- మొంథా తుఫాన్ పర్యవేక్షణలో హైఎండ్ టెక్నాలజీ వినియోగం
- వివిధ మార్గాల నుంచి వచ్చిన డేటాతో సమగ్ర విశ్లేషణ
- ప్రాణ, ఆస్తి నష్టాన్ని వీలైనంత మేర తగ్గించిన టెక్నాలజీ
- 602 డ్రోన్లు, 14,770 సీసీ టీవీలతో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యవేక్షణ
- 1.1 కోట్ల మెసేజీలతో ప్రభావిత ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసిన ఆర్టీజీఎస్ కేంద్రం
- సీఎం చంద్రబాబు దిశా నిర్దేశంతో టెక్నోక్రాట్లుగా మారి తుఫాన్ సహయక చర్యలను పర్యవేక్షించిన ఐఏఎస్‌లు
- టెక్నాలజీతో మొంథా తుఫాన్ పర్యవేక్షణ చేసిన విధానాన్ని వివరించిన ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్
అమరావతి (చైతన్యరథం): ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అపార అనుభవం ఉంది. తుఫాన్ హెచ్చరికలు వచ్చినప్పట్నుంచి తుఫాన్ కదలికలను గమనించడం…ఆ మేరకు ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడం.. ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవడమనే అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సాధారణంగా ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. అయితే మొంథా తుఫాన్ విషయంలో కొంత భిన్నంగా వ్యవహరించారు. రాత్రింబవళ్లు పర్యవేక్షిస్తూనే … టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించారు సీఎం చంద్రబాబు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి రియల్ టైమ్ డేటాను అప్డేట్ చేసుకుంటూ…వచ్చిన సమాచారాన్ని విశ్లేషించుకుంటూ… రియల్ టైంలోనే సమస్యలను పరిష్కరించేలా పని చేశారు. డేటా డ్రివెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మోడల్ ఆవిష్కరించారు. ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్, టెక్నాలజీని అనుసంధానించి రియల్ టైమ్‌లో సమన్వయం చేసుకోవడం.. నిర్ణయాలు తీసుకోవడం.. అవి అమలు అయ్యేలా చూసుకోవడంలో ఈ మోడల్ సక్సెస్ సాధించింది. సాంప్రదాయ పద్ధతులను అనుసరించడంతోపాటు.. వివిధ శాఖల నుంచి ఆర్టీజీఎస్ సెంటర్ కు వచ్చిన సమాచారాన్ని అనుసంధానించి అవేర్ 2.0 వ్యవస్థ ద్వారా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు తీసుకోవడంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగింది ప్రభుత్వం. టెక్నాలజీ ద్వారా మొంథా తుఫాన్ సహాయక చర్యలను ఏ విధంగా మానిటర్ చేశారనే వివరాలను ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ మీడియాకు వివరించారు.
సీఎం చంద్రబాబు తుఫాన్ హెచ్చరికలు వచ్చినప్పట్నుంచి తొమ్మిది సార్లు టెలీ కాన్ఫరెన్సులు, ఆర్టీజీ సెంటర్ నుంచి నిరంతరం సమీక్షా సమావేశాలు చేపట్టారు. అలాగే వివిధ విభాగాలు, క్షేత్ర స్థాయి అధికారులతో నిరంతరం టచ్ లో ఉన్నారు. ఆర్టీజీఎస్ కంట్రోల్ రూమ్ నుంచి వచ్చిన లైవ్ డేటాతో, అవసరమైన ప్రాంతాలకు సహయక చర్యలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసి… అమలు చేసేలా ప్రభుత్వం టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించింది. అవసరమైన చోట యంత్రపరికరాలను, మానవ వనరుల్ని సమర్థంగా కేటాయించటంలోనూ టెక్నాలజీనే సాయపడిరది.
టెక్నాలజీ వనరుగా అవేర్ 2.0
అవేర్ 2.0 వ్యవస్థకు స్టేట్ డేటాలేక్ ద్వారా అన్ని విభాగాలను అనుసంధానం చేశారు. దీని ద్వారా రియల్ టైములో నిర్ణయాలు తీసుకోవడానికి వీలు ఉంటుంది. వర్షపాతం, గాలి, పిడుగుల వంటి వాటిపై హెచ్చరికలు చేసేలా అవేర్-2.0 వ్యవస్థ పని చేస్తుంది. ఈ వ్యవస్థ ద్వారా విపత్తు నిర్వహణను సమర్థవంతంగా చేపట్టవచ్చు. అలాగే రిజర్వాయర్ స్థాయిలు, ఇన్‌ఫ్లోలు, భూగర్భ జలాలు చెరువులకు సంబంధించిన రియల్ టైమ్ డేటా అందుబాటులో ఉంటుంది. దీంతో శాటిలైట్ ద్వారా వివిధ ప్రమాదాలకు సంబంధించిన హెచ్చరికలు జారీ చేసే అవకాశముంది. అవేర్-2.0 వ్యవస్థ ద్వారా వచ్చే సమాచారాన్ని క్రోడీకరించుకుని…ఏఐ ద్వారా విశ్లేషించి మొంథా తుఫాన్ కదలికలను కచ్చితంగా తెలుసుకోగలిగింది రాష్ట్రప్రభుత్వం. తద్వారా సహాయక చర్యలనూ వేగంగా చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ద్వారా 72 గంటల ముందే తుఫాన్ కదలికల్లో వచ్చిన మార్పులను గుర్తించగలిగారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోగలిగారు.. అలాగే ఆయా ప్రాంతాల్లోని ప్రజలనూ అలెర్ట్ చేయగలిగారు. గాలుల వేగాన్ని అంచనా విషయంలో కచ్చితమైన సమాచారం రావడంతో… ఆయా ప్రాంతాల్లో ముందస్తుగానే చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లభించింది. దీని ద్వారా ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగింది ప్రభుత్వం.
అలారంలా పని చేసిన అలెర్ట్ మెకానిజం
ఇక వివిధ వ్యవస్థల ద్వారా రియల్ టైములో సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం… ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు ప్రజలకు కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాలి. విపత్తులకు సంబంధించిన సమాచారం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఈ విషయంలో ప్రభుత్వం టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకుంది. వాస్తవాలను ప్రజలకు నేరుగా చేరవేయగలిగింది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు అధికారులకు 1.1 కోట్లకు పైగా సందేశాలను ప్రభుత్వం పంపింది. ఫిర్యాదులు స్వీకరించడం.. ఫీడ్ బ్యాక్ తీసుకోవడానికి కూడా ప్రత్యేక వ్యవస్థలు పని చేశాయి. మనమిత్ర సుమారు 12,000కు పైగా ఫిర్యాదులు అందాయి. వీటిని క్షేత్రస్థాయిలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం పరిష్కరించింది. ఐవీఆర్‌ఎస్ సర్వేలు, మీడియా, సోషల్-మీడియా మానిటరింగ్ ద్వారా అధికారులు ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఇదే సమయంలో తప్పుడు సమాచారం వ్యాప్తిని నివారించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
డ్రోన్‌లు, సీసీటీవీ, వాహనాల లైవ్ ట్రాకింగ్
ఏరియల్ సర్వేలు, వరద మ్యాపింగ్, రియల్ టైమ్ డేటా సేకరణ కోసం 602 డ్రోన్‌లను అందుబాటులో ఉంచారు. 14,770 సీసీటీవీ కెమెరాలను ఆర్టీజీఎస్ నెట్‌వర్క్‌కు అనుసంధానించారు. 24 గంటల పాటు క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను అంచనా వేయగలిగారు. అలాగే ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే.. వాటిని త్వరగా గుర్తించగలిగారు. ఇక మెషినరీ ట్రాకింగ్ యాప్ ద్వారా జేసీబీలు, క్రేన్‌లను లైవ్ ట్రాక్ చేయడానికి వీలు కలిగింది. అలాగే రోడ్‌బ్లాక్‌లు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సమస్యలు ఉన్న చోట జేసీబీలు, క్రేన్లను తరలించేలా చర్యలు తీసుకోగలిగారు. ఇక అన్ని విభాగాల నుంచి వచ్చిన లైవ్ డేటాను అనుసంధానిస్తూ… సైక్లోన్ మానిటరింగ్ డాష్‌బోర్డ్ ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్ జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా రోడ్లు, ఆసుపత్రులు, సహాయక కేంద్రాలు, కీలకమైన మౌలిక సదుపాయాలు ఎక్కడున్నాయనే సమాచారాన్ని సేకరించగలిగారు.
గ్రౌండ్ నెట్ వర్క్… గ్రౌండ్ రియాల్టీ…
5,803 గ్రామ, వార్డు స్థాయిలో కూడా కమాండ్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగింది. క్షేత్ర స్థాయి సిబ్బంది ద్వారా 2 కోట్లకు పైగా ప్రజలకు సేవలందించే ఏర్పాట్లను ముందుగానే చేసుకోగలిగింది. ఈ క్షేత్ర స్థాయి వ్యవస్థ ద్వారా బ్యాకప్ పవర్, సహాయక సామాగ్రిని ఆయా కేంద్రాల్లో ముందుగానే ఉంచారు. ముఖ్యంగా 1,742 మంది గర్భిణులను సురక్షితంగా ఆసుపత్రులకు తరలించడంలో గ్రౌండ్ లెవల్ నెట్ వర్క్ బాగా ఉపయోగపడిరది.
తుఫాన్ సమయంలో అంతర్-ఏజెన్సీ సమన్వయాన్ని బలోపేతం చేస్తూ, ఒక బలమైన కమ్యూనికేషన్ నెట్‌వర్క్ కొనసాగింది. 2,973 పోర్టబుల్ వైర్‌లెస్ సెట్‌లు, డీజీ సెట్‌లు మౌంటెడ్ రేడియోలతో ఆర్టీజీ సెంటర్ నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఉంది.
కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం…
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఐఎండీ, ఎన్‌డీఎంఏ, ఎంహెచ్‌ఏలతో నిరంతరం కో-ఆర్డినేట్ చేసుకుంటూ ఆర్టీజీఎస్ సహా ఇతర విభాగాలు పని చేశాయి. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు నెల్లూరులోని సంగం బ్యారేజ్ సమీపంలో చిక్కుకున్న పడవను చాకచక్యంగా లాగడం వంటి క్లిష్టమైన రెస్క్యూ మిషన్లను చేపట్టాయి. భారతదేశంలో మొట్టమొదటిదైన ఎన్‌డీఎంఏ సెల్ బ్రాడ్‌కాస్ట్ వైబ్రేషనల్ అలర్ట్ సేవను మన రాష్ట్రం వినియోగించుకుంది. ఎనర్జీ డిపార్ట్‌మెంట్ ఫీడర్‌లు సబ్‌స్టేషన్‌లను రియల్ టైములో పర్యవేక్షణ చేశాయి. శాటిలైట్ చిత్రాల సాయంతో ముంపు నివారణకు చర్యలు తీసుకున్నారు. ఈ విధంగా పూర్తి స్థాయి సాంకేతికతతో ప్రభుత్వం మొంథా తుఫాన్ సహాయక చర్యలను చేపట్టింది. భవిష్యత్తులో ఎలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినా… ప్రస్తుతం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థల ద్వారా నష్టనివారణా చర్యలు చేప్టటడానికి రోడ్ మ్యాప్ సిద్ధమయింది.
 
	    	 
 














