అమరావతి(చైతన్యరథం): నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసమైన ఘటనపై వైకాపా శ్రేణులు ఆందోళనకు దిగిన విష యం తెలిసిందే. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం చేసిన జమ్ములయ్య.. వైకాపా నేతల అనుచరుడేనని పోలీసులు తేల్చినట్లు చెప్పారు. బాబాయి గుండెపోటు, కోడి కత్తి, గులకరాయి నాటకాల రాయు డైన జగన్.. మరో కొత్త డ్రామా సృష్టించాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు తన గొడ్డలి పార్టీ కార్యకర్తలను సైకో జగన్ రంగంలోకి దింపారని మండిపడ్డారు. జగన్నాటకాలు చూసి జనం ఛీకొట్టినా.. డ్రామాలు మానట్లేదని అన్నారు. ఎన్ని సార్లు దొరికిపోయినా.. కుట్ర, క్షుద్ర రాజకీయాలు మానరా? అని ప్రశ్నించారు.















