- పార్టీ కోసం చివరి వరకు శ్రమించారు
- చనిపోయినా బతికే ఉన్న సజీవుడు
- పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
- పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘన నివాళి
- పాల్గొన్న మంత్రులు సవిత, కొల్లు రవీంద్ర
మంగళగిరి(చైతన్యరథం): పీరయ్యతో అనుబంధం వెలకట్టలేనిదని, ఆయన సం తాప సభను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉపాధి మండలి మాజీ సభ్యులు పోతగంటి పీరయ్య సంస్మరణ సభ వీరంకి గురుమూర్తి అధ్యక్షతన నిర్వహిం చారు. సభలో వర్ల రామయ్యతో పాటు మంత్రులు సవిత, కొల్లు రవీంద్ర, నాయకులు పాల్గొన్నారు. వర్ల రామయ్య ఎక్కడో కడప జిల్లా ఓ చిన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి.. పార్టీలో పెద్ద నాయకుడు, పెద్ద పదవులు అనుభవించిన వ్యక్తి కాకపోయినా ఈరోజు పెద్దఎత్తున ఈ సభ అతని పేరిట సానుభూతి తెలిపేందుకు భారీఎత్తున వచ్చారంటే సంతోషించాల్సిన విషయమన్నారు. ఆయన నడక, మాటతీరు, ప్రవర్తన, ఎదుటి వ్యక్తిని అదరించే తీరు, మాట్లాడే విధానం, మంచితనం ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. చనిపోయినా బతికే ఉన్న సజీవుడు పీరయ్య చిరంజీవిగా మనందరి మధ్యలోనే ఉన్నారని కొనియాడారు.
పార్టీ కోసం సైనికుడిలా పనిచేశారు: సవిత, కొల్లు రవీంద్ర
బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ పార్టీ కోసం ఏమి అశించకుండా నిరంతరం సైనికుడిలా పనిచేసిన వ్యక్తి పీరయ్య. ఆయన అకాల మరణం తమను ఎంతగానో కలచివేసింది. నేటికీ పార్టీ కార్యాలయానికి వచ్చేటప్పుడు అయన ఎక్కడో చోట ఉన్నట్లే అనిపిస్తుంది. ఉపాధి హామీ పనుల నిధులు రాబట్టడంలో ఆయన చేసిన కృషి మరువలేమని పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ తెలు గుదేశం పార్టీకి అంకితభావంతో పని వ్యక్తి పీరయ్య. అలాంటి వ్యక్తి మన మధ్య లేక పోవడం దురదృష్టకరం. పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ అన్న ఎన్టీఆర్ మీద అభిమా నంతో పార్టీలో చేరారు. అనాటి నుంచి అంకితభావంతో పనిచేశారు. పార్టీ కార్యాల యానికి ఎవరు వచ్చిన వారందరినీ అప్యాయంగా పలికరించే వ్యక్తి పీరయ్య. అలాంటి వ్యక్తిని మన మధ్య లేకపోవడం బాధకరమని నివాళులర్పించారు.
పార్టీ కోసమే పీరయ్య పనిచేసేవారు
మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు మాట్లాడుతూ పార్టీ కోసమే పీరయ్య నిరం తరం కృషి చేసేవారు. సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసేవారు. అలాంటి వారు ఇప్పుడు మన మధ్య లేకపోవడం బాధకరమన్నారు. ఆయన పలకరింపులో ఉన్న అప్యా యత, ప్రేమ మరువలేనవి. పీరయ్య మరణం ఇంట్లో మనిషిని కోల్పోయిన భావం కలుగుతుందన్నారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం పీరయ్య సేవలు వెలకట్టలేనివి. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం నిరంతరం చేస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లకు తన వంతు సహకారం అందించిన వ్యక్తి పీరయ్య. పార్టీ కోసం పని చేసే వ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ పార్టీ కోసం ఏదైన చేసే వ్యక్తి పీరయ్య. గడిచిన నాలుగు సంవ త్సరాలుగా పీరయ్య ఏ విధంగా సేవలు అందించారో అందరికీ తెలిసిన విషయమే. ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక బిల్లుల సాధనలో వారు చేసిన కృషి.. ఒక నిబద్ధతతో 365 రోజుల్లో ఏదైన ఇబ్బంది కలిగితే తప్ప నిత్యం పని చేసేవారు. పీరయ్య కుటుంబసభ్యులకు అండగా ఉంటామని తెలిపా రు. గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ పోతగంటి పీరయ్య లేని లోటు తీరనిదని గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ బిల్లులు పెండిరగ్‌లో ఉన్న సమయంలో బీద రవిచంద్ర నాయకత్వంలో ఉపాధి హామీ సాధించేందుకు కడప నుంచి మంగళగిరికి వచ్చి నిరంతరం కృషి చేశారు. అదేవిధంగా కడప జిల్లా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా కొనసాగారు. ఉపాధి హామీ సభ్యులుగా ఉన్న పీరయ్యతో ఎన్నో గుర్తులు మాకు ఉన్నాయి. మరి అనాడు చంద్రబాబు ఆదేశానుసారం లోకేష్ మార్గదర్శకంలో పని చేసి ఉపాధి హామీ పనులు చేసిన వారికి రూ.4 కోట్లు ఇప్పించే టీంలో పీరయ్య ఉన్నారని చెప్పేందుకు గర్వంగా ఉందన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగినప్పుడు దైర్యంగా ముందుకు వచ్చి ప్రశ్నించిన వ్యక్తి పీరయ్య అని, పార్టీ కోసం అఖరి రోజు వరకు కూడా పనిచేశారని గుర్తుచేశారు. నీరు చెట్టు ఫిర్యాదుల విభాగం కన్వీనర్ ఆళ్ల గోపాలకృష్ణ మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి పోతగంటి పీరయ్య అన్నారు. ఎన్‌ఆర్‌జీఎస్‌కు సంబంధించి అనేక మార్లు కోర్టుల చుట్టూ తిరిగి గురుమూర్తి టీం, పీరయ్య, సుభాషిణి తిరిగి 3300 కోట్లు రైతులకు ఇప్పిం చారు. నీరు-చెట్టులో సైతం రూ.2036 కోట్లు పెండిరగ్ ఉంటే అంతకుముందు రూ.1300 కోట్లు, ఇప్పుడు మార్చి 31 నాటికి రూ.280 కోట్లు రైతులకు ఇప్పించిన విషయా న్ని గుర్తుచేశారు. పీరయ్య ఇచ్చిన స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరింత బలంగా పనిచే స్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, కావలి మాజీ ఎమ్మెల్యే కృష్ణ రెడ్డి, సత్రం రామకృష్ణుడు, కట్టిపల్లి భవానీ, సాయి జనార్దన్, ప్రేరెపి ఈశ్వర్, మల్లెల ఈశ్వర్, శ్రీనివాస్ యాదవ్, నందం అబద్ధయ్య, చేనేత డైరెక్టర్ సింగం వెంకన్న, బీసీ జోన్-4 సభ్యులు చంద్రశేఖర్ యాదవ్, ఎంబీసీ సాధికారిక సమితి రమేష్, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామకృష్ణ ప్రసాద్, నగరాల సాధికారిక కన్వీనర్ తిరుమలేష్, జిడుగ ఆశోక్, మచిలీపట్నం పార్లమెంటు కార్యాలయ కార్యదర్శి బత్తిన దాస్, హజి హసన్‌బా షా, పోతగంటి పీరయ్య (పీరయ్య సోదరుడు), మాజీ ఉపాధి హామీ సభ్యులు సుబ్బ రామయ్య, ఎన్‌ఆర్జీఎస్ ఫిర్యాదుల విభాగం సభ్యులు మొవ్వ సుభాషిణి, రాయన ప్రసాద్, కావులూరు రాజు, చెన్నుపాటి శ్రీధర్, పార్టీ కార్యక్తరలు తదితరులు పాల్గొన్నారు.