అమరావతి (చైతన్యరథం): జూన్ 4.. ప్రజాతీర్పు దినం సందర్భంగా అందరికీ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున విధ్వంసపాలనపై ప్రజలు గెలిచారు. అరాచక, కక్షపూరిత పాలనపై ప్రజల ఆకాంక్షలు ఘన విజయం సాధించాయి. ఈ గెలుపు ఐదు కోట్ల ప్రజల గెలుపు. ప్రజా తీర్పు మా కూటమి బాధ్యతను మరింత పెంచింది. చంద్రబాబు పాలనానుభవం, పవనన్న ఆశయానికి ప్రధాని మోదీ ఆశీస్సులు పుష్కలంగా లభించడంతో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం ప్రారంభమైంది. ప్రజా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ఐదు కోట్ల ప్రజలకు కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ఇదే స్ఫూర్తితో మాకు అండగా నిలుస్తారని కోరుతున్నాను. ప్రజా తీర్పుదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.