- ప్రజాదర్బార్‌లో వినతుల స్వీకరణ
కుప్పం (చైతన్యరథం): సమస్యలు పరిష్కరించి అండగా ఉంటామని కుప్పం నియోజకవర్గ ప్రజలకు సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి హామీ ఇచ్చారు. నియోజకవర్గ పర్యటనలో మూడోరోజు శుక్రవారం శాంతిపురం మండలం శివపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్‌లో స్థానిక ప్రజల నుంచి ఆమె వినతులు స్వీకరించారు. సమస్యలతో వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పలువురు టీడీపీ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.















