- నవంబరు 1న పోలింగ్, 3న కౌంటింగ్
- కడప, రాజంపేట, మైదుకూరు, తిరుపతిలో నేటి నుంచి కొన్ని వార్డు లకు మళ్లీ నామినేషన్లు
- 25న పరిశీలన, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన
- సుప్రీం ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో 100 కార్పొరేషన్లు, మున్సి పాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నిక లకు నవంబరు 1నపోలింగ్ జరగనుంది. నవంబరు 3న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కడప, రాజంపేట, మైదుకూరు, తిరుపతిలో కొన్ని వార్డులలో ఈ నెల 23, 24 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నిర్వహించ నున్నారు. 25న నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల
తుది జాబితా ప్రకటించనున్నారు. కడప కార్పొరేషన్లో 11 వార్డులకు, తిరుపతి కార్పొరేషన్లో 18 వార్డులకు, రాజంపేట
మున్సిపాలిటీలో 11వార్డులకు, మైదుకూరు మున్సిపాలిటీలో 32 వార్డులకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏడు జిల్లాలోని 19 పురపాలక సంఘాలపై కలెక్టర్ల నుంచి నివేదికలను తెప్పించుకున్నారు. న్యాయనిపుణులతో చర్చించిన అనంతరం నవంబరు 1న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28న జరగాల్సిన పోలింగ్ మరో మూడురోజులు వాయిదా పడినట్లయింది.












