మడకశిర (చైతన్యరథం): మా కుటుంబం కష్టాల్లో ఉంది ఆదుకోండి అంటూ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజుకు, మాజీ ఎమ్మెల్సీ గుండు మల తిప్పేస్వామికి ఓ తల్లి సహాయం కోరారు. ‘నా భర్త అనారోగ్యంతో ఉన్నారు. నా పిల్లలకు మంచి చదువు చదివించి మా కుటుంబాన్ని ఆదుకోండి’ అంటూ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజుతో ఓ మహిళ మొరపెట్టుకున్నారు. ఆ మహిళ ఆవేదనను విని ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజు చలించిపోయారు. మీ భర్తకు మంచి వైద్యం అందిస్తామని, మీ పిల్లలకు ప్రభుత్వం కళాశాలలో మంచి చదువులు చదివిస్తానంటూ ఎం.ఎస్ రాజు భరోసా కల్పించారు.