టిడిపి అధికారంలోకి వచ్చాక అనంతపురం నుంచి బళ్ళారి రహదారి నిర్మాణం చేపడతామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా గురువారం అరవకూరు గ్రామస్తులు లోకేష్ ను కలిసి వారి సమస్యల గురించి విన్నవించారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ గ్రామంలో సిసి రోడ్లు వేయిస్తామని హామీ ఇచ్చారు.
టిడిపి హయాంలో గ్రామీణ ప్రాంతంలో 25 వేల కిలోమీటర్ల మేర సీసి రోడ్లు నిర్మించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ గ్రామంలో డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేయటంతో పాటు పాటశాల కు కాంపౌండ్ వాల్, మౌలిక సదుపాయాలు, స్మశానానికి హద్దులు ఏర్పాటు చేయించనున్నట్టు చెప్పారు.