- ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 65కు పైగా నిర్మాణం
- అనకాపల్లి జిల్లాలో 20 వేల ఎస్సీ, ఎస్టీ
- లబ్దిదారులకు ఉచితంగా పీఎం సూర్యఘర్
- వైసీపీ ట్రూ అప్ ఛార్జీలలో 13 పైసలు తగ్గించాం
- విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అనకాపల్లి(చైతన్యరథం ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు నాణ్యమైన విద్యుత్ ను నిరంతరాయం సరఫరా చేయడానికే సబ్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా అనకాపల్లిలోరూ.5.50 కోట్లతో నిర్మించనున్న సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయం భవానికి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో కలిసి మంత్రి గొట్టిపాటి శంకుస్థాపన చేశారు. అనంతరం మాడుగుల నియోజక వర్గ పరిధిలోని కే.కోటపాడు మండలం చౌడువాడతో పాటు మాడుగుల మండలం కింతలిలో నిర్మించిన 3311 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం చౌడువాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో -మంత్రి మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాకు 10 సబ్ స్టేషన్లు మంజూరు చేశామన్నారు.
అభివృద్ధి,సంక్షేమమే ప్రధాన ఎజెండాగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నా మన్నారు. బయట నుంచి విద్యుత్ కొనుగోళ్లను కూడా గణనీయంగా తగ్గించామన్నారు. దీని ద్వారా శాఖాపరమైన వ్యయాన్ని, ప్రజలపై పడే -భారాన్ని తగ్గిస్తున్నామని తెలిపారు. ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడం కోసం ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలోని 11 జిల్లాలలో రూ.250 కోట్లతో మొత్తం 65కు పైగా సబ్ స్టేషన్లను నిర్మిస్తున్నట్లు వివరించారు. ప్రజల అవసరార్థం మాడుగుల నియోజకవర్గానికే రెండు సబ్ స్టేషన్లు కేటాయించామన్నారు. స్థానిక శాసనసభ్యుని విజ్ఞప్తి మేరకు ఇదే నియోజకవర్గానికి మరో సబ్ స్టేషన్ మంజూరు చేసినట్లు తెలిపారు. అదే విధంగా అనకాపల్లి జిల్లాలోని 20 వేల ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు ఉచితంగా పీఎం సూర్యఘర్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.
వారి ఇళ్లకు సోలరైజేష్ చేస్తామని హామీ ఇచ్చారు. అనకాపల్లి పరిధిలోని కే.కోటపాడు, వెంకన్నపాలెం విద్యుత్ కేంద్రాలపై పెరుగుతున్న ఒత్తిడి(లోడ్)ను తగ్గించేందుకు చౌడువాడలో 3311 కేవీ ఉప విద్యుత్ కేంద్రాన్ని నిర్మించినట్లు మంత్రి తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా తుఫాను సమయంలో కేవలం 24 గంటల వ్యవధిలోనే 16,000 పైగా దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేసి, విద్యుత్ మసరఫరా పునరుద్ధరించామన్నారు. సిఎం చంద్రబాబు. ఆదార్శినిక పాలనలో తీసుకున్న విద్యుత్ సంస్కరణల -ఫలితంగానే రాష్ట్రంలో విద్యుత్ ఇబ్బందులు “తొలగిపోయాయని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖను ఆదాయ వనరుగా చూసి, ప్రజలపై మోయలేని భారాలు. మోపా రని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం వింధించిన 40 పైసల ట్రూ అప్ ఛార్జీలలో ఇప్పటికే 13 పైసలను తగ్గించామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని మంత్రి గుర్తు చేశారు.
పరిశ్రమల స్థాపనకు భూముల గుర్తింపు
అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ మాడుగుల నియోజకవర్గంలో రెండు వేల ఎకరాలను ఆగుర్తించామని, వాటిని పరిశ్రమల స్థాపనకు అవసరమైన విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మాట్లాడుతూ మాడుగుల ప్రాంతంలో పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ వంటి విద్యా సంస్థల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో -ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, అనకాపల్లి ఎస్ఈ ప్రసాద్ తో పాటు పలువురు కూటమి నేతలు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.












