదేనా మ్యానిఫెస్టో. జగన్ నీకుధైర్యం ఉంటే రైతాంగాన్ని ఆదుకో. ఇవన్నీ అమలు చెయ్యగలవా?
ఆక్వాపై విద్యుత్ శాఖ పిడుగు
ఆక్వాకల్చర్‌కు సరఫరాచేసే విద్యుత్‌కు సంబం ధించి వివిధ మౌలిక సదుపాయాలకోసం భారీ ఎత్తున భారం మోపారు. 25కెవి ట్రాన్స్ ఫార్మర్ నాడు రూ.64,000 ఉండగా, నేడు రూ.3.24 లక్షలకు పెంచేశారు. 40కెవి ట్రాన్స్ ఫార్మర్ రూ.1.14 లక్షలు ఉండగా, నేడు రూ.4.96 లక్షలకు పెంచారు. 63 కెవి ట్రాన్స్ ఫార్మర్ నాడు రూ.2.20 లక్షలు ఉంటే నేడు రూ.5.25 లక్షలు చేశారు. నాడు 100కెవి ట్రాన్స్‌ఫార్మర్ రూ.3.56 లక్షలు ఉండగా, నేడు రూ.8.30లక్షలకు పెంచా రు. వైసిపి పాలనలో ఎక రానికి రూ.1.50 లక్షల నుంచి రూ.1.80 లక్షల అదనపు భారంపడిరది. ఎక్కడైనా మంత్రుల ఉపసంఘం వల్ల మద్దతు ధర వచ్చిందా?దీనికి మంత్రులు సమాధానం చెప్పాలి.
టిడిపి హయాంలో ఆక్వాపురోగతి
2014లో తాను ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతిఏడాది ఆక్వారంగంలో 30శాతంపురోగతి సాధిం చాం. దేశంలో 60నుంచి 70శాతం వాటా మన రాష్ట్ర ఆక్వా సాధించింది. ఈ రోజు ప్రభుత్వం నిర్ణయాల కారణంగా ఆక్వా ఖర్చులు రెండు రెట్లు పెరిగాయి. ఫీడ్, మందులు, కరెంట్ బిల్లులు సహా అన్నీ పెరిగి పోయాయి. మేం ఆనాడు ఆక్వారంగానికి విద్యుత్ యూనిట్ రూ.2ఇస్తే..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రూపా యిన్నరకే ఇస్తానని జగన్ అన్నాడు.
అధికారంలోకి వచ్చాక యూనిట్ రూ.3.85కు పెంచారు. ప్రభుత్వం ఇస్తున్న యూనిట్ విద్యుత్ రూ.1.50 ధర 20 శాతం మంది రైతులకు మాత్రమే వర్తిస్తోంది. స్వార్థం, స్వ లాభం లేకుండా ఈ సిఎం ఒక్క పని కూడా చెయ్యడం లేదు. మంత్రులు ఆక్వాపై మీటింగ్ పెట్టుకున్న సమ యంలో రైతులతో ఎందుకు మాట్లాడలేదు? ఆక్వారంగం సంక్షోభంలో ఉంటే మాకు ఇబ్బందులు లేవని కత్తి మెడపై పెట్టి ఆక్వా రైతులతో స్టేట్మెంట్ ఇప్పించారు. రైతులపై ఎదురు దాడి చేస్తే సమస్య పరిష్కారం కాదు. సమస్యలను పరిష్కరించడం చేతకాకపోతే ముఖ్యమంత్రి రాజీ నామా చేసి ఇంటికి వెళ్లిపోవాలి. సమస్యలు ఎలా పరిష్కరించాలో చేసి చూపిస్తాం.
ఆక్వా రైతులకోసం కోల్డ్ స్టోరేజిలు తెస్తాం
అవసరాన్ని బట్టి ఆక్వారైతులకోసం కోల్డ్ స్టోరేజ్ లు తీసుకువస్తాం. విజిలెన్స్, స్టేట్ జిఎస్టి, టాస్క్ ఫోర్స్, పొల్యూషన్ తనిఖీలు వంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం కష్టాలు వచ్చిన సమయంలో మనం నిలదొక్కుకోవాల్సి ఉంది.మద్దతు ధర ఇచ్చి ఆక్వా రైతాంగాన్ని ఆదుకుంటాం.
జె-ట్యాక్స్ కోసం సినిమా రంగాన్ని బెదిరించ డంతో రాష్ట్రంలో థియేటర్లు అన్నీ మూసివేశారు. సినిమా హీరోలను కూడా బెదిరించిన వ్యక్తి జగన్ రెడ్డి. రెండు రూపాయలకు యూనిట్ విద్యుత్ ఇచ్చిన నన్ను కాదని జగన్ ను నమ్మారు. కానీ ఇప్పుడు అందరికీ జగన్ పాలనపై స్పష్టత వచ్చింది. ఆక్వా రైతుల సమస్యలపై రైతులు పోరాడాలి..నేను మీతో కలిసివస్తాను. అండగా ఉంటాను. మళ్లీ ఆక్వా రంగాన్ని పూర్వ వైభవం తెచ్చే బాధ్యత మేం తీసుకుంటాం.
ప్రభుత్వ చర్యలు న్యాయంచేసేలా ఉండాలి
ప్రభుత్వ చర్యలు రైతులకు న్యాయం చేసే విధంగా ఉండాలి. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం ధనదాహం తో స్వలాభం కోసం, ఆయా వర్గాలపై పెత్తనం కోసం ప్రయత్నిస్తోంది. మూడున్నరేళ్లలో అన్ని ధరలు పెరిగి పోయాయి. దేశంలో ఎక్కడా లేని పెట్రోల్, డీజిల్ ధరలు మన రాష్ట్రంలో ఉన్నాయి. వంట గ్యాస్, నిత్యా వసరాలు, కరెంట్ చార్జీలు కూడా దేశంలో ఎక్కడా లేనంతగా మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇంటిపన్ను, మరుగుదొడ్డిపన్ను అంటూ రకరకాల పన్నులతో బాధేస్తున్నారు. దీనిపై ప్రజలను చైతన్య పరచడానికి బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించాం. జగన్ బటన్ నొక్కడు పేరుతో తనకు ఆదాయం వచ్చే బటన్ నే ఎక్కువ నొక్కుతున్నాడు.
సమస్యల సుడిగుండంలో అన్నదాతలు
గత మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో రైతాంగం అనేక సమస్యల్లో కూరుకుపోయింది. అకాల వర్షాలు, తెగుళ్లు, గిట్టుబాటు ధర లభించకపోవడం వంటి సమస్యలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభు త్వం చెబుతున్న గిట్టుబాటు ధర వాస్తవంలో ఎక్కడా రైతులకు అందడం లేదు. టీడీపీ హయాంలో వ్యవసాయంతో పాటు కోస్టల్ ఆంధ్రాలో ఆక్వాను ప్రోత్సహించాం. సముద్ర తీరం, నదులు ఉన్న కార ణంగా ఆక్వాను ప్రోత్సహించాను. ప్రతి సంవత్సరం 30 శాతం చొప్పున ఆక్వా పెంచాం. రాయలసీమలో నీళ్లు ఇచ్చి రతనాల సీమగా మార్చేందుకు ప్రయత్నం చేశాం. పట్టిసీమ కట్టడం వెనక రాయలసీమ ప్రయోజనాలు ఉన్నాయి. పట్టిసీమ వల్ల ముందుగానే పంటలు వేసుకుని తుఫాన్ల బెడద నుంచి రైతులు బయటపడ్డారు. రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులు తెచ్చి హార్టి కల్చర్ సాగును పెంచాం.