- ముద్దాయిలపై అంత ప్రేమెందుకు?
- దళితజాతి మిమ్మల్ని చూసి ఛీకొడుతోంది
- వంశీ పరామర్శకు వెళ్లడం సిగ్గుచేటు
- చంచల్‌గూడ అనుబంధం కాబోలు..
- మా జగన్..మా జగన్ అంటున్నారు
- జైల్లో ఏమైనా వకాల్తా తీసుకున్నారా?
- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
మంగళగిరి(చైతన్యరథం): అనేక కేసుల్లో ముద్దాయి, అసాంఘిక శక్తిగా పేరు గాం చి దళితులను ఊచకోత కోసి మహిళల వ్యక్తిత్వ హననం చేసిన వల్లభనేని వంశీని జైల్లో పరామర్శించేందుకు జగన్ వెళ్లడం విడ్డూరమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ ఐదేళ్ల పాలన అరాచక, అప్రజాస్వామిక, దౌర్జన్యపూరిత, రాక్షస పాలన. ముద్దాయి వల్లభనేని వంశీని పరామర్శించడానికి జగన్ పడుతున్న తపన, చూపిస్తున్న ప్రేమ వెనుక మతలబేంటో? అర్థం కావడంలేదు. వంశీ అన్నెం పున్నెం ఎరగడు.. నిజాయితీపరుడు సచ్చీలుడు..చీమ కు కూడా హాని తలపెట్టడు.. పరస్త్రీలను, దళితులను గౌరవిస్తాడు.. భూ కబ్జాలు చేయ డు..దొంగ పట్టాలు సృష్టించడు..పట్టిసీమ మట్టి కొట్టేయడు.. దళితులను హింసించడు.. అత్యంత నిజాయితీపరుడు అనే భావన జగన్‌లో ఉన్నట్లుంది. పట్టిసీమ గట్టు మట్టిని కొల్లగొట్టిన వంశీని పరామర్శించేందుకు వెళ్లడానికి ఎవరైనా ఆలోచించాలి.
జగన్ పట్ల దళితులు ఆగ్రహావేశాలతో ఉన్నారనే విషయం జగన్ మరచిపోరాదు. పులివెందులకు చెందిన నాగమ్మ అనే దళితురాలు అత్యాచారానికి గురైతే పరామర్శకు వెళ్లని జగన్.. దుర్మార్గుడు, నికృష్టుడు వంశీని పరామర్శించడానికి వెళ్లడం ఆశ్చర్యంగా ఉంది. బాధితు రాలిని పరామర్శించేందుకు వెళ్లిన ప్రస్తుత హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు లపై ఎస్సీ, ఎస్టీ యాక్టు పెట్టించింది జగన్ కాదా? దళిత రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ విజ యపాల్.. జగన్ కోసం అరెస్టు అయితే ఆయనను పలకరించడానికి వెళ్లలేదెందుకు? బోరుగడ్డ అనిల్ అనే దళితుడిని పంమర్శించడానికి వెళ్లకపోవడానికి కారణం అతను దళితుడనా?
ముద్దాయిలన్నా..జైలన్నా ఎందుకంత ప్రేమ?
సొంత తల్లిని ఏడిరచిన వాడివి, చెల్లిని తరిమికొట్టిన వాడివి, బాబాయి కూతుర్ని మండుటెండలో పరార్ చేసిన వ్యక్తి జగన్. ఎన్నడూ వారి గురించి ఆలోచించని జగన్ ఇప్పుడు తగుదునమ్మా అని వంశీని పరామర్శించడం రాష్ట్ర మహిళలను కించపరచ డమే. మహిళలను మానసిక క్షోభ పెట్టిన వంశీని పరామర్శించడానికి జగన్ వెళ్లడం సిగ్గుచేటు. మహిళల పట్ల గౌరవం, ప్రేమ ఉండవు కానీ.. భూకబ్జాదారులు, దుర్మార్గు లు, అరాచక, అసాంఘిక శక్తులపై గౌరవం, ప్రేమ జగన్‌కు జాస్తి. ఏ తప్పు చేయని వాడిని పరామర్శించడంలో తప్పులేదు కానీ.. తప్పుల మీద తప్పులు చేసిన వాడిని పరా మర్శించడం పెద్ద తప్పు. నవ్విపోదురుగాక నాకేంటి అన్నట్లుగా తాను పరామర్శలకు వెళ్తాను, నన్నెవరు ఆపడానికంటే అది జగన్ ఇష్టం. ముద్దాయిలన్నా.. జైలన్నా జగన్‌కు ఎందుకంత ప్రేమ? నెల్లూరు జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, విజయ పాల్, బోరుగడ్డ అనిల్ లాంటి వారిని జగన్ ఎందుకు పరామర్శించలేదు? అని ప్రశ్నించారు.
అసాంఘిక శక్తికి పరామర్శలేంటి?
జగన్ రాష్ట్రాన్ని ఐదేళ్లు పాలించడం దురదృష్టకరం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒక కరుడు కట్టిన అసాంఘిక శక్తి, భూ కబ్జాదారుడు, దళితవర్గాల మీద దాడి చేసే వ్యక్తి. మహిళలు అంటే అతనికి ఏ మాత్రం గౌరవం లేదు. అతనిపై అనేక కేసులున్నా యి. అలాంటి వ్యక్తిని జగన్ పరామర్శించడమేంటి? ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని కిడ్నాప్ చేసి హింసించి అంతకుముందు పోలీసులకు ఇచ్చిన సాక్ష్యాన్ని వక్రీకరించి కోర్టు లో సాక్ష్యం ఇచ్చేటట్లుగా చేసిన తప్పుడు వ్యక్తి వల్లభనేని వంశీ. దళితుడిని బలవంతం చేసిన దౌర్భాగ్యుడిని, దుర్మార్గుడిని పోలీసులు అరెస్టు చేస్తే.. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటే.. జగన్ పరామర్శకు వెళ్లడంలో అర్థం లేదని మండిపడ్డారు.
దళితులు ఛీకొడుతున్నారు…
ఐదేళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. మీ పాలనలో నీచ, నికృష్ట సంఘ వ్యతిరేకి అయిన వంశీమోహన్ గన్నవరం ఎమ్మెల్యేగా సాగించిన అసాంఘిక కార్యక్రమాలు, అకృత్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలు అన్నీ ఇన్నీ కావు. వీటన్నింటికి కూడా పోలీసులు కేసులు రిజిస్టర్ చేసి అరెస్టు చేశారు. అతన్ని పరామర్శించడానికి జగన్ జైలుకెళ్లడమేంటి? నేను వస్తున్నాను నీకేం పర్వాలేదు అని అన్నట్లుగా ఉంది జగన్ వాలకం. ఏంటి దొంగలు దొంగలు సానుభూతి తెలియజేసుకుంటున్నారని ప్రజలు చెవు లు కొరుక్కుంటున్నారు. మేమంతా ఒకటేనయ్యా మీకు అర్థం కాదు అని జగన్‌మో హన్‌రెడ్డి అన్నట్లుగా ఉంది. ముద్దాయిలు అంటే ఎందుకు జగన్‌కు అంత ప్రేమ, వల్ల మాలిన ప్రేమ చూపిస్తారు జగన్ ముద్దాయిలను బాగా అభిమానిస్తారు. జైల్లో ఉన్న చాలామంది ముద్దాయిలు కూడా ‘‘మా జగన్, మా జగన్’’ అంటారట ఎందుకో మరి? జైల్లో ఏమైనా వకాల్తా తీసుకున్నారా? 16 నెలలు చంచల్‌గూడ జైల్లో ముద్దాయిగా ఉన్నప్పుడు వాళ్లతో పెరిగిన అనుబంధం కాబోలు.. వంశీ అన్యం పుణ్యం ఎరగడని, నిజాయితీపరుడని నిరూపించగలరా? దొంగ పట్టాలు పంచిన ఘనత వంశీది.
పట్టిసీమ మట్టి కొట్టేయలేదని నిరూపించగలరా? వంశీ ఒక నీచుడని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల తర్వాత అతన్ని ఇప్పుడు అరెస్టు చేశారే.. ముందే చేయాల్సింది అని అందరూ అడుగుతున్నారు. ఎందుకు ఇంత ఆలస్యం అయిం దని ప్రశ్నిస్తున్నారు. దళితుడిని తీసుకెళ్లి కిడ్నాప్ చేసి కొడితే వాడిని పరామర్శించడానికి మీరు వెళతారా? ఏ పార్టీ దళితుల పట్ల ప్రేమ మీకు అతని మీద ప్రేమ దళితుడిని కొట్టి నందుకు అతన్ని అభినందించడానికి వెళుతున్నారా? జగన్ వ్యవహార శైలిని చూసి అన్ని వర్గాలు ఈసడిరచుకుంటున్నాయి..చీకొడుతున్నాయని ధ్వజమెత్తారు. ఇది ఎక్కడి న్యా యం జగన్‌మోహన్‌రెడ్డి? ముఖ్యమంత్రిత్వంలో సారా రేట్లు విపరీతంగా పెంచాడని ఒక బూతు మాట అంటే ఓం ప్రతాప్‌ని చంపేశారు. అతని ఫోన్ ఇప్పటికీ ఇవ్వలేదు. ఓం ప్రతాప్ ఇప్పటకీ కూడా వారి టెలిఫోన్ సెల్‌ఫోన్ ఎక్కడ ఉందో తెలియదు. జగన్ జాత కం ఎవరికీ తెలియనిదికాదు. మీ వ్యవహార శైలి మాకు తెలియదా? దళితులను మీరు ఏ మాత్రం ప్రేమిస్తారో మాకు తెలియదా? నాయకుడిగా ఐదేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసే వ్యక్తిగా ఇలా వెళ్లటం ఒక ముద్దాయిని పలకరించడానికి వెళ్లడం తన గౌరవాన్ని దిగజా ర్చుకోవడమేనని హితవుపలికారు.