- అధికారం కోల్పోయినా.. మదం తగ్గలేదు
- 2024లో నగరి ప్రజలు చెప్పుతో బుద్ధిచెప్పారు
- ఇంట్లో ఖాళీగా కూర్చోలేకే.. ఆ గాలి మాటలు
- భువనమ్మపై మాట జారితే పరిణామాలు తీవ్రం
- విజయమ్మ లేఖను డైవర్ట్ చేసేందుకు కారుకూతలు
- రోజా వ్యాఖ్యలపై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం
అమరావతి (చైతన్య రథం): అధికారం పోయినా ఇంకా అదే మదంతో వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని… అందుకు నిదర్శనమే రోజా వ్యాఖ్యలని మంత్రి ఎస్ సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఓటమి తరువాత రోజా బుద్ది మారిందని అనుకున్నాం. కానీ ఇంకా నీచంగా మాట్లాడటమే అజెండాగా పెట్టుకుంది. రోజాకు భువనమ్మ గురించి, నారా కుటుంబం గురించి మాట్లాడే అర్హత ఉందా? హిందూవులమని నటించేందుకు మీలా మాకు సినిమా సెట్టింగులు వేసుకునే అవసరం లేదు. సీఎం చంద్రబాబు ఆయన జీవితకాలంలో ఎన్నో దేవాలయాలకు కుటుంబసమేతంగా వెళ్లారు. అలాగే కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి దర్శనానికి భువనమ్మతో కలిసి కుటుంబ సమేతంగా ఎన్నిసార్లు వెళ్లారు. ఎన్నోసార్లు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.
ఇవన్నీ రోజాకు కనిపించవు. తాడేపల్లి ప్యాలెస్నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదవడమే రోజా పని. జగన్ తనకు, తన బిడ్డ వైఎస్ షర్మిళకు అన్యాయం. చేశాడని విజయమ్మ బహిరంగంగా లేఖ విడుదల చేశారు. ఆ లేఖను డైవర్ట్ చేసేందుకే రోజాను రంగంలోకి దింపారు. ఐదేళ్ల పాలనలో జగన్రెడ్డి ఏ దేవాలయానికైనా కుటుంబసమేతంగా, సతీసమేతంగా వెళ్లి పట్టువస్త్రాలు సమర్పించాడా? రికార్డుల్లో ఉంటే చూపించమని రోజాకు సవాల్ విసురుతున్నా? ఐదేళ్ల పాలనలో హిందూ ఆలయాలను, విగ్రహాలను ధ్వంసం చేశారు, రథాలను తగలబెట్టారు. హిందూ సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చేసి… ఇప్పుడు నీతులు చెబుతుంటే నవ్వోస్తోంది” అంటూ మంత్రి సవిత విరుచుకుపడ్డారు..
“మార్చి 21న ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. మీకూ హిందూ ఆచారాలపై విశ్వాసముంటే, వెంకటేశ్వర స్వామి పైన నమ్మకముంటే జగన్రెడ్డి డిక్లరేషన్ ఇచ్చి వైఎస్ భారతితో కలిసి సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకోవాలి. అది మీ జగన్రెడ్డి చేయగలడా? చేయలేడు. కేవలం ఇంట్లో సెట్టింగులు వేసుకొని హిందూవులమని నమ్మించే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నట్టు? అర్చకులు చెప్పినా కూడా ప్రదక్షణలు చేయరు. స్వామివారి శాలువా కప్పుతుంటే దూరంగా ఉంటారు. మీరు మాకు ఆచారాల గురించి, సాంప్రదాయాల గురించి చెబుతుంటే విడ్డూరంగా ఉంది” అంటూ మంత్రి సవిత తూర్పారబట్టారు.
“జగన్రెడ్డికి ముందు విజయమ్మకు, వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలకు న్యాయం చేయమని వైసీపీ నేతలు చెప్పాలి. లేదంటే సొంత చెల్లెమ్మలకు న్యాయం చేయలేని అసమర్థుడిగా జగన్రెడ్డి చరిత్రలో మిగిలిపోతారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ రాజకీయాలకు దూరంగా ఉంటూ నీజాయితీగా వ్యాపారం చేస్తున్న భువనమ్మపై పనిగట్టుకొని వైసీపీ విషప్రచారం చేస్తోంది. మీ నీచ రాజకీయాల కోసం భువనమ్మపై బురద జల్లుతారా? జగన్ తన డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఎంతకైనా దిగజారుతాడని అందరికీ తెలుసు. రోజా నోరు అదుపులో పెట్టుకొని హుందాగా రాజకీయాలు చేయాలని హెచ్చరిస్తున్నా”మని మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.















