చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

సంజీవని.. దేశానికే దిక్సూచి!

వైద్యారోగ్యశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం

చైతన్యరధం by చైతన్యరధం
November 22, 2025
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
సంజీవని.. దేశానికే దిక్సూచి!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • కుప్పం పైలెట్‌ ప్రాజెక్టు.. గేమ్‌ఛేంజర్‌ కానుంది
  • దీన్ని రాష్ట్రానికీ విస్తరించే ప్రణాళికలు సిద్ధం చేయండి
  • ఏప్రిల్‌ 1నుంచి యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీపై కార్యాచరణ
  • పీపీపీ విధానంలో మెడికల్‌ కాలేజీలతో ప్రజలకే లాభం
  • వైద్య కళాశాలలు పూర్తయితే గ్రామీణ ప్రాంతాలకూ ఆధునిక వైద్యం
  • వైద్యారోగ్యశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం

అమరావతి (చైతన్య రథం): మెడికల్‌ కాలేజీలను పీపీపీ పద్దతిలో చేపడుతున్నా… పర్యవేక్షణ, అజమాయిషీ మాత్రం ప్రభుత్వమే చేపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పేదలకు ఉచితంగా మెరుగైన సేవలు అందించేందుకు మెడికల్‌ కాలేజీల నిర్మాణం చేపడుతున్నట్టు వెల్లడిరచారు. వైద్యారోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా మెడికల్‌ కాలేజీల నిర్మాణం, కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్శల్‌ హెల్త్‌ స్కీంపై అధికారులతో చర్చించారు. పీపీపీ కింద తొలి విడతలో చేపట్టనున్న ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల మెడికల్‌ కాలేజీల నిర్మాణ ప్రక్రియపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రస్తుతం టెండర్‌ ప్రక్రియలో భాగంగా నాలుగు దశలు దాటామని.. వచ్చే నెలాఖరుకు టెండర్‌ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు వెల్లడిరచారు. మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి వచ్చేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పీపీపీ విధానంలో చేపడుతున్న వైద్య కళాశాలల ద్వారా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రమే అందే ఆధునిక వైద్య సదుపాయాలు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తాయని అన్నారు. ప్రజలకు, విద్యార్ధులకు అంతిమంగా మొత్తం సమాజానికి ఈ మెడికల్‌ కాలేజీలతో ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు.

‘‘ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న ఒక్కో మెడికల్‌ కాలేజీ నిర్మాణం కోసం 50 ఎకరాలు కేటాయించాం. 50 ఎకరాల్లో 25 ఎకరాలు మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలి. మిగిలిన 25 ఎకరాల్లో నర్సింగ్‌, పారామెడికల్‌, డెంటల్‌లాంటి ఆయుర్వేద, వెల్‌నెస్‌ సెంటర్‌, యోగా కేంద్రాలు ఏర్పాటు చేసి ఇంటిగ్రేట్‌ చేయాలి. ఆస్పత్రుల్లో 70 శాతంమేర పడకలు పేదలకు ఉచితంగా కేటాయిస్తున్నాం. అలాగే వైద్య సేవలు కూడా ఉచితంగానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ మోడళ్లల్లో నిర్వహిస్తున్న ఆస్పత్రులున్నాయి. వాటిని ఆధ్యయనం చేయండి. రోగులకు మెరుగైన, నాణ్యమైన సేవలు సులభంగా అందాలి. ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం ఈ వైద్య కళాశాలలు పనిచేసేలా చూడాలి. బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ చేస్తున్న ఆస్పత్రులకు రేటింగ్‌ ఇవ్వాలి. నీతి ఆయోగ్‌ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ప్రమాణాలు, నిబంధనలు ఉండాలి’’ అని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

దేశానికే దిక్సూచి సంజీవని ప్రాజెక్టు
కుప్పంలో పైలట్‌గా అమలు చేస్తున్న డిజినెర్వ్‌ సెంటర్‌ సంజీవని ప్రాజెక్టు రాష్ట్రానికి ఓ గేమ్‌ చేంజర్‌గా మారుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వైద్యారోగ్య రంగంలో దేశం మొత్తానికి ఓ దిక్సూచిగా ప్రాజెక్టు నిలిచే అవకాశం ఉంటుందని అన్నారు. డిజిటల్‌ హెల్త్‌ రికార్డుల ద్వారా ప్రజారోగ్యాన్ని పర్యవేక్షిస్తామన్నారు. ప్రస్తుతం కుప్పంలో పైలట్‌గా చేస్తున్న సంజీవని ద్వారా 3.38 లక్షలమందికి సంబంధించిన ఆరోగ్య వివరాలను సేకరించాలని సూచించారు. కుప్పంలో రిజిస్టరైన ప్రజలకు పరీక్షలు నిర్వహించి వ్యాధుల ప్రొఫైల్స్‌ను సిద్ధం చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సంజీవని డిజిటల్‌ నెర్వ్‌ సెంటర్‌ ద్వారా కుప్పంలో ప్రజల ఆరోగ్య పరిస్థితి, డిజిట్‌ హెల్త్‌ రికార్డులు సిద్ధం చేశామని తెలిపారు. 49 వేలమంది రోగులకు సంబంధించిన డేటాను సేకరించామని అధికారులు తెలిపారు. బ్లడ్‌ ప్రొఫైల్‌, అనీమియా, కార్డియాక్‌ ప్రొఫైల్‌, కిడ్నీ ప్రొఫైల్‌, లివర్‌ ప్రొఫైల్‌, డయాబెటీస్‌లాంటి వాటిని గుర్తించి డేటా రూపొందించామని వివరించారు. 2026 జనవరి 1నుంచి చిత్తూరు జిల్లా మొత్తానికి ఈ సంజీవని ప్రాజెక్టును ప్రారంభించనున్నట్టు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం రాష్ట్రానికి కూడా ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సంజీవిని ప్రాజెక్టు సమర్థంగా అమలుచేస్తే వైద్యారోగ్యంలో ప్రభుత్వం చేసే వ్యయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుందన్నారు. టాటా- బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్న ఈ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం కావాలని సీఎం ఆకాంక్షించారు. వీటితోపాటు రాష్ట్రంలో ప్రత్యేకంగా నేచురోపతి ఆస్పత్రితోపాటు యోగా కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ప్రజారోగ్యంలో ప్రివెంటివ్‌, క్యూరేటివ్‌ విధానం
రాష్ట్రప్రభుత్వం అమలు చేయనున్న యూనివర్సల్‌ హెల్త్‌ ఇన్స్యూరెన్సు విధానాన్ని 2026 ఏప్రిల్‌ 1నుంచి అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం 12 లక్షల క్లెయిమ్‌లు ఆస్పత్రులనుంచి ఎన్టీఆర్‌ వైద్య సేవా ట్రస్టుకు వస్తున్నాయని తద్వారా నెలకు రూ.330 కోట్ల వ్యయం చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో.. ఏ వ్యాధికి ఎంత వ్యయం చేస్తున్నామో విశ్లేషించాలని సీఎం సూచించారు. ప్రత్యేకించి ప్రజారోగ్యంలో ప్రివెంటివ్‌, క్యూరేటివ్‌ విధానం ద్వారా వైద్యారోగ్య రంగంపై ప్రభుత్వం చేస్తున్న వ్యయంతోపాటు ప్రజల వ్యక్తిగత వ్యయం కూడా తగ్గేలా చూడాలని స్పష్టం చేశారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా సేకరించిన డేటాను విశ్లేషించేందుకు ఓ యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేయాలని ముఖ్యమంత్రి వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. సమీక్షకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ హాజరయ్యారు. సమీక్షలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు సౌరబ్‌ గౌర్‌, వీరపాండియన్‌ తదితరులు పాల్గొన్నారు

Previous Post

ఆక్వా పురోభివృద్ధే లక్ష్యం

Next Post

సమస్యలు పరిష్కరించి.. తోడుగా ఉంటాం

Next Post
సమస్యలు పరిష్కరించి.. తోడుగా ఉంటాం

సమస్యలు పరిష్కరించి.. తోడుగా ఉంటాం

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.