- తొలివిడత నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా..
- రూ.100కే పార్టీ సభ్యత్వం
- కార్యకర్తల ప్రమాద బీమా రూ.5లక్షలకు పెంపు
- ఏడు శ్వేతపత్రాలు, జగన్‌రెడ్డి ఫేక్ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- 15న అన్న క్యాంటీన్ల ప్రారంభం
- ప్రజల అర్జీల పరిష్కారానికి తగు యంత్రాంగం
- అఖండ విజయంలో కీలకపాత్ర పోషించిన చంద్రబాబుకు, రాష్ట్రానికి సహకరిస్తున్న కేంద్రానికి ధన్యవాదాలు
- టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం నిర్ణయాలు
- వెల్లడిరచిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా, పొలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ
- పలు అంశాలపై నేతలు, శ్రేణులకు అధినేత, సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం
అమరావతి(చైతన్యరథం): త్వరలోనే జన్మభూమి`2 కార్యక్రమం కింద అభివృద్ధి పనులు ప్రారంభించాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం నిర్ణయించింది. తొలివిడత నామినేటెడ్ పోస్టుల భర్తీ త్వరలోనే చేపట్టాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విభజన చట్టం హామీల అమలుకు సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి పొలిట్‌బ్యూరో ధన్యవాదాలు తెలియజేసింది. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన గురువారం పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ప్రజా రాజధాని అమరావతి-పోలవరం నిర్మాణం-నదుల అనుసంధానం, ఎనిమిది వెనకబడ్డ జిల్లాలకు కేంద్ర సహకారం,
నామినేటెడ్ పోస్టుల భర్తీ, జన్మభూమి`2 కార్యక్రమం, 22 ఏ దుర్వినియోగం, ఆగస్టు 15న అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవం, నరేగా, నీరు`చెట్టు బిల్లుల విడుదల, ప్రజావేదిక, ప్రజాదర్బార్‌లో వచ్చిన అర్జీల పరిష్కారానికి తగు యంత్రాంగం ఏర్పాటు, జన్మభూమి`2 ద్వారా పేదరికం లేని సమాజ నిర్మాణం, రూ.100కే పార్టీ సభ్యత్వంతోపాటు రూ.5 లక్షల ప్రమాద బీమా, ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ఫేక్ ప్రచారం, విధ్వంస పాలనపై చర్చించారు. ఎన్నికల విజయంలో కీలకపాత్ర వహించిన చంద్రబాబునాయుడుని, విభజన హామీల అమలుకు కేంద్ర బడ్జెట్‌లో చొరవ చూపిన కేంద్ర ప్రభుత్వాన్ని పొలిట్‌బ్యూరో అభినందించింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు మీడియాకు తెలియజేశారు. ఈ సమావేశంలో పలు అంశాలపై నేతలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారన్నారు.
శ్వేతపత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసాలు, దోపిడీ, భూ కబ్జాలపై కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ఏడు శ్వేతపత్రాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సమావేశంలో పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ…. వివేకా హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేసేందుకు వైసీపీ నేతలు ఏ విధంగా ప్రయత్నించారో, మదనపల్లెలో భూ కుంభకోణాలకు సంబంధించిన సాక్షాలను తారుమారు చేసేందుకు కూడా అదే విధంగా కుట్ర చేశారన్నారు. వివేకాది గుండెపోటని ప్రచారం చేసినట్లే.. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫై˜ౖళ్ల దగ్ధాన్ని షార్ట్ సర్య్కూట్ అని ప్రచారం చేసి సాక్షాలు తారుమారు చేసే ప్రయత్నం చేశారు. వెంటనే స్పందించి ఉన్నతాధికారులను సంఘటనా స్థలానికి పంపడంతో వాస్తవాలు బట్టబయలయ్యాయి. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలపై ఒక్కరోజులోనే వేలాది మంది బాధితులు స్వచ్ఛందంగా వచ్చి ఫిర్యాదు చేశారంటే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ విధంగా అరాచకాలకు పాల్పడ్డారో ఈ సంఘటన ద్వారా బట్టబయలయిందని సీఎం చంద్రబాబు అన్నారు.
జగన్ రెడ్డిది నేరస్థుల గుంపు
వైసీపీ అంటేనే నేరస్థులు, అరాచకవాదులని సీఎం చంద్రబాబు అన్నారు. ఆ పార్టీలో నాయకులు ఉండేది ప్రజలకు సేవ చేద్దామని కాదు ప్రజల ఆస్తులను దోచుకోవడానికి. 13 లక్షల ఎకరాలకు పైగా అసైన్డ్ భూములను కాజేయడంతో పాటు 40 వేల ఎకరాల అసైన్డ్ భూములను రిజస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. మరో వైపు 22ఏ భూములపై అధికార దుర్వినియోగానికి పాల్పడి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు, దందాలు చేశారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.
55 రోజుల్లో పాలనా విజయాలు
కూటమి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి హోదాలో చేసిన ఐదు సంతకాల అమలును ప్రారంభించామని చంద్రబాబు నాయుడు తెలిపారు. పింఛన్లు రూ.4 వేలకు పెంపు, 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించటం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్యగణన వంటి వాటిని ప్రభుత్వం అమలు చేస్తోంది. దాతల నుంచి విరాళాలు సేకరించి తిరుమలలో అన్నదాన కార్యక్రమం ఏ విధంగా చేపట్టామో అదే మాదిరి అన్న క్యాంటీన్లు విజయవంతంగా నిర్వహిస్తాం. ఒక్క రోజులోనే 98 శాతానికి పైగా పింఛన్లను పంపిణీ చేసి వృద్ధులు, వికాలాంగులు ఎవరూ ఇబ్బందులు పడకుండా చేశాం. పీ4 విధానం ద్వారా పేదరిక నిర్మూలన, సంపద సృష్టికి కృషి చేస్తాం. అలాగే ఇటీవల కురుసిన వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
జన్మభూమి 2 కింద అభివృద్ధి కార్యక్రమాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి నీతి ఆయోగ్ సహకారంతో సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. గతంలో విజన్ 2020 మంచి ఫలితాలను ఇచ్చింది. అలానే విజన్ 2047ను రూపొందిస్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన జన్మభూమి కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. నాడు చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రజల సహకారంతో జన్మభూమి 2 కింద అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.
కేంద్ర సహకారంతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి
అమరావతి నిర్మాణానికి, పోలవరం పూర్తి చేయడానికి, 8 వెనకబడ్డ జిల్లాల అభివృద్ధికి అవసరమైన నిధులు ఇవ్వడానికి కేంద్రం సత్వరమే అంగీకరించడం శుభ పరిణామమని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం డయాఫ్రం వాల్ మూడు చోట్ల దెబ్బ తిన్నది. దానిపై ఏం చేయాలనేదానిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్ర పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరం. ఏపీలో కూటమి ప్రభుత్వం సాధించిన అద్భుత విజయంతో ఢల్లీిలోనూ మనకు ప్రత్యేక గౌరవం లభిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు.
పార్టీ సభ్యుల ప్రమాద బీమా పెంపు
పార్టీ సభ్యులకు ఇచ్చే ప్రమాద బీమాను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. వాట్సాప్ ద్వారా సభ్యత్వ నమోదు చేసుకునే వెసులుబాటును కల్పిస్తాం. ఓటీపీ నమోదు చేసి రూ.100 రుసుం చెల్లించి సభ్యత్వం తీసుకోవచ్చు. పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి వెంటనే వాట్సాప్‌లోనే కార్డు పంపిస్తారు. ఆ తర్వాత ఒరిజినల్ సభ్యత్వ కార్డును బూత్‌ల ద్వారా కార్యకర్తలకు అందజేస్తారు. పార్టీ సంక్షేమ విభాగం ద్వారా ఇప్పటివరకు రూ.120 కోట్ల మేర ప్రమాద బీమా అందించాం. సంక్షేమ విభాగం తరుపున పార్టీ కుటుంబ సభ్యులైన 1,672 మంది విద్యార్థులకు వారి చదువుల నిమిత్తం సుమారు రూ.2 కోట్ల 35 లక్షలు ఆర్థికం సహాయం అందించాం. విదేశాలలో చదువుతున్న, చదవాలనుకున్న సుమారు 180 మందికి కూడా అవసరమైన సహాయ, సహకారాలు అందించాం. పార్టీ స్కిల్ డెవలప్‌మెంట్, ఎంపవర్‌మెంట్ విభాగం ద్వారా 2,437 మందికి వివిధ కంపెనీలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాం. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ విభాగం ద్వారా 2 వేల మందికి శిక్షణను ఇచ్చి 850 మందికి, రాష్ట్రంలో రెండు వందల మందికి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించాం. భవిష్యత్తులో కార్యకర్తలు వారి కాళ్ల మీద వారు నిలబడే విధంగా ఎంపవర్‌మెంట్ చేయాలని నిర్ణయించాం. కార్యకర్తల కుటుంబాల విద్య, వైద్య, ఉపాధి కోసం పార్టీ అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
నిబద్ధతతో పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు
నిబద్ధతతో కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తల త్యాగాలు మర్చిపోలేవి. ప్రభుత్వానికి, పార్టీకి సమాంతర ప్రాధాన్యత ఇస్తాం. గతంలో ఎన్నడూ చేయని విధంగా రాత్రింబవళ్లు కసరత్తు చేసి సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసి అన్ని వర్గాల ప్రజల ఆమోదం పొందాం. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా అదే విధమైన కసరత్తు నిర్వహిస్తున్నాం. అర్హులైన వారందరికీ, ప్రజామోదం ఉన్నవారందరికీ పదవులు లభిస్తాయి. సిఫార్సులతో సంబంధం లేకుండా పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను గుర్తించి దశల వారిగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తాం. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి మంత్రులు తప్పనిసరిగా రావాలి. కార్యకర్తలు, ప్రజల నుంచి అర్జీలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాము.
రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిన జగన్ రెడ్డిని ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల్లో కూలీలుగా పనిచేస్తున్నవారు, వైసీపీ విధ్వంస పాలన వల్ల ఉపాధి కోల్పోయి వలస వెళ్లిన కార్మికులు కూడావచ్చి ఎన్నికల్లో ఓటేశారు. అలానే ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ఐలు విదేశాల నుంచి వచ్చి ఏడాదిపాటు ఇక్కడే ఉండి పనిచేసినవారు కూడా ఉన్నారు. సకాలంలో వర్షాలు పడి రిజర్వాయర్లు నిండటం శుభపరిణామం. వ్యవసాయ అనుకూల వాతావరణం ఏర్పడిరది. జిల్లాల జనాభా దామాషాను బట్టి ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని పోలిట్ బ్యూరో ప్రతిపాదించింది. వైసీపీ తప్పుడు ప్రచారాలు, కుట్రలను పార్టీ శ్రేణులంతా వెంటనే తిప్పి కొట్టి ప్రజల్లో చైతన్యం తేవాలి.
ఉచిత ఇసుక వంటి వాటిపై దురుద్దేశంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు.
అదే విధంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తగిన కృషి చేయాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. ఈ చారిత్రాత్మ విజయంలో భాగస్వాములైన పార్టీ నాయకులు, కార్యకర్తలు సేవలు మరువలేనివని, వైసీపీ అవినీతి, అరాచకాలపై పోరాడి 52 రోజులపాటు జైలుకు వెళ్లొచ్చి, సమర్థవంతమైన నాయకత్వం అందించిన చంద్రబాబు నాయుడుకి పొలిట్‌బ్యూరో ధన్యవాదాలు తెలియజేసిందని పల్లా, కాల్వ తెలియజేశారు.