చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రాయలసీమ ద్రోహి జగన్‌రెడ్డి

ఐదేళ్లలో సీమకు చేసిందేమిటి? బ కడప గడ్డపై చంద్రబాబు సింహగర్జన

by చైతన్యరధం
Jan 20, 2024 at 8:47am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
రాయలసీమ ద్రోహి జగన్‌రెడ్డి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సొంత జిల్లాకూ చేసిందేెమిలేదు?
  • వచ్చే ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ గెలవడం ఖాయం
  • జగనన్న బాణం రివర్స్‌ గేర్‌లో వస్తోంది
  • విలువలు లేని వ్యక్తులు రాజకీయాలకు అనర్హులు\
  • అధికారంలోకి వచ్చాక కరెంటు చార్జీలు పెంచం

కమలాపురం: ఐదేళ్ల పాలనలో సొంత జిల్లాకు, రాయలసీమకు సీఎం జగన్‌రెడ్డి చేసిందేమిటని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నిలదీ శారు. ఉమ్మడి కడప జిల్లా కమలాపురంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన రా..కదలిరా బహిరంగ సభ లో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ…రా…కదలిరా అని పిలుపిస్తే కమలాపురం కాలుదువ్విందన్నారు. కడ పలో గడపగడపా యుద్ధానికి సిద్ధమంటోంది. ఈ ఘట్టాన్ని శాశ్వతంగా గుర్తుంచుకుంటాను. జగనన్న బాణం రివర్స్‌ అయింది. కారణమేంటి? సొంత చెల్లినే ఇంటినుండి గెంటేశాడు.ఇదేనా విశ్వసనీయత? సొంత చెల్లికి న్యాయం చేయలేని వాడు మీకు న్యాయం చేస్తా డా? జగనన్న బాణం రివర్స్‌ గేర్‌లో వస్తోంది. కడప గడ్డపై నిలబడి అడుగుతున్నా… కడప స్టీల్‌ ఫాక్టరీకి రెండు సార్లు రిబ్బన్‌ కట్‌ చేశారు ఏమైంది? రిబ్బన్లు కట్‌ చేయటం, రంగులు వేసు కోవటం తప్ప జగన్‌రెడ్డి చేసిందేమీ లేదు. నేను రాయ లసీమ బిడ్డనే.. రాయల సీమకు మొదటిసారిగా నీళ్లిచ్చిన ఘనత ఎన్టీఆర్‌దే. గండికోట రిజర్వాయర్‌, తెలుగు గంగను తవ్వినవ్యక్తి ఎన్టీఆర్‌. టీడీపీహయాంలో 2014-19 మధ్య రూ.12,500 కోట్లు ఒక్క కడపజిల్లా ఇరిగేషన్‌ ప్రాజె క్టుల కోసం ఖర్చుచేసి ప్రాజె క్టులను పరిగెత్తించాం. గండికోట ద్వారా పులివెందు లకు నీళ్లిచ్చిన ఘనత టీడీపీదే. మేం ఖర్చుచేసిన దానిలో కనీసం 20శాత మైనా జగన్‌రెడ్డి ఈ 5ఏళ్లలో ఖర్చు చేశారా? ఎక్క డైనా ఒక్క పిల్ల కాలువ తవ్వారా? రాయలసీమ ద్రోహి జగన్‌ రెడ్డి. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చి,ఆ మేరకు కృష్ణా జలాల్లో ఆదా అయిన 120 టీఎంసీల నీటిని రాయల సీమకు ఇచ్చాం. దాని వల్ల అన్ని కాలువల్లో నీళ్లొచ్చాయి. కానీ నేడు రైతుల కళ్లలో నీళ్లు పారుతు న్నాయి. గోదావరి నీళ్లు బనక చర్లకు తెచ్చి.. రాయల సీమను రతనాల సీమ చేస్తా.. నీళ్లుంటే పరిశ్రమలు వస్తాయి, పుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు వస్తాయి. రాయల సీమ హార్టికల్చర్‌ హబ్‌గా మారుతుంది. నాడు 90 శాతం సబ్సిడీతో డ్రిప్‌ ఇరి గేషన్‌ ఇచ్చాం. రూ.4వేల కోట్లతో వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు ఇచ్చాం. నేడు అవి ఏమయ్యాయి? టీడీపీ`జనసేన ప్రభుత్వంలో వచ్చేది రైతు రాజ్యమేనని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఈ పోరాటం నా కోసం కాదు
కమలాపురం సభకు వచ్చిన జనమంతా నేను చేస్తు న్న పోరాటం నాస్వార్థం కోసం కాదని తెలుసుకోవాలి. రాష్ట్రంలోని యువత, రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల వారి సంతోషం, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముం దుకు సాగుతున్నాను. మీ సహకారం లేకుంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం నా ఒక్కడి చేతుల్లో ఉండదు. 2019లో కడపలో అన్నిసీట్లలో వైసీపీనే గెలిపించారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఉమ్మడి కడప జిల్లాలో ఒక్కరికైనా న్యాయం జరిగిందా? మీ ఆదాయం పెరిగిం దా.. మీకు ఉద్యోగాలు వచ్చాయా? సాగు..తాగునీరు అందిందా? రైతుల జీవితాలు సంతోషంగా ఉన్నాయా? మహిళలు సంతోషంగాఉన్నారా? కడప జిల్లాలో ఒక్కడే ఒక్కడికి న్యాయం జరిగింది. ఆ ఒక్కడు జగన్‌రెడ్డి. అతనితోపాటు మరో ఇద్దరు, ముగ్గురు బాగుపడ్డారు. జగన్‌రెడ్డి మాటలుకోటలు దాటాయిగానీ, చేతలు గడప కూడా దాటలేదు. కమలాపురంలోనే ఈ స్థాయిలో స్పందన ఉంటే, వచ్చే ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ గెలవడం ఖాయం. ఇన్నిసార్లు గెలిపించాం..మాకు ఏం ఒరగబెట్టావని జగన్‌రెడ్డిని కడపవాసులే నిలదీస్తున్నా రు. పులివెందుల ప్రజలు ఇలాంటివాడినా తాము గెలి పించింది అని బాధపడుతున్నారు. కడప జిల్లాలో కరు వు వచ్చి, 35 మండలాలు తీవ్ర దుర్భిక్షంలో ఉన్నాయి. 20 సంవత్సరాల్లో ఇంత తక్కువ వర్షపాతం జిల్లాలో ఎప్పుడూ నమోదు కాలేదు. ఈ ముఖ్యమంత్రి ఒక్క మండలాన్ని అయినా కరువు మండలంగా ప్రకటించా డా? అధికారులు చెబితే నా జిల్లాలో కరువు రావడం ఏమిటన్న అహంకారంతో ఫైళ్లు విసిరి వారి ముఖాన కొట్టాడు. అదే అధికారంలో నేను ఉండి ఉంటే, కరువు నివారణ చర్యలు చేపట్టేవాడిని. కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకొచ్చి, రైతాంగాన్ని ఆదుకునేవాడిని. ఎన్ని కల ముందు జగన్‌రెడ్డి ఒక్క ఛాన్స్‌ అన్నాడు. కథలు చెప్పాడు.. ముద్దులు పెట్టాడు. చివరకు ఇప్పుడు గుద్దు లు గుద్దుతున్నాడని చంద్రబాబు విమర్శించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-07-2025

చైతన్యరధం ఈ పేపర్ 30-06-2025

పౌరసేవలకు ర్యాంకింగ్స్‌

కరెంటు చార్జీలు పెంచం
వైసీపీ పాలనలో నిత్యావసర ధరలన్నీ పెరిగాయి. టీడీపీ హయాంలో సంక్రాంతి, రంజాన్‌, క్రిస్మస్‌ కాను కలు ఇచ్చాం. పెళ్లికానుక, విదేశీ విద్య వంటి సంక్షేమ పధకాలు నేడు ఉన్నాయా? రేషన్‌ షాపుల్లో 18 రకాల వస్తువులు ఇచ్చాం. నేడు పేదల్ని పట్టించుకుంటున్నా రా? జగన్‌రెడ్డిది బటన్‌ నొక్కుడు కాదు, బటన్‌ బొక్కు డు. ఇసుక నుంచి తైలం తీయగల సమర్ధులు వైసీపీ నేతలు. పెన్నా నది నుంచి ఇసుక దొంగ రవాణా చేస్తు న్నారు. పెట్రోల్‌, డీజీల్‌, ఆర్టీసీ రేట్లు అన్ని రేట్లు పెం చారు. ఆస్తిపన్ను, నీటి పన్ను చివరకు చెత్తపై కూడా పన్ను వేశారు. కరెంట్‌ చార్జీలు తగ్గిస్తానన్నాడు. కానీ విపరీతంగా పెంచేశాడు. గతంలో రూ.200బిల్లు కట్టే వారికి నేడు రూ.1000 బిల్లు వస్తోంది. 9సార్లు కరెం టు బిల్లులు పెంచాడు. విద్యుత్‌ సంస్కరణలు తెచ్చిన ఘనత టీడీపీదే. 1998లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గా 5వేల మెగావాట్లు ఉన్న విద్యుత్‌ని 10వేల మెగావా ట్లకు పెంచాను.2014లో 22మిలియన్‌ యూనిట్ల కొర త ఉంటే 100రోజుల్లో కరెంట్‌ కొరతలేకుండా చేశాం. 5ఏళ్లలో ఒక్కసారి కరెంట్‌చార్జీలు పెంచకుండా నాణ్య మైన కరెంట్‌ఇచ్చాం. అప్పుల కోసం రైతుల మోటార్లకు మీటార్లు పెట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కరెం ట్‌చార్జీలు పెంచబోమని చంద్రబాబు ప్రకటించారు.

కులం కూడు పెట్టదు..
వైసీపీ పాలనలో అన్నివర్గాలు, అన్ని ప్రాంతాలు నష్ట పోయాయి. కడపలో రెడ్లు ఎవరికైనా న్యాయం జరిగిం దా. పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, అవినాష్‌రెడ్డికి తప్ప మిగతా ఎవరికై నా న్యాయంజరిగిందా? యువతకు ఉద్యోగాలొచ్చా యా? రైతులకు న్యాయం జరిగిందా? కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవటంతో 43మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో సగం మంది రెడ్లే. కులం, మతం మనకు మంచి చేయదు. సమర్థవంతమైన పాలనే ప్రజ ల జీవితాలకు మార్గంచూపుతుంది.సామాజిక న్యాయం అంటూ జగన్‌రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నారు. ఎమ్మెల్యే అవినీతిపై పోరాటం చేసినందుకు ప్రొద్దుటూ రులో నందం సుబ్బయ్య అనే బీసీ నేతను హత్య చేశా రు. రేపల్లెలో అమర్నాధ్‌ గౌడ్‌ అనే బీసీ విద్యార్థిని పెట్రోల్‌ పోసి కాల్చిచంపారు.కాకినాడలో దళిత డ్రైవర్‌ సుబ్రమణ్యంను చంపి డోర్‌ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని సీఎం తన పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. నంద్యాల లో పోలీసుల వేధింపులతో అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిరది. ఇదేనా సామాజిక న్యాయం? బాధితుల కుటుంబాలను జగన్‌ ఎప్పుడైనా పరామర్శిం చారా? భూకబ్జాలకు జగన్‌రెడ్డి లైసెన్స్‌లు ఇచ్చారు. బాధితులకు న్యాయం చేయకుండా కబ్జా చేసిన వారికి న్యాయం చేస్తారు. జలగన్న సర్వేలో మీ భూమి వేరే వాళ్ల పేర్ల మీద ఎక్కిస్తున్నారు. దీనికి భూరక్షణ చట్టం అంటూ కొత్తగా చట్టం తెచ్చారు. అది అమల్లోకి వస్తే మీ భూములు గోవిందా? టీడీపీ అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ
ఆడబిడ్డ నిధి కింద ఇంట్లో ఎంతమంది మహిళలుం టే వారికి నెలకు రూ.1500 ఇస్తాం. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది విద్యార్థులున్నా ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలిస్తాం. ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళ లకు ఉచిత ప్రయాణం. యువగళం నిధి కింద నెలకు రూ.3 వేలు యువతకు నిరుద్యోగ భృతి, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. యువత సైకిలెక్కి టీడీపీ `జనసేన జెండాలు పట్టి ప్రజలను చైతన్యం చేయాలి. అన్నదాత కింద రైతుకు ఏడాదికి రూ.20 వేలిస్తాం. ఇరిగేషన్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. సబ్సిడీకీ డ్రిప్‌ ఇరిగేషన్‌ ఇస్తాం. రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌ గా చేస్తాం. కుళాయిల ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత నీరి స్తాం. పీ 4తో పేదల్ని ధనికులుగా చేస్తాం. సంపద సృష్టించి దాన్ని పేదలకు పంచుతాం. బీసీలకు రక్షణ చట్టం తెస్తాం. అన్న క్యాంటీన్లు పెడతాం. ఒంటిమిట్ట కోదండరాముని ఆలయం నేనే అభివృద్ది చేశా. మైనా ర్టీలకు రూ.25 కోట్లతో హజ్‌ హౌస్‌ నిర్మాణం చేపట్టి 90శాతం పూర్తి చేశాం, కానీ మిగిలిన 10శాతం పను లు పూర్తి చేయలేని జగన్‌ 3రాజధానులు కడతాడట. 3 రాజధానులు పేరుతో మూడు ముక్కలాట ఆడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ పెడతాం, విశాఖతో పాటు కడప, కర్నూలు అనంతపురం అన్ని జిల్లాలు అభివృద్ది చేస్తాం.

కడప జిల్లాకు హామీలు
పులివెందులో టీడీపీ హయాంలో మొదలు పెట్టిన పాపాగ్ని నదిపై బ్రిడ్జిని పూర్తిచేస్తాం, గండికోట రిజర్వా యర్‌ బాధితులకు, రాజోలు ఆనకట్ట ముంపు బాధితు లకు న్యాయం చేస్తాం. ప్రొద్దుటూరులో కుందూ, పెన్నా వరద కాలువలు పూర్తిచేస్తాం. చేనేత కార్మికులకు 200 యూనిట్ల విద్యుత్‌ ఉచితంగా ఇస్తాం. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, తెలుగు గంగ కాలువ, కేసీ కెనాల్‌, నిప్పుల వాగుకాలువసామర్థ్యం పెంచుతాం. రాయల సీమకు సాగు,తాగునీరు సమస్యపరిష్కారంచేసి రాయల సీమను రతనాల సీమగా మార్చుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

వైసీపీ ఎమ్మెల్యేలు కరప్షన్‌ కింగ్‌లు
రాష్ట్రాన్ని జగన్‌ దోచుకుంటుంటే పులివెందులలో ఆయన సోదరుడు మదన్‌ మోహన్‌రెడ్డి పిండేస్తున్నా డు. భూదందాలు, ఇసుక, మట్టి అక్రమరవాణా, గ్రావెల్‌ దోపిడి ఇలా అన్ని దోపిడి చేస్తున్నారు. దళిత మహిళ నాగమ్మపై అత్యాచారం జరిగితే.. కనీసం చర్యలులేవు.పులివెందులలో ఈఏపీ కింద రూ.300 కోట్లు, పీఎం ఎస్‌జీవై కింద రూ.200కోట్లు పనులు ఇస్తే కనీసం 20శాతం కూడా పూర్తికాలేదు. జమ్మల మడుగు ఎమ్మెల్యే… పేరుకే డాక్టర్‌ కానీ పెద్దయా క్టర్‌… అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపులేదు. చికెన్‌ షాపుల నుంచి క్వారీలు, ప్రవేట్‌ పరిశ్రమలు అన్నీ కప్పం కట్టాలి. మైలవరం సోలార్‌ పార్క్‌ యజ మానిని బెదిరించి కమీషన్లు తీసుకున్నారు. ప్రొద్దు టూరు ఎమ్మెల్యే బెట్టింగ్‌ ప్రసాద్‌, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. బీసీ నేత నందం సుబ్బయ్యను పొట్టన పెట్టుకున్నారు. కర్ణాటక నుంచి డీజీల్‌ తెచ్చి అక్రమంగా అమ్ము తున్నారు. కల్లూరు లింక్‌ కెనాల్‌కి చెందిన 2.7ఎకరాలు తన వెంచర్‌లో కలుపుకున్నారు. అధికారులను బూతులు తిడుతు న్నారు. మైదుకూరు ఎమ్మెల్యే చింతగుంటలో 80 ఎకరాల భూమి కొల్ల గొట్టారు. ఎర్రబెల్లిలో అక్బర్‌ బాషా భూమిని దొంగపట్టాలతో తనపేరుతో మార్చు కున్నాడు. నంద్యాలపేటలో 104 ఎకరాలు ఆక్రమిం చారు. కుందూ నదిలో ఇసుక బొక్కేస్తున్నారు. కమ లాపురం ఎమ్మెల్యే కరప్షన్‌ కింగ్‌. లేపాక్షికి చెందిన రూ.20వేల కోట్ల విలువైన 9వేల ఎకరాలు కొట్టేం దుకే ప్లాన్‌ చేస్తున్నారు. కడప శివారులో 200కోట్ల విలువైన 54 ఎకరాలు, సర్వారాయుడు ప్రాజెక్టు సమీపంలో 400ఎకరాలు, వక్స్‌ భూములు ఆక్ర మించారు. బుగ్గవంగ వాగును ఆక్రమించి థియేటర్‌ కట్టారు. బద్వేల్‌ అంతా భూబకాసురులే… రికార్డులు మార్చి రూ.2వేలకోట్ల విలువైన భూములు ఇస్టాను సారంగా కబ్జా చేశారు. ఎవరినీ వదలను దోచుకున్న దంతా కక్కిస్తా. కడపలో డిప్యూటీ సీఎం ముస్లింలకు ఒక్క రూపాయి సాయం చేశారా అని నిలదీశారు.

హూ కిల్డ్‌ బాబాయ్‌?
హు కిల్డ్‌ బాబాయి? బాబాయ్‌ని ఎవరు చంపారు తమ్ముళ్లూ? ఈస్టోరీ టాలీ వుడ్‌, బాలీవుడ్‌ సినిమాల్ని కూడా మరిపిస్తుంది. మలు పుల మీద మలుపులు.. సస్పెన్సన్స్‌ల మీద సస్పెన్స్‌ లు. వివేకా హత్యపై గుండెపోటు అంటూ, రక్తపు వాం తులు అంటూ సాక్షిలో తప్పుడు ప్రచారంచేశారు. పోస్టు మార్టంలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. నారాసుర రక్తచరిత్ర అంటూ నా మీద సాక్షి పత్రికలో తప్పుడు కథనాలు వేశారు. తనకు తండ్రి లేడు, బాబాయి లేడు అంటూ గత ఎన్నికల్లో ఓట్లు అడిగిన జగన్‌ రెడ్డికి నేడు వివేకా హత్యపై సమాధానం చెప్పే ధైర్యం ఉందా? నాడు సీబీఐ కావాలని కోర్టుకెళ్లారు, అధికారం లోకి వచ్చాక సీబీఐ విచారణ వద్దన్నారు. అసలు వివేకా హత్యపై మాట్లొద్దంటూ గ్యాగ్‌ ఆర్దర్‌ తెచ్చారు. వివేకాకు రెండో భార్య వ్యవహారం, బెంగుళూరు ఆస్తులు వల్లే హత్య అంటూ చెప్పారు. తర్వాత కూతురు సునీత,ఆమె భర్తపై తప్పుడు ప్రచారంచేశారు. ఏ తప్పు చేయని కోడి కత్తి శ్రీను జైల్లో ఉన్నాడు బాబాయిని చంపిన అవినాష్‌ రెడ్డి మాత్రం బయట తిరుగుతున్నాడు. దోషులు అరెస్ట్‌ కాకుండా నిర్దోషులు అరెస్ట్‌ అవుతున్నారు. కడప గడ్డపై నిలబడి అడుగుతున్నా…హుకిల్డ్‌ బాబాయి దీనికి జగన్‌ సమాధానం చెప్పాలని చంద్రబాబు సవాల్‌ విసిరారు.

Previous Post

ఇంత నీచుడివా జగన్‌? : మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఆగ్రహం

Next Post

గాలి మారుతోంది..!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-07-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-07-2025

కార్యకర్త
@ July 1, 2025
చైతన్యరధం ఈ పేపర్ 30-06-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-06-2025

కార్యకర్త
@ June 30, 2025
ఆంధ్రప్రదేశ్

పౌరసేవలకు ర్యాంకింగ్స్‌

చైతన్యరధం
@ June 30, 2025
ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ అంటే..పేదల ముఖంలో చిరునవ్వు!
ఆంధ్రప్రదేశ్

మీ ఏడుపులే..మాకు దీవెనలు!

చైతన్యరధం
@ June 30, 2025
ఆంధ్రప్రదేశ్

40 ఏళ్ల పసుపు రైతు కల సాకారం

చైతన్యరధం
@ June 30, 2025
ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడికి..
ఆంధ్రప్రదేశ్

ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడికి..

చైతన్యరధం
@ June 30, 2025
యువ రచయిత సూరాడకు లోకేష్‌ అభినందనలు
ఆంధ్రప్రదేశ్

యువ రచయిత సూరాడకు లోకేష్‌ అభినందనలు

చైతన్యరధం
@ June 30, 2025
ఇంటింటికీ సుపరిపాలన విజయాలు
ఆంధ్రప్రదేశ్

ఇంటింటికీ సుపరిపాలన విజయాలు

చైతన్యరధం
@ June 30, 2025
Load More

ముఖ్య వార్తలు

మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌!

మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌!

చైతన్యరధం
@ June 25, 2025
వరద జలాలే వాడతాం

వరద జలాలే వాడతాం

చైతన్యరధం
@ June 25, 2025
ఉద్యోగకల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ

ఉద్యోగకల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ

చైతన్యరధం
@ June 25, 2025
గెలిచింది కూటమికాదు… ప్రజలు!

గెలిచింది కూటమికాదు… ప్రజలు!

చైతన్యరధం
@ June 24, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

చైతన్యరధం
@ June 21, 2025 6:55 AM

సంపాదకుల ఆక్రోశం ఎవరి మెప్పుకోసం?

చైతన్యరధం
@ June 18, 2025 6:05 AM

విద్యాదానమే ఉన్నతోన్నతం

చైతన్యరధం
@ June 18, 2025 6:00 AM

వైసీపీ మేనిఫెస్టో.. కూటమి మేనిఫెస్టో అమలులో ఏది బెస్టో?

చైతన్యరధం
@ June 17, 2025 6:25 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పౌరసేవలకు ర్యాంకింగ్స్‌

చైతన్యరధం
@ June 30, 2025
ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ అంటే..పేదల ముఖంలో చిరునవ్వు!

మీ ఏడుపులే..మాకు దీవెనలు!

చైతన్యరధం
@ June 30, 2025

40 ఏళ్ల పసుపు రైతు కల సాకారం

చైతన్యరధం
@ June 30, 2025
ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడికి..

ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడికి..

చైతన్యరధం
@ June 30, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist