- శ్రీజీబీసీకి నీరివ్వాలంటూ రైతులతో కలిసి ఆందోళన
- శ్రీహంద్రీనీవా కాలువ సమీపంలో రైతులతో కలిసి బైఠాయింపు
అనంతపురం: రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తు న్న ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను పోలీసు లు అరెస్ట్ చేశారు. ఉరవకొండ పోలీస్ స్టేషన్‌కు కాకు ండా కనేకల్ పోలీస్‌స్టేషన్‌కు పయ్యావులను పోలీసులు తరలించారు. కేశవ్ అరెస్టు సమయంలో రైతులకు పోలీసులకు మధ్య తీవ్రతోపులాట జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. కేశవ్‌ను అరెస్టు చేసేందుకు రెండు గం టల పాటు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఎమ్మెల్యే ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీ సులను రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. పయ్యావు ల కేశవ్‌తో పాటు ముఖ్య నాయకులను అరెస్టు చేసి రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు.
కాగా.. గుంతకల్ బ్రాంచ్ కెనాల్ (జీబీసీ)కి సాగు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆందోళనకు దిగారు. మం గళవారం ఉదయం బళ్లారి-అనంతపురం జాతీయ రహదారిపై హంద్రీనీవా కాలువ సమీపంలో రైతులతో కలిసి బైఠాయించిన పయ్యావుల నిరసన చేపట్టారు. జీబీసీ కాలువ కింద రైతులు వేల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు. సాగునీటిని విడుదల చేయక పోవడంతో మిర్చి పంటలు ఎండిపోతున్న పరిస్థితి నెల కొంది. మిర్చి పంట ఎండిపోతుండటంపై రైతులు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జీబీసీకి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హంద్రీనీవా కాలు వ వద్ద పయ్యావుల కేశవ్ బైఠాయించి నిరసన చేప ట్టారు. పయ్యావుల ఆందోళనను విరమింపచేసేందుకు పోలీసులు యత్నించారు. ఎమ్మెల్యే అరెస్ట్‌కు పూనుకు న్నారు. పయ్యావుల అరెస్ట్ సమయంలో హంద్రీనీవా కాలువ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పయ్యావుల కేశవ్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీ సులు ప్రయత్నించారు. గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్ప ఆందోళన వద్దకు చేరుకున్నారు. పోలీసులను కేశవ్ దగ్గరకు రానివ్వకుడా రైతులు తీవ్రంగా ప్రతిఘటించా రు. పోలీసులపై రైతులు తిరగబడ్డారు. పయ్యావులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రప్పిం చారు. అయితే హంద్రీనీవా నుంచి జీబీసీ కి నీటిని విడుదల చేసేంత వరకు ఆం దోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. రైతుల ఆందోళన పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరితో వ్యవ హరిస్తున్నా రంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పయ్యా వుల ఆందోళనతో హంద్రీనీవా కాలువ వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. చివ రకు పయ్యావులను పోలీసులు అరెస్ట్ చేసి కనేకల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.