రాయచోటి రూరల్(చైతన్యరథం): ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పార్కులకు శ్రీకారం చుట్టామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. మండలంలోని శిబ్యాల గ్రామంలో మంగళవానం ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఎంఎస్‌ఎంఈ పార్కులకు శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నా రు. మంత్రి మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలు కల్పించినప్పుడే చదువుకు సార్ధకత ఉంటుంది.. మన ప్రాంతంలోనే ఫ్యాక్టరీలు, ఐటీ కంపెనీలు వస్తే మన బిడ్డలకు ఉపాధి అవకాశాలు కలుగు తాయి..ఈ లక్ష్యంతోనే చంద్రబాబు ఆలోచించి ప్రతిఒక్క నియోజక వర్గంలో పెట్టుబడులు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎంఎస్‌ఎంఈ పార్కులకు శ్రీకారం చుట్టారని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు చైర్మన్ నాగేశ్వర్‌నాయుడు, ఏపీఐఐసీ డైరెక్టర్ కొండ భాస్కర్‌రెడ్డి, ఫారెస్ట్ డైరెక్టర్ రెడ్డి యాదవ్, ఏఎంసీ చైర్మన్ రాంప్రసాద్‌రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు గాజు ల ఖాదర్‌బాషా, బోనమల ఖాదరవల్లి, కోడి శీను, సుధాకర్, గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












