అమరావతి (చైతన్యరథం): గణితంపై పిల్లల్లో భయాన్ని పోగొట్టేందుకు ఓ ఉపాధ్యాయుడు చేస్తోన కృషిని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ అభి నందించారు. చాలా మంది విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులే వస్తున్నా గణితమంటే ఏదో తెలియని భయం. అయితే ఏ అంశాన్నయినా సరదాగా ఓ ఆటలా నేర్పిస్తే పిల్లలు సులభంగా గుర్తుంచుకుంటారనే ఉద్దేశంతో ఈ టీచర్ ఆటపాట లతో గణితం నేర్పిస్తున్నారు. ఆయనే నంద్యాలజిల్లా ఆళ్లగడ్డ మండలం, కోటకందుకూరు గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్ టిజిటి మేథ్స్ టీచర్ తూపల్లె వెంకట చంద్ర. ఆయనను ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ అభినందించారు. విద్యార్థులను ఆటపాటల్లో మమేకం చేసూ స్నేహపూర్వక విద్యాబోధన ద్వారా లెక్కలు సబ్జెక్ట్ అంటే లెక్క లేకుండా చేసేలా భయం పోగొట్టిన విధానంఅద్భుతం. Good work, keep it up. బోర్డుపైనేకాకుండా గ్రౌండులోనూ గణితం చెబు తున్న మీ ప్రతిభకు హృదయపూర్వక అభినందనలు… విద్యార్థులకు కోలాటం, చెక్కభజన, కర్రసాము నేర్పు తూనే, వివిధ పరీక్షలకు సిద్ధం చేస్తున్న మీ కృషి స్ఫూర్తిమంతమని మంత్రి లోకేష్ ప్రశంసించారు.












