పాయకరావుపేట : నక్కపల్లి బాలికల గురుకుల పాఠశాల వద్ద యువనేత లోకేష్ సెల్ఫీ దిగి ఆసక్తికరమైన వ్యాఖ్య లు చేశారు. ఇది ఆంధ్రుల ఆరాధ్యదైవం అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా 1984లో పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లిలో ఏర్పాటుచేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురు కుల పాఠశాల. గ్రామీణ ప్రాంతాల్లో దళితబిడ్డలకు మెరుగైన విద్యను అందించేం దుకు ఎన్టీఆర్ రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలల ఏర్పాటుకు శ్రీకారం చుడితే, ఆ తర్వాత చంద్రబాబునాయుడు వాటిని మరింతగా విస్తరించారు. 2014-19 నడుమ చంద్రబాబు హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 15 గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేసి, మరో 15 ఎస్సీ గురుకులాలను మంజూరు చేశారు. మరో 3నెలల్లో పదవీ కాలం పూర్తికావస్తున్న సైకో సిఎం జగన్… టిడిపి ప్రభుత్వం మంజూరు 15 గురుకులాలలను రద్దుచేసి దళిత బిడ్డలకు తీరని ద్రోహం చేశాడు. గత నాలుగు న్నరేళ్లలో జగన్ సర్కారు ఏర్పా టు చేసింది కేవలం ఒకే ఒక్క గురుకుల పాఠశాల మాత్రమే. తెలుగుప్రజలకు సంక్షేమం, అభి వృద్ధిని పరిచయం చేసింది తెలు గుదేశం పార్టీ అనడానికి ఇంత కంటే ఏం నిదర్శనం కావాలి?