- ఉపాధి కల్పనే లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధి
- ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు సాధించేందుకు ప్రణాళికలు
- పారిశ్రామిక అవసరాల మేరకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు
- గ్రామీణ యువత ఉపాధి కోసం సెంచూరియన్ వర్సిటీతో ఒప్పందం
- మంత్రి లోకేష్ చొరవతో స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ వేగవంతం
- రానున్న ఆరునెలలకు రూట్‌మ్యాప్ సిద్ధం
అమరావతి (చైతన్యరథం): సాంకేతికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా యువతలో నైపుణ్యాభివృద్ధి ద్వారానే ఉపాధి అవకాశాలు సాధ్యమని గుర్తించిన రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్…ఇందుకోసం గత ఆరునెలలుగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఐదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ అమలుకు ఉపాధి కల్పన సబ్‌కమిటీ చైర్మన్‌గా శాయశక్తులా కృషిచేస్తున్నారు. విద్యతోపాటు యువతలో నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టి, దేశంలోనే తొలిసారిగా స్కిల్ సెన్సస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు స్వయం ఉపాధి ఆధారిత కార్యక్రమాలతో నైపుణ్యాలను పెంపొందించి తద్వారా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఇటీవల సెంచూరియన్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిద్వారా దుస్తుల తయారీ, ఆటో విడిభాగాలు, డ్రాగన్ ఫ్రూట్ సాగు, స్మార్ట్ వ్యవసాయం, డ్రోన్ టెక్నాలజీ వంటి రంగాల్లో ఎంటర్‌ప్రైజ్ క్లస్టర్లను ఏర్పాటుచేసి ఆయా రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు.
అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న కోర్సుల్లో యువతకు సీడాప్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇప్పించి, విదేశాల్లో సైతం ఉద్యోగాలు కల్పించేలా ఇటీవల 2కామ్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ సహకారంతో సీడాప్ ద్వారా అమలుచేస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన (డిడియుజికెవై) లక్ష్యానికి అనుగుణంగా ఎంప్లాయ్‌మెంట్ ఓరియంటెడ్ స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్, వీసా సపోర్టు కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ వృత్తివిద్య కళాశాలల్లో విద్యాభ్యాసం పూర్తిచేసి బయటకువెళ్లే ఏ ఒక్క విద్యార్థి నిరుద్యోగిగా ఉండరాదన్న సంకల్పంతో ప్రణాళికాబద్ధంగా మంత్రి లోకేష్ ముందుకు సాగుతున్నారు.
స్కిల్ సెన్సస్ కార్యక్రమానికి శ్రీకారం
రాష్ట్రానికి పెద్దఎత్తున తరలిస్తున్న పరిశ్రమల అవసరాలను గుర్తించి అందుకు తగ్గట్టుగా యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు దేశంలోనే తొలిసారిగా స్కిల్ సెన్సస్ కార్యక్రమానికి మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తొలివిడతగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం, తుళ్లూరు మండలాల్లోని 1.12 లక్షల గృహాలు, 2.77 లక్షల మంది నివాసితులకు సంబంధించిన నైపుణ్యగణన పూర్తయింది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ సెన్సస్ ప్రారంభించి, ఆరునెలల్లో పూర్తిచేసేలా ఏర్పాట్లు చేశారు. డిడియుజికెవై పథకం కింద 6,035 మంది అభ్యర్థులకు వృత్తిశిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఏరోస్పేస్, ఆటోమోటివ్, షిప్ బిల్డింగ్‌పై దృష్టి సారించి, 63 ఇంజినీరింగ్ కళాశాలల్లోని 2,506 మంది అభ్యర్థులకు హై-ఎండ్ డస్సాల్ట్ సిస్టమ్స్ ల్యాబ్‌ల్లో శిక్షణ ఇప్పించారు. వాద్వాని ఫౌండేషన్, నాస్కామ్ వంటి సంస్థల సహకారంతో 483 డిగ్రీ కాలేజీలలో టెక్నికల్, ఎంప్లాయబిలిటీ, సాఫ్ట్ స్కిల్స్‌లో 27,928 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద, 35,489 మంది సాంప్రదాయ కళాకారులకు వారి సంప్రదాయ ఉత్పత్తులు, సేవలను మెరుగుపర్చేలా శిక్షణ ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా 200 స్కిల్ హబ్‌లు ఏర్పాటు చేసి, 7,141 మంది అభ్యర్థులకు శిక్షణ అందించారు. సీఎం స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్లలో సేల్స్‌ఫోర్స్, ఐబీఎం, ఒరాకిల్ వంటి సంస్థల సహకారంతో పరిశ్రమ గుర్తింపు పొందిన సర్టిఫికేషన్ కోర్సుల్లో 47,279 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చారు. రాష్ట్రంలో పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి ఉండేలా 25 నైపుణ్య కళాశాలలు ఏర్పాటు చేసి, 1,268 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో జాబ్ మేళాలు నిర్వహించగా, 27,948 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు లభించాయి. రాష్ట్రంలోని 1,10,587 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు (95%), 16,641 మంది ఐటీఐ విద్యార్థుల (83%)కు ఇచ్చారు. స్టేట్ బోర్డు అఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌బీటీఈటీ) పరిధిలోని పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం 54 పాఠ్యపుస్తకాలు, 37 ల్యాబ్ మాన్యువళ్లను ప్రచురించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం 32 యాడ్-ఆన్ స్కిల్ కోర్సులను అభివృద్ధి చేశారు.
రాబోయే ఆరు నెలలకు రూట్ మ్యాప్
స్కిల్ డెవలప్‌మెంట్ శాఖలో రాబోయే ఆరునెలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై మంత్రి లోకేష్ రూట్ మ్యాప్ ఇచ్చారు. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేలా శాఖాధిపతులు, సిబ్బంది కృషిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులందరికీ (100%) ఇవ్వాలి. రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ సెన్సస్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపట్టాలి. పరిశ్రమ భాగస్వామ్యంతో 200 స్కిల్ హబ్‌ల్లో 20,000 మంది అభ్యర్థులకు, 37 స్కిల్ కాలేజీల్లో 2,000 మంది అభ్యర్థులకు, స్కిల్ స్పోక్స్‌లో 2,000 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలి. ఏపీ బిల్డింగ్, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి చీAజ కేంద్రాల్లో 2,500 మంది కార్మికులకు శిక్షణ ఇవ్వాలి. పవర్ గ్రిడ్` సీఎస్‌ఆర్ ద్వారా 150 మందికి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ` సీిఎస్‌ఆర్ కాంపోనెంట్ కింద 30 మందికి చీAజ కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. డిడియుజికెవై నైపుణ్యాభివృద్ధి ద్వారా 26,000 మంది అభ్యర్థులకు ఉపాధి కల్పించాలి. ఇంజినీరింగ్ కళాశాలల నుండి 20,000 మంది విద్యార్థులకు సీఎం ఎక్సలెన్స్ సెంటర్‌ల ద్వారా, 25,000-డిగ్రీ విద్యార్థులకు ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్లలో, 10,000 మంది విద్యార్థులకు డసాల్ట్ సెంటర్లలో (జAణ) శిక్షణ ఇవ్వాలి.
స్కిల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కింద నర్సింగ్, కన్‌స్ట్రక్షన్, ఆటోమొబైల్ వంటి రంగాల్లో అభ్యర్థులను రిక్రూట్ చేయడానికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలను సీడాప్ ద్వారా పూర్తిచేయాలి. ఇండో-యూరో సింక్రొనైజేషన్, 2కామ్స్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా జర్మనీలో నర్సు పోస్టుల కోసం విదేశీ నియామకాలను సులభతరం చేయాలి. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద కళాకారులకు శిక్షణ, నల్‌జల్ మిత్ర పథకం కింద అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. డీఈటీ, ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా పరిశ్రమ ఆన్‌బోర్డింగ్, కమ్యూనిటీ అవగాహన కోసం పీఎం ఇంటర్న్‌షిప్ అవగాహన ప్రచారాలను ప్రారంభించాలి. రాష్ట్రవ్యాప్తంగా జాబ్ మేళాలను నిర్వహించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రయోగశాలలను ఆధునీకరించి, అప్‌గ్రేడ్ చేయాలి. ఐటీఐల్లో పరిశ్రమల ప్రయోగశాలలను ఏర్పాటు చేయాలి. డిప్లొమా విద్యార్థుల కోసం ఎస్‌బీటీఈటీ ద్వారా 6 శాఖలకు 5వ సెమిస్టర్ పాఠ్యపుస్తకాలు, ల్యాబ్-మాన్యువల్‌లను సకాలంలో ముద్రించి, అందించాలని సూచించారు. మంత్రి లోకేష్ చొరవతో గత ఆరునెలలుగా రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి.