- పరకామణి కేసులో నిందితుల కుట్ర
- ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలి
- విచారణ అధికారులకూ ప్రాణహాని ఉంది
మంగళగిరి(చైతన్యరథం): సతీష్‌కుమార్ మరణంపై అనుమా నాలున్నాయి.. ఇది ముమ్మాటికి హత్యేనని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యా లయంలో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పరకా మణి దొంగతనం కేసులో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సతీష్‌కుమార్ ఫిర్యా దు దారుడిగా ఉన్నారు. వెంకటేశ్వర స్వామి సొమ్ము దొంగిలిస్తున్న ఉద్యోగి రవికుమార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ కేసు దర్యాప్తును ఎలా నీరుగార్చారు, రాజీ చేసిన అంశాలను ప్రస్తావించడం లేదన్న ఆయన.. సతీష్ మరణించిన వెంటనే వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ‘పోలీసుల వేధింపులు సహించలేక సతీష్ ఆత్మహత్య చేసుకున్నారు’ అని పోస్ట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. భూమన కరుణాకర్‌రెడ్డి కూడా ఇదేవిధంగా మాట్లాడటంపై..గుమ్మడికాయ దొంగలు భుజా లు తడుముకున్నట్లుగా ఉందని విమర్శించారు. హత్యను ఆత్మ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని..ఈ ఘటన వెనుక వైసీపీ ముఖ్య నాయకులపైనే వేళ్లు చూపిస్తున్నాయని అన్నారు. పరాకమణి కేసులో ఈ పెద్దలకు సంబంధం లేకపోతే వెంటనే ఎందుకు స్పందించి బలవన్మరణమని పోస్ట్ పెట్టారని ప్రశ్నించారు. ఈ ట్విట్టర్ ఖాతాను ఎవరు ఆపరేట్ చేస్తున్నారు.
ఎవరు పెట్టమం టే ఈ పోస్ట్ పెట్టారు. జగన్, భూమన, సజ్జల, వైవీ సుబ్బారెడ్డిలలో ఎవరు? అనే దానిపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సతీష్‌కుమార్ సీఐడీ విచారణకు రెండోసారి వస్తుండగానే హత్యకు గురికావడం పెద్ద సంచలనమని అన్నారు. ఇది పక్కా పథకం ప్రకారం జరిగిందని..పరాకమణి కేసులో తమపై వేళ్లు చూపబడుతున్న ముద్దాయిలందరూ కుట్రపన్ని సతీష్‌ను హత్య చేశారని ఆరోపించారు. దీనిపై తక్షణమే దర్యాప్తు జరపాలని అనంతపురం ఎస్పీ జగదీష్‌ని కోరారు. అంతేకాక ఈ కేసు దర్యా ప్తు చేసిన అధికారులైన సీఐ జగన్మోహన్‌రెడ్డి, సీఐ చంద్రశేఖర్, ఎస్.ఐ.లక్ష్మీరెడ్డిల ప్రాణాలకు ముప్పు ఉందని.. వారు డీజీపీకి భద్రత కోరుతూ లేఖ రాయాలని హెచ్చరించారు. ముఖ్యంగా దొంగతనం కేసులో ముద్దాయిగా ఉన్న రవికుమార్ ప్రాణాలకు కూడా తీవ్రమైన ముప్పు ఉందని..ఎందుకంటే అతను నోరు తెరిస్తే పరకామణి దోపిడీ సొమ్ము ఎవరికి చేరిందో మొత్తం బయటపడు తుందన్నారు. రవికుమార్, అలాగే అప్రూవర్‌గా మారే అవకాశం ఉన్న ధర్మారెడ్డి ప్రాణాలను కూడా పోలీసులు కాపాడాలని సీఐడీ చీఫ్ రవిశంకర్‌ని కోరారు. సతీష్‌కుమార్‌ది ముమ్మాటికీ హత్యే అని పునరుద్ఘాటిస్తూ నిందితులు ఎంతటి పెద్దవారైనా త్వరగా పట్టుకోవాలని శిక్షించాలని డిమాండ్ చేశారు. వివేకా హత్య జరిగి నప్పుడు మొదట్లో కొంతమంది నాయకులు, వర్గాలు ఆ మరణాన్ని సహజ మరణంగా లేదా గుండెపోటు, కిందపడటం వల్ల జరిగిన ప్రమాదంగా, లేదా ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించా రు..
తర్వాత ‘నారా సుర రక్త చరిత్ర’ అని సాక్షి పత్రికలో తప్పుడు రాతలు రాశారు. అంతకుముందు పరిటాల రవి హత్య కేసులో మొద్దు శీను, డాక్టర్ సాంబశివరావు, మద్దిలచెరువు సూరి, గోవర్థన్‌రెడ్డి, ఓం ప్రకాష్, అజీజ్‌రెడ్డి వీళ్లందరు కూడా పరిటాల రవి హత్య కేసు తర్వాత హత్య గావించబడిన వారే. తర్వాత వివేకా హత్య కేసులో కనుమూరి శ్రీనివాసరెడ్డి, ఈసీ గంగిరెడ్డి, కువైట్ గంగాధరరెడ్డి, డ్రైవర్ నారాయణ, వైఎస్ అభిషేక్‌రెడ్డి, వాచ్ మెన్ రంగన్న వీరందరూ కూడా హత్య గావించబడ్డారు. సాక్షులు నిర్భయంగా కోర్టులలో వాస్తవాలను వెల్లడిరచే వాతావరణాన్ని కల్పించడం కోసం పోలీసులు చర్యలు తీసుకోవాలి. పోలీసులు ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని, సాక్షులకు తగిన భద్రత కల్పించా లని కోరారు. ఈ హత్య ఒక పెద్ద కుట్ర..బాధ్యులందరిపై చట్టప రమైన చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ తరపున సతీష్ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ డిపార్టుమెంట్ తరపున అతనికి రావాల్సిన రాయితీలు అందేలా చూస్తామన్నారు. ఈ హత్యకు కారకులైన వారు ఎంతటి పెద్దవారైన వదిలిపెట్టబో మని స్పష్టం చేశారు.













