అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర వ్యాప్తంగా రా.. కదలిరా సభలతో అధికార వైసీపీకి వణుకు పుట్టిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మార్చి 2న నెల్లూరు, పల్నాడు జిల్లా గురజాలలో.. 4న అనంత పురం జిల్లా రాప్తాడు సభల్లో పాల్గొంటున్నారు. ‘రా.. కదలి రా’ సభల ద్వారా జగన్‌రెడ్డి అరాచక, అసమర్థ పాలనను ఎండగట్టడమే కాకుండా, టీడీపీ ఇప్పటికే ప్రకటించిన సూపర్ 6 పథకాల్లోని అంశాలను చంద్ర బాబు మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళుతున్నా రు. ప్రతిపార్లమెంట్ నియోజకవర్గంలో ఒక రా.. కదలి రా సభను నిర్వహిస్తున్న టీడీపీ అధినేత ఇప్పటికి 22 సభల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే మార్చి 2వ తేదీ ఉదయం నెల్లూరులోనూ, అదేరోజు సాయంత్రం నర్స రావుపేట పార్టమెంటు పరిధిలోని గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలో, 4వ తేదీన అనంతపురం పార్ల మెంటు పరిధిలోని రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే రా.. కదలిరా సభల్లో పాల్గొంటారు. దీంతో రా.. కదలిరా సభలు ముగుస్తాయి.
నెల్లూరు సభలో టీడీపీలోకి వేమిరెడ్డి…
2వ తేదీ ఉదయం నెల్లూరులో జరిగే సభలో చంద్ర బాబు సమక్షంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి టీడీపీలో చేరనున్నారు. కాగా వైసీపీ రాజ్య సభ సభ్యుడిగా కొనసాగుతున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వారం రోజుల క్రితం వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్య క్షుడు సీఎం జగన్‌కు పంపించారు. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి, దాంతోపాటే, రాజ్యసభ సభ్యత్వా న్ని కూడా తాను వదులుకుంటున్నట్లు వేమిరెడ్డి ఆ లేఖ లో పేర్కొన్నారు. గత కొంతకాలంగా నెల్లూరు జిల్లా వైసీపీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. ఇప్ప టికే ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్ర శేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి వైసీపీని వదిలి, టీడీపీకి దగ్గరయ్యారు. ఆ ముగ్గురిపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఇటీవలే అనర్హత వేటు వేసిన విషయం తెలి సిందే. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా పార్టీ నుంచి తప్పుకోవడం నెల్లూరు జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బగానే భావించాలి.
వైసీపీలో కల్లోలం…
ఎంపీల వరుస రాజీనామాలతో వైసీపీలో కల్లోలం రేగుతోంది. ఇప్పటికే ఆరుగురు ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాజ్యసభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వైసీపీకి గుడ్‌బై చెప్పారు. వీరిలో రఘురామకృష్ణరాజు టీడీపీ`జనసేన కూటమి తరుఫున తిరిగి పోటీ చేస్తానని చెబుతున్నారు. బాలశౌరి జనసేనలో చేరారు. వెమిరెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు శనివారం టీడీపీలో చేరనున్నారు. తన కుమారుడు ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేస్తాడని మాగుంట చెప్పినప్పటికీ ఏ పార్టీ నుంచి అనేది మాత్రం వెల్లడిరచలేదు.
గురజాల సభలో టీడీపీలో చేరతా: లావు
ఇలాఉంటే ఇటీవలే వైసీపీకి గుడ్ బై చెప్పిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గుర జాల నియోజకవర్గంలో జరిగే రా..కదలిరా సభలో చంద్రబాబు పమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఇప్ప టికే చంద్రబాబును కలిసిన లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. తాను మార్చి 2న జరగబోయే ‘రా కదలిరా’ సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నానని సోషల్ మీడియాలో లావు వెల్లడిరచారు. ప్రజా సంక్షేమం, పల్నాడు అభివృద్ధికి కట్టుబడి మరలా నరసరావుపేట ఎంపీగా పోటీ చేయబోతున్నానని తెలిపారు. తనను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నానని శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. వైసీపీ అధినాయకత్వం రాష్ట్రవ్యాప్తంగా పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలను బదిలీ చేస్తుండడం తెలిసిందే. నరసరావుపేట ఎంపీ స్థానం ఇన్చార్జిగా అనిల్ కుమార్ యాదవ్ పేరును వైసీపీ ప్రకటించింది. గతంలో మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు.