అమరావతి(చైతన్యరథం): పాఠశాల భవనం సన్ షేడ్ కూలి విద్యార్థి మృతి చెందిన ఘటనపై రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, పాతర్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో వైసీపీ హయాంలో నిర్మించి, అసంపూర్తిగా వదిలేసిన పాఠశాల భవనం సన్ షేడ్ కూలి కృష్ణంరాజు అనే పదో తరగతి విద్యార్థి చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ ఘటనలో మరో విద్యార్థి గాయపడటం బాధాకరమన్నారు. పాఠశాలల్లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం, విద్యార్థి కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.












