అమరావతి (చైతన్య రథం): గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర ప్రణాళికా విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్టు ప్రణాళికా విభాగం ముఖ్య కార్యదర్శి పీయుష్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. తొలుత పార్టీ తరపున కార్యక్రమాన్ని చేపట్టిన వైకాపా.. అనంతరం దీన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చేసింది. ఎన్నికలకు ఏడాది ముందు ఈ కార్యక్రమాన్ని జగన్ ప్రభుత్వం చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల అనంతరం నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు గ్రామ, వార్డు సచివాలయాల విభాగం చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.