- పీపీపీ మోడల్‌తో నిర్వహణకు చర్యలు
- ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
- ఆర్డీసీ సభ్యుల ప్రమాణానికి హాజరు
విజయవాడ(చైతన్యరథం): రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కార్పొరేషన్ సభ్యులు పూర్తి సహకారం అందించాలని రోడ్లు భవనాలు, పెట్టుబడులు మౌలిక సదుపాయా ల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సూచించారు. నగరంలోని ఆర్ అండ్‌బీ ఇఎన్‌సీ కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గత ప్రభుత్వం రహదారులను పూర్తి గా నిర్లక్ష్యం చేసిందని, గత ఐదేళ్లలో రోడ్లను కనీసం రెన్యువల్ కూడా చేయకపోవడంతో రాష్ట్రంలో వేల కి.మీ రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 5 నెలల కాలంలోనే రూ.1,081 కోట్ల నిధులతో రాష్ట్రాన్ని గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని తెలిపారు. దీనివల్ల కూటమి ప్రభుత్వం, ఆర్ అండ్‌బీ శాఖపై ప్రజల్లో సానుకూలత నెలకొందన్నారు. ఇటీవలి తుపాన్ ప్రభావంతో రాయలసీమ ప్రాం తంలో కొంత మేర రహదారులు బాగానే ఉన్నప్పటికీ, ఉత్తరాంధ్ర, కోస్తా, కృష్ణ, గుంటూరు జిల్లాలలో పాడైన రహదారులపై దృష్టి పెడుతున్నామని వివరించారు. గతంలో అధ్వానంగా ఉన్న రాష్ట్ర రహదారులకు నేడు మహర్దశ వచ్చిందన్నారు. ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాదాపు రూ.2,500 కోట్ల మేర రహదారుల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
మరో రూ.1000 కోట్లతో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచి అతి త్వర లో పనులు చేపట్టనున్నామని వివరించారు. ఆర్డీసీ సభ్యులపై రోడ్ల బాధ్యత ఉందని, స్థానికంగా ఆయా సభ్యుల పరిధిలో ఉన్న రహ దారుల సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనునిత్యం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తూ ఎన్‌డీబీ, నాబార్డ్ వంటి బ్యాంకులు ద్వారా రహదారు ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) మోడల్‌తో ప్రజలపై భారం పడకుండా రహదారులను అభివృద్ధి చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని పేర్కొన్నారు. అనంతరం మంత్రి సమక్షంలో 16 మంది రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఆర్డీసీ) సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైన సభ్యులకు మంత్రి ప్రత్యే కంగా అభినందనలు తెలిపి శాలువాతో సన్మానించి మెమొంటో లు అందజేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏపీ ఆర్డీసీ చైర్మన్ ప్రగడ నాగేశ్వరావు, ఎండీ ఎల్.శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.















