అమరావతి (చైతన్యరథం): వరల్డ్‌కప్ గెలుచుకున్న టీమిండియా మహిళా జట్టు సభ్యురాలు శ్రీచరణిపై విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు. మొక్కవోని ఆమె పట్టుదల, అంకితభావం ఆంధ్రప్రదేశ్‌ను గర్వపడేలా చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు రూ.2.5 కోట్ల నగదు బహుమతి ప్రకటించిందన్నారు. అంతే కాకుండా గ్రూప్-1 ప్రభుత్వ ఉద్యోగం, కడపలో నివాస స్థలంతో సత్కరిస్తుందని ప్రకటించడానికి సంతోషంగా ఉందని ఎక్స్‌లో మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు.












