- ప్రజలంతా చైతన్యవంతులై అప్రమత్తంగా వ్యవహరించాలి.
- మంత్రులు, ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలి
- ప్రతి 2 గంటలకోసారి ముఖ్యమంత్రి పరిస్థితిని సమీక్షిస్తున్నారు
- ప్రధాని కార్యాలయానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాం
- మొంథా తుపాను ముందస్తు చర్యలపై మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్య రథం మొంథా తుపానువల్ల రాష్ట్రంలో సుమారు 40లక్షల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారు. కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు అత్యధిక తీవ్రత కలిగిన ప్రాంతాలుగా గుర్తించాం. ఆ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం చూపే అవకాశమున్నందున ఆ జిల్లాలు రెడ్ అలర్ట్లో ఉన్నాయి. ప్రజాప్రభుత్వం లక్ష్యం ఒక్కటే, ఎటువంటి ప్రాణనష్టం సంభవించకూడదు. ముఖ్యమంత్రి ఆదేశాలపై పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి హోంమంత్రి అనితతో కలిసి మంగళవారం సాయంత్రం మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడారు. తుపాను సహాయ చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. ఒకపక్క డిజాస్టర్ మేనేజర్మెంట్ మంత్రిగా అనిత, ఆర్టీజీఎస్ మంత్రిగా తాను సమన్వయంతో గత 24గంటలుగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామన్నారు. గత ఐదు రోజులుగా మొంథా తుపాను గమనాన్ని పరిశీలిస్తూ తుపాను ప్రభావిత ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నాం. ఈ రోజు రాత్రి 11.30కు అమలాపురం సమీపంలో తుపాను తీరం దాటబోతోంది. ఈ సందర్భంగా 90 నుంచి 100 కి.మీల వేగంతో అక్కడ ఈదురు గాలులు వీచే అవకాశముంది. పరిసర ప్రాంతాల్లో భారీవర్షాలు
1906 తాత్కాలిక షెల్టర్ల ఏర్పాటు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 23 నుంచీ నేరుగా తుపాను పరిస్థితిపై ముందస్తు పర్యవేక్షణ సాగిస్తున్నారు. యుఏఈకి వెళ్లే ముందు, అక్కడనుంచి వచ్చిన తర్వాత 12 రివ్యూ మీటింగ్లు, టెలీ కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా తుపాను॥ పరిస్థితులపై సమీక్ష జరిపారు. ప్రధాని నరేంద్రమోదీ సీఎంతో మాట్లాడి ముందస్తు ఏర్పాట్లపై వాకబు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రియల్ టైమ్ రిపోర్టులు పంపించింది. రాష్ట్రానికి ఏంకావాలన్నా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి చెప్పారు. తుపాను ప్రభావం, ముంబై తీవ్రత అధికంగా ఉండే 1,328 గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాం. 3,465 గర్భిణీలను తరలించి, వారికి కావాల్సిన పౌష్టికాహారం, నిత్యావసరాలను అందజేస్తున్నాం. 1,906 తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేసి -పునరావాసానికి అవసరమైన సామగ్రి అంతా పంపించాం. శానిటేషన్కు అవసరమైన బ్లీచింగ్ పౌడర్, లైమ్, ఇతర సామగ్రిని ఆయా గ్రామాలకు చేరవేశామని మంత్రి లోకేష్ వివరించారు.
ఎన్ డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం
14,798 పాఠశాలలకు సెలవులు ప్రకటించాం. 364 స్కూళ్లను పునరావాస కేంద్రాలుగా మార్చాం. ఈనెల 29వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీచేసి, నిషేధాజ్ఞలు విధించాం. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం 11 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్ఆర్ఎఫ్ టీమ్లు, రిజర్వ్ టీమ్లు సిద్ధంగా ఉన్నాయి. అవసరమైతే రావడానికి ఆర్మీ కూడా హైదరాబాద్లో సిద్ధంగా ఉంది. 145 ఉడ్ కటింగ్ టీమ్స్ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో చెట్లు పడిపోయిన చోట వారు సేవలందిస్తున్నారు. మెడికల్ అండ్ హెల్త్్కు సంబంధించి 325 శిబిరాల సిద్ధం చేశాం. 876 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లు సైతం రెడిగా ఉన్నాయని మంత్రి వివరించారు.
సహాయ చర్యలపై ముందస్తు ఏర్పాట్లు
తుపాను తీరం దాటిన తర్వాత పునరుద్ధరణ ఆకార్యక్రమాలు కీలకం. ముఖ్యంగా విద్యుత్ శాఖకు సంబంధించి 11,347 స్తంభాలు, 1210 ట్రాన్స్ -ఫార్మర్లు రెడీ చేశాం. సైక్లోన్ డైరెక్షన్ను బట్టీ సేవలందించేందుకు 772 రెస్టోరేషన్ టీమ్స్ ను కూడా సిద్ధంగా ఉంచాం. హాస్పటల్కు కూడా ఎటువంటి “అంతరాయం లేకుండా యుద్ధప్రాతిపదికన విద్యుత్ ఇసరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా రోడ్లు కోతకు గురైతే వెంటనే -పునరుద్ధరించి, ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఆర్ అండ్ బి శాఖకు సంబంధించి 7,289 జేసీబీ, క్రేన్స్, వాహనాలు సిద్ధంగా ఉంచాం. తాగునీటికి సంబంధించి వాటర్ ట్యాంకర్లను రెడీ దేశాం. తుపాను సమయంలో ప్రధానంగా ప్రభావితమయ్యేది సీపీడబ్ల్యూ స్కీమ్స్. తిల్లీ అనుభవాలతో ముందస్తు చర్యలు తీసుకున్నాం. ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో పక్కాగా చర్యలు చేపట్టి 1,037 డీజిల్ జనరేటర్లను ఆయా ప్రాంతాలకు పంపించాం. ఎయిర్ టెల్, జియో, ఇతర సర్వీసు ప్రొవైడర్లు సెల్ ఫోన్ టవర్లకు అవసరమైన డీజి సెట్లూ సిద్దం చేశారు. డీజిల్ కూడా అందుబాటులో ఉంచామని లోకేష్ వివరించారు.
రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తున్నాం
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం కలెక్టర్లందరికీ నిధులు విడుదల చేశాం. ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ప్రధాన లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఆర్టీజీఎస్లో రాత్రంతా బసచేసి రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తాం. ముఖ్యమంత్రి ప్రతి 2గంటలకు ఒకసారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొంథా తుపాను తీరందాటాక వెనువెంటనే డ్రోన్స్, లోలెవల్ ఫ్లయింగ్ వెహికల్స్ వంట నష్టం, ఇళ్లు, ఆస్తి నష్టంపై రియల్ టైమ్ ట్రాకింగ్ పెట్టి యుద్ధప్రాతి పదికన సహాయ, పునరావాస చర్యలు ప్రారంభిస్తాం.. ప్రభుత్వం ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు వేసింది. దయచేసి ప్రజలంతా ఇళ్లలోనే ఉండండి. మేమ్లు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దు. అధికారులు చెప్పిన జాగ్రత్తలు పాటించండి. 100కి.మీ.ల వేగంతో తుపాను వస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే. ఇబ్బంది పడతాం. ఈ సమయంలో బీచ్ల దగ్గరకు వెళ్లడం మంచిది కాదు. ఈ రాత్రి 11.30 గంటలనుంచి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్నిచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. తీరం దాటాక కూడా భారీ వర్షాలు మురిసే అవకాశముంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిందిగా మంత్రి లోకేష్ విజప్తి చేశారు.
ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలోనే
ఈరోజు ఉదయం హెంమంత్రి, తాను..ఎమ్మెల్యేలు, ఎంపీలతో మాట్లాడాం, వారినుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. గోపాలపురం ఎమ్మెల్యే ఎర్రకాలువ సమస్య ఉందన్నారు. వెంటనే తగు చర్యలు చేపట్టాం. తుపాను తీరం దాటాక క్షేత్రస్థాయిలో గ్రామాలు, వంటపొలాలకు వెళ్లి సహాయ పునరావాస చర్యల్లో పాల్గొనాల్సిందిగా ప్రజాప్రతినిధులకు సూచించాం. ఇప్పుడు మా దృష్టి అంతా ప్రజలను చైతన్యవంతం చేసి, అప్రమత్తం వేయడమే ప్రభుత్వం ఈనెల 23 నుంచే అప్రమత్తంగా ఆఉంది. ముఖ్యమంత్రి ఇప్పటికి 12సార్లు సమీక్షలు కనిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజాప్రతినిధులంతా ఫీల్డ్లోనే ఉన్నారు. విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవితో సహా మంత్రులంతా తుపాను ప్రభావిత ప్రాంతాల్లోనే ఉండి పరిస్థితిని -పర్యవేక్షిస్తున్నారు. మంత్రులతోపాటు అందరూ
అప్రమత్తంగా ఉన్నారు. దీనిని తేలిగ్గా తీసుకోకుండా సీరియస్గా పనిచేస్తున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
ఆర్టీజీఎస్లో అవేర్ ప్లాట్ ఫాం
తుపాను తీరం దాటిన తర్వాత యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరిస్తాం. తుపాన్లను ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రికి ఎంతో అనుభవముంది. ఆయన 1996 కోనసీమ తుపాను, హుద్ హుద్, ఢిల్లీ =సమయంలో సమర్ధవంతమైన సేవలు అందించారు. గత 5 రోజులనుంచి మేమంతా ప్రిపరేషన్లో ఆఉన్నాం. చెట్లు కూలిపోయినపుడు వాటిని తొలగించే వరకు ఫాలో అప్ మెకానిజం ఏర్పాటుచేశాం. హెూంమంత్రి మానిటర్ చేస్తున్నారు. 10 నిమిషాల్లో క్లియర్ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రజాప్రతి నిధులతో నేను మాట్లాడాను, అందరూ సిద్ధంగా, అప్రమత్తంగా ఉన్నారు. ప్రమాదం సంభవించకుండా చాలా ప్రాంతాల్లో భారీ ఫ్లెక్సీలు తొలగించాం. తుపానుకు సంబంధించి పూర్తిస్థాయి డేటా మాకు ఎప్పటికప్పుడు వస్తోంది. ఆర్టీజీఎస్లో అవేర్ ప్లాట్ఫాం ర్పాటుచేశాం. రియల్ టైమ్ మానిటర్ చేస్తున్నాం. అడిజాస్టర్ మేనేజ్మెంట్, రిలీఫ్, రిహాబిలిటేషన్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. వాట్సాప్, ఎస్ఎంఎస్, వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
అన్నిశాఖలూ సర్వసన్నద్ధం
సహాయ చర్యల్లో ఎక్కడా అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. 99శాతం కచ్చితత్వంతో మాకు సమాచారం -అందుతోంది. రియల్ టైం సమాచారాన్ని, ప్రభుత్వం -తీసుకున్న చర్యలు ప్రధాని కార్యాలయానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. ప్రధానిమంత్రి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. పీఎంఓ కూడా మానిటర్ చేస్తోంది. గ్రామస్థాయిలో ఇప్రజాప్రతినిధులంతా తుపాను పరిస్థితిని “పర్యవేక్షిస్తున్నారు. వివిధ రకాల సోర్స్ ద్వారా డేటా సేకరిస్తున్నాం. శాటిలైట్ మ్యాప్స్ కూడా -తీసుకుంటున్నాం. ప్రజలను అప్రమత్తం చేసి చైతన్యం అంతేవడమే మా లక్ష్యం. ఇది రాజకీయాలకు సమయం కాదు. ప్రజలకు సేవలందించేందుకు అన్నిశాఖలు. ఐసర్వసన్నద్ధంగా ఉన్నాయని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో హెం మంత్రి అనిత పాల్గొన్నారు.














