చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ఇంటింటా.. సౌర వెలుగు!

సౌర విద్యుత్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

చైతన్యరధం by చైతన్యరధం
November 26, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఇంటింటా.. సౌర వెలుగు!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఇక ప్రతి ఇల్లూ విద్యుత్కేంద్రం కావాలి
  • ప్రభుత్వ కార్యాలయాలనూ సిద్ధం చేయండి
  • సోలార్‌ పవర్‌లో స్వావలంబన సాధించాలి
  • ఎస్సీ ఎస్టీల ఇళ్లపై సోలార్‌ పలకల ఏర్పాటు
  • వినియోగదారుల ఆదాయానికి ఇదొక ఛాన్స్‌
  • పీఎం సూర్యఘర్‌, కుసుమ్‌ ద్వారా గరిష్ట లబ్ది
  • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు
  • సౌర విద్యుత్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలోని ప్రతీ ఇల్లూ.. ప్రతీ కార్యాలయం సౌరశక్తిని ఒడిసిపట్టి విద్యుదుత్పత్తి -వినియోగంలో స్వావలంబన సాధించే దిశగా అడుగులేయాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలపునిచ్చారు. రాష్ట్రం సౌర విద్యుదుత్పత్తి కేంద్రం కావాలని, సౌర విద్యుత్‌ను పూర్తిస్థాయి వినియోగానికి అవసరమైన ప్రణాళిక సత్వరం అమలుచేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక వాతారవణ పరిస్థితుల కారణంగా సోలార్‌ విద్యుదుత్పత్తిలో తిరుగులేని ఫలితాలు సాధించవచ్చని సీఎం అన్నారు. సోలార్‌ విద్యుత్‌తో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించి. సోలరైజేషన్‌లో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలని ముఖ్యమంత్రి సూచించారు. తమ ఇళ్లపై సోలార్‌ విద్యుదుత్పత్తి ద్వారా వినియోగదారుడు తమకు అవసరమైన విద్యుత్‌ను ఉచితంగా పొందడమే కాకుండా…. తాను వినియోగించుకోగా మిగలిన విద్యుత్‌తో అదనంగా ఆదాయం పొందే పరిస్థితి రావాలని సీఎం అన్నారు. దీనికోసం ప్రజలను చైతన్యపర్చి.. కేంద్ర కార్యక్రమాలైన పీఎం సూర్యఘర్‌, కుసుమ్‌ పథకాలను వారికి చేరువ చేయాలన్నారు. రాష్ట్రంలో సౌరవిద్యుత్‌కు ప్రోత్సాహంలో భాగంగా చేపట్టిన సోలరైజేషన్‌ అమలుతీరును సచివాలయంలో చంద్రబాబు సమీక్షించారు. ప్రజల ఇళ్లపై సౌరవిద్యుదుత్పత్తి, 100 శాతం సౌర విద్యుత్‌ గ్రామాలు ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ ఇళ్లపై 100 శాతం సోలార్‌ విద్యుత్‌ పరికరాల ఏర్పాటు, పూర్తిస్థాయి సోలరైజేషన్‌లో భాగంగా కుప్పాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకుని చేపట్టే పనులపై అధికారులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాలకు పూర్తిస్థాయిలో సౌరవిద్యుత్‌ వినియోగంలోకి తెచ్చే అంశంపైనా అధికారులు సాధ్యాసాధ్యాలను వివరించారు. కేంద్ర పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై ప్రజెంటేషన్‌ ద్వారా సీపంకు వివరించారు.
భారీ ఎత్తున కేంద్ర సబ్సిడీ
పీఎం సూర్య ఘర్‌ `ముఫ్త్‌ బిజిలీ యోజన పథకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ ప్రారంభించారు. ఏడాదిలో కోటి గృహాలు ఈ పథకం పరిథిలోకి తేవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా, 30 లక్షల ఇళ్లలో ఈ పథకాన్ని ఏపీలో అమలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. సోలార్‌ రూఫ్‌ టాప్‌ అమర్చుకునే గృహ విద్యుత్‌ వినియోగదారులకు కేంద్రం భారీగా సబ్సిడీ ఇస్తోంది. 1 కిలోవాట్‌కి ఎస్‌ఆర్టీ (సోలార్‌ రూఫ్‌ టాప్‌)కి రూ.50 వేలు ఖర్చవుతుండగా, రూ.30 వేలు సబ్సిడీ రానుంది. అలాగే 2 కిలోవాట్లకు వ్యయం రూ.1 లక్ష కాగా సబ్సిడీ రూ.60 వేలు, 3 కిలోవాట్లకు పెట్టుబడి రూ.లక్షా 45వేలు కాగా రూ. 78 వేలు సబ్సిడీ రూపంలో కేంద్రం ఇస్తుంది.
రాష్ట్రంలో 6 లక్షలమంది రిజిస్ట్రేషన్‌
రాష్ట్రంలో ఈ పథకానికి తమ సమ్మతి తెలుపుతూ ఇప్పటివరకు 6,33,045 మంది గృహ విద్యుత్‌ వినియోగదారులు రిజిష్టర్‌ చేసుకున్నారని అధికారులు తెలిపారు. వీరిలో పీఎం సూర్యఘర్‌ పథకానికి 70,110 ధరఖాస్తు చేయగా, 4,961 గృహాలపై ఇప్పటికే సోలార్‌ ప్యానల్స్‌ అమర్చడం పూర్తయ్యింది.
కుప్పం సెగ్మెంట్‌లో 100శాతం సౌర విద్యుత్‌ లక్ష్యం
కుప్పం సెగ్మెంట్‌లో 50,314 ఇళ్లు సౌరవిద్యుత్‌ అమర్చేందుకు అనుకూలంగా ఉండగా, 50,312 ఇళ్ల యజమానులు తమ అంగీకారం తెలిపారు. దీంతో కుప్పం నియోజవర్గంలో 2 కోట్ల 66 లక్షల 15 వేల 521 చదరపు అడుగుల విస్తీర్ణంలో సోలార్‌ రూఫ్‌ టాప్‌ విద్యుదుత్పత్తికి అవకాశం లభిస్తుంది. పీఎంఎస్జీఎంబీవై కింద చేపట్టిన కుప్పం రెస్కో ప్రాజెక్టుకు మొత్తం రూ.286 కోట్లు వ్యయం అవుతుంది. ఇందులో రూ.172 కోట్లు కేంద్రం నుంచి సబ్సిడీ రూపంలోనే వస్తుంది. మిగిలిన రూ.114 కోట్లను లబ్దిదారులు రుణంగా పొందే అవకాశముందని అధికారులు వివరించారు.
ప్రభుత్వ భవనాలకు సోలార్‌ విద్యుత్‌
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపైనా సౌర పలకలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వానికి 100 మెగావాట్లకు సుమారు రూ.349 కోట్ల నుంచి రూ.379 కోట్ల వరకు విద్యుత్‌ బిల్లుల రూపంలో ఆదా కానుంది. లక్ష యూనిట్లకు పైగా విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంతో 2,186 ప్రభుత్వ కార్యాలయాలను సోలార్‌ రూఫ్‌ టాప్స్‌ కోసం గుర్తించడం జరిగింది. 19,53,369 చదరపు మీటర్ల పరిథిలో సౌర విద్యుత్‌ పలకలు ఏర్పాటు చేస్తే ఏడాదికి 2,62,252 కిలోవాట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. అయితే ఇందుకు రూ.262.25 కోట్లు వ్యయం కానుంది. ఎన్టీపీసీ విద్యుత్‌ వ్యాపార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున జీఏడీ లేదా ఆర్ధిక శాఖ గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయించారు.
పేద ఎస్సీ, ఎస్టీ గృహాలకు ప్రాధాన్యత
పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు గృహానికి నెలకు ప్రస్తుతం 200 యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్‌ అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం కింద 20.38 లక్షల గృహ వినియోగదారులు లబ్దిపొందుతున్నారు. ఇప్పుడు ఈ గృహాలకు పీఎంఎస్జీఎంబీవై కింద సోలార్‌ రూఫ్‌ టాప్‌ ప్యానెల్స్‌ అమర్చాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే 81శాతం గృహాలకు సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసేందుకు వెసులుబాటు లేదు. మిగిలిన 19శాతం గృహాలకు ఫస్ట్‌ఫేజ్‌ కింద పీఎంఎస్జీఎంబీవై పథకాన్ని అమలు చేసే అవకాశముందని అధికారులు ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.
పీఎం కుసుమ్‌ స్కీం పథకం
పీఎం కుసుమ్‌ స్కీం పథకం కింద రాష్ట్రంలో 14,94,453 వ్యవసాయ విద్యుత్‌ పంపు సెట్లకు సోలార్‌ ప్యానల్స్‌ అమర్చే అవకాశముందని అధికారులు తెలిపారు. కుసుమ్‌ పథకం ద్వారా ఫేజ్‌ 1కింద 3572 మెగావాట్ల సోలార్‌ విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
మోడల్‌ సోలార్‌ విలేజ్‌
రాష్ట్రంలో మొత్తం 132 గ్రామాలను సోలార్‌ విలేజస్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ గ్రామాల్లో 100 శాతం ఇళ్లు సోలార్‌ విద్యుదుత్పత్తిని సాధిస్తాయి. సోలార్‌ గ్రామాలకు కేంద్రం రూ.1 కోటి సాయం కింద ఇవ్వనుంది. అధికారుల ప్రజెంటేషన్‌ అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ పథకం అమలుపై వేగంగా ముందుకెళ్లాలని సూచించారు. విద్యుత్‌ బిల్లల భారం నుంచి విద్యుదుత్పత్తి ద్వారా ఆదాయం ఆర్జించే అవకాశాన్ని ప్రజలకు కల్పించవచ్చని సీఎం అన్నారు. కేంద్ర పథకాలను వేగంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 55 వేల ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉన్నాయని అధికారులు తెలపగా…. వీటిలో ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలకు, వ్యక్తిగత వాహనాలకు విరివిగా చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ వాహనాలకు తీసుకునే విద్యుత్‌ టారిఫ్‌లను కూడా నిర్ణయించాలని అధికారులకు సూచించారు.

Previous Post

ఇక ఏకగవాక్ష విధానం

Next Post

శ్రీశైలం-హైదరాబాద్‌ హైవే రద్దీ

Next Post

శ్రీశైలం-హైదరాబాద్‌ హైవే రద్దీ

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.