• కావలి నియోజకవర్గం నార్త్ అమలూరు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో 500 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.
• గ్రావెల్ మాఫియా కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం.
• కొందరు వైసిపి నాయకులు అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేస్తూ పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు.
• విచ్చలవిడి గ్రావెల్ తవ్వకాల కారణంగా నీరు, భూమి కలుషితమవుతున్నాయి.
• గ్రావెల్ తవ్వకాల వల్ల ఏర్పడిన గోతుల్లో పడి పశువులు ప్రమాదాల బారిన పడుతున్నాయి.
• మా గ్రామంతోపాటు పొరుగున ఉన్న 3 గ్రామాల రైతులకు నార్త్ అమలూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఈ ప్రభుత్వం నిలిపివేసింది.
• దీనివల్ల పంటపొలాల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
• మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించండి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• రాష్ట్రప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదు, తమ ఖజానా నిండాలన్నది జగన్ రెడ్డి సిద్ధాంతం.
• ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో వైసిపి ఎమ్మెల్యేలు మాఫియాలు తయారై ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారు.
• తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక గ్రావెల్ దొంగలపై ఉక్కుపాదం మోపుతాం.
• నార్త్ అమలూరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పూర్తిచేసి రైతుల తాగునీటి కష్టాలు తీరుస్తాం.