- స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు
- రాష్ట్రంలో మరో మహిళా వర్సిటీ ఏర్పాటు
- స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా విధానం
- అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి లోకేష్
అమరావతి(చైతన్యరథం): కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘జన్ విశ్వాస’ నినాదంలో భాగం గానే “ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2026”ను ప్రవేశపెడుతున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. నేడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం ప్రైవేటు రంగానికి, పరిశ్రమలకు మాత్రమే కాకుండా అన్ని రంగా లకు వర్తింపజేయాలని సీఎం స్పష్టంగా చెప్పారు. ఇందులో భాగంగా ఒక కమిటీని కూడా నియమించాం. ఆ కమిటీ రాష్ట్రంలోని అన్ని శాఖల కార్యదర్శులను కలిసి సంప్రదింపులు జరిపింది. ప్రత్యేకంగా ఉన్నత విద్యాశాఖను కూడా కలిసి అనేక సూచనలు అందించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో పాటు రాష్ట్రంలోని స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం అవసరం. అత్యంత ప్రాధాన్యత కలిగిన బిల్లు ఇది. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసినట్లయితే ఉత్తరప్రదేశ్‌లో సుమారు 111 విశ్వవిద్యాలయాలు, గుజరాత్లో 100 విశ్వవిద్యాలయాలు, రాజస్థాన్‌లో 94 విశ్వవిద్యాలయాలు, కర్ణాటకలో 91 విశ్వవిద్యా లయాలు, తమిళనాడులో 65 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 56 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వాటిలో 22 ప్రభుత్వ, 14 ప్రైవేటు, 7 డీమ్డ్, 10 స్టాట్యుటరీ విశ్వ విద్యాలయాలు, 3 కేంద్ర విశ్వవిద్యాలయాలు. ఇవికాకుండా చీISజు=, IIT, IIవీ వంటి జాతీయ సంస్థలు కూడా 10 ఉన్నా యి. రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలకు అనుబంధంగా 2602 కళాశాలలు ఉండగా, వాటిలో సుమారు 2369 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయని వివరించారు.
ప్రధానమైన సవరణలు ఇవే
ప్రతిపాదిత సవరణల్లో మొదటిది భూమి నిబంధన: గతంలో ప్రేవైటు వర్సిటీ స్థాపనకు కనీసం 50 ఎకరాలు ఉండాలనే నిబంధన ఉండేది. కేంద్రప్రభుత్వం భూమిపై నిబంధనలు తొల గించిన నేపథ్యంలో మనం 50 ఎకరాలను 10 ఎకరాలకు తగ్గిం చాం. ఇది సీఆర్డీఏ, గ్రేటర్ విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లకు వర్తిస్తుంది. మిగిలిన ప్రాంతాలలో బ్రౌన్ ఫీల్డ్, గ్రీన్‌ఫీల్డ్ విశ్వవిద్యాలయాలకు 15 ఎకరాలు నిర్ణయించాం.
రెండవది పెట్టుబడి నిబంధన: కనీస పెట్టుబడిపై నిబంధనను తొలగించాం. ప్రతి దరఖాస్తును ప్రభుత్వం నియమించే నిపుణుల కమిటీ ద్వారా ్పుasవ tశీ ్పుasవ దీasఱsపై సమీక్షిస్తారు.
ఎండోమెంట్ ఫీజు: ఇది 5 కోట్ల రూపాయలకు తగ్గించడమైనది.
అక్రిడిటేషన్: బ్రౌన్‌ఫీల్డ్ విశ్వవిద్యాలయంగా మార్చేందుకు UG్పు మార్గదర్శకాల ప్రకారం కనీసం 3.01 సీజీపీఏ తప్పనిసరి చేశాం.
జాయింట్ డిగ్రీ నిబంధన: గతంలో ప్రపంచంలోని టాప్ 100 విదేశీ విశ్వవిద్యాలయాలతో జాయింట్ డిగ్రీ ఉంటేనే విశ్వవిద్యా లయంగా మార్చాలన్న నిబంధనను తొలగించాం. కొత్తగా వచ్చే విదేశీ విశ్వవిద్యాలయాలు 3 నుంచి 5 సంవత్సరాల ట్రాక్ రికార్డు చూసిన తర్వాతే జాయింట్ డిగ్రీకి ముందుకు వస్తాయి.
మరో మహిళా వర్సిటీ రాబోతోంది
ఈ బిల్లు ద్వారా రాష్ట్ర చరిత్రలో రెండవది అయిన “విష్ణు మహి ళా విశ్వవిద్యాలయం” ఏర్పాటుకు వెసులుబాటు కల్పించాం. డీమ్డ్ విశ్వవిద్యాలయాలను అప్‌గ్రేడ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా ప్రభుత్వ విధానం కనుక ఫాస్ట్‌ట్రాక్ అప్రూవల్ ద్వారా మొత్తం ప్రక్రియను 60 రోజు లలో పూర్తి చేసి ఆన్లైన్ పారదర్శక విధానాన్ని తీసుకొచ్చాం. ప్రతి ప్రాంతంలో క్లస్టర్ ఆధారిత విధానం ద్వారా స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, అక్వా, సిమెంటు, స్టీలు, మెడికల్ డివైస్, ఫార్మా సిటీ వంటి 22 రకాల క్లస్టర్లు వస్తున్నాయి. వాటికి అనుగుణంగా విశ్వ విద్యాలయాలు రీసెర్చి ఓరియంటేషన్ వైపు వెళ్లేందుకు ఈ సవర ణలు తోడ్పడతాయి. ప్రజా ప్రభుత్వం వచ్చిన తరువాత శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, విష్ణూస్ ఉమెన్స్ యూనివర్సిటీ, చలపతి యూనివర్సిటీ, ఆర్వీఎస్ యూనివర్సిటీ, ప్రగతి యూనివ ర్సిటీ వచ్చాయి. క్వాలిటీలో రాజీ లేకుండా, రీసెర్చిపై ప్రత్యేక దృష్టి, ఇండస్ట్రీ లింకేజీ, ఉన్నత ప్రమాణాలతో కూడిన విశ్వవిద్యా లయాల ఏర్పాటే ఈ బిల్లు ముఖ్యోద్దేశమని తెలిపారు.











