అంబేద్కర్ జయంతి సాక్షిగా దళితులకు అవమానం
వైసిపి సైకోల్లారా… నన్ను కెలికితే మీకు కన్నీళ్లే!
అవినీతి గురించి మాట్లాడితే అల్టిమేటమ్ ఇస్తారా?
రాష్ట్రం పేదరికంలో ఉంటే జగన్ మాత్రం రిచ్
ముందు నోటీసులు… ఆపైన సెటిల్ మెంట్లు!
ప్యాపిలి బహిరంగసభలో టిడిపి యువనేత లోకేష్
…….
అంబేద్కర్ జయంతి సందర్భంగా సాక్షి పత్రిక, ఛానెల్, వైసిపి నాయకులు, సాక్షి యజమాని భారతి రెడ్డి దళితుల్ని అవమానపర్చారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్యాపిలి బహిరంగసభలో లోకేష్ మాట్లాడుతూ జగన్ దళితులకు పీకింది, పొడిసింది ఏమి లేదు అని ఎస్సీల సమావేశంలో అంటే ఆ వీడియో ని ఫేక్ ఎడిట్ చేసి హడావిడి చేస్తున్నారు. 10 ఏళ్ల నుండి సాక్షిలో నాపై అనేక అసత్య వార్తలు రాస్తున్నారు. నేను వైసిపి నేతలకు, భారతి రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా. వాళ్ళు రాసిన వార్తకి సంభందించిన అసలైన వీడియో విడుదల చెయ్యాలి లేకపోతే దళితులకు క్షమాపణ చెప్పాలి. నేను ఇప్పటికే అసలైన వీడియో మీడియాకి విడుదల చేశాను. దళితుల్ని చంపుతున్న వైసిపి నేతలు నేను అవమానించానని మాట్లాడటం విడ్డూరంగా ఉంది అని లోకేష్ పేర్కొన్నారు. అవినీతి గురించి మాట్లాడకూడదని వైసిపి ఎమ్మెల్యేలు నాకు అల్టిమేటం జారీచేస్తున్నారు.
వెయ్యి మంది పోలీసుల్ని పంపిన జగనే నన్ను అడ్డుకోలేకపోయాడు. మీరెంత? వైసిపి సైకోలకు ఒకటే చెబుతున్నా నన్ను కెలికితే మీకు కన్నీరే మిగులుతుందని హెచ్చరించారు. యువగళం పాదయాత్రలో భాగంగా ప్యాపిలిలో నిర్వహించిన బహిరంగసభలో లోకేష్ మాట్లాడుతూ భయం నా బయోడేటా లో లేదు బ్రదర్స్. జగన్ ప్రిజనరీ, మీ లోకేష్ ఒక వారియర్. నేను ముందుగానే చెప్పా. సజావుగా సాగనిస్తే పాదయాత్ర, లేదంటే దండయాత్ర అని. జగన్ పరిపాలనలో రాష్ట్రం పేద. ఆయన మాత్రం రిచ్. అభివృద్ధి లో ఏపీ లాస్ట్ కానీ జగన్ రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా. ఓటేసిన ప్రజల బ్రతుకులు మారలేదు కానీ జగన్ దేశంలోనే రిచ్ సీఎం అయ్యాడు. 30 మంది సీఎంలకు వెయ్యి కోట్ల ఆస్తి ఉంటే అందులో ఒక్క జగన్ కే 51 శాతం అంటే రూ.510 కోట్ల ఆస్తి ఉంది. మిగిలిన 29 మంది సీఎంల ఆస్తి కలిపితే రూ.500 కోట్లే. జగన్ పాలనలో రాష్ట్ర ఆస్తి, ప్రజల ఆస్తి కరిగిపోతుంటే జగన్ ఆస్తి మాత్రం పెరిగిపోతుంది. అందుకే జగన్ మోహన్ పేరు మార్చా ఆయన రిచ్ మోహన్. నాలుగేళ్లుగా జగన్ రాజారెడ్డి రాజ్యాంగం పొగరు చూపించాడు. యువగళం పాదయాత్రతో అంబేద్కర్ రాజ్యాంగం పవర్ ఏంటో మనం చూపించాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు కొట్టిన దెబ్బకి తాడేపల్లి ప్యాలస్ టీవీలు పగిలిపోయాయి అని లోకేష్ వెల్లడించారు.
మహామహులు ఏలిన నేల డోన్
డోన్ దద్దరిల్లింది. డోన్ దెబ్బకి వైసిపి నాయకుల దిమ్మతిరిగిపోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవ రెడ్డి గారు 1962 లో డోన్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నవ్యాంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కేఈ కృష్ణమూర్తి డోన్ నుండే ఎమ్మెల్యేలుగా గెలిచారు. మద్దిలేటి లక్ష్మి నరసింహ స్వామి, గుండాల చెన్ కేశవస్వామి పుణ్యక్షేత్రాలు ఉన్న నేల ఈ డోన్. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న డోన్ నేలపై నడవడం నాఅదృష్టం.అంబేద్కర్ జయంతి సంధర్భంగా ఆయనకి నివాళులర్పిస్తున్నానన్నారు. పేదవాడు ఎప్పడూ పేదరికంలో ఉండాలి అనేది రిచ్ మోహన్ కోరిక. దానికి చక్కటి ఉదాహరణ సెంటు స్థలం స్కామ్. భూమి కొనుగోలు అంటూ పేదల పేరుతో కోట్లు కొట్టేసారు. ఆ భూమిని చదును చెయ్యడం, ఇళ్ల నిర్మాణం అంటూ వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు. ముందు ఇళ్లు ఫ్రీ గా కట్టి ఇస్తాం అన్నారు. ఇప్పుడు ఇల్లు కట్టక పోతే పట్టా వెన్నకి తీసుకుంటాం అని బెదిరిస్తున్నారు. పేదవాళ్ళు అధిక వడ్డీలకు అప్పులు తెస్తున్నారు. ఈయన పెంచిన ఇసుక, సిమెంట్ ధరలతో ఇంటి నిర్మాణం కోసం 6 నుండి 10 లక్షల ఖర్చు అవుతుంది. అంటే పేదలు జీవితాంతం పేదరికంలో ఉండాల్సిందే అని వివరించారు.
రిచ్ మోహన్ ఫిటింగ్ & కటింగ్ మాస్టర్
రిచ్ మోహన్ ఒక ఫిట్టింగ్ మాస్టర్ ఆయన ప్రజలకు ఎలా ఫిట్టింగ్ పెడతాడో మీకు చెబుతా. రిచ్ మోహన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. రిచ్ మోహన్ ఒక కటింగ్ మాస్టర్ ఎలాగో చెప్పాలా? అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసింది జగన్ అని వివరించారు.
యువతకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
ఉద్యోగాలు ఇస్తే ఎక్కడ యువత రిచ్ అయిపోతారో అని రిచ్ మోహన్ భయం. అందుకే ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. ఖైదీలకు 2 వేల రూపాయల మెస్ ఛార్జీలు ఇస్తుంటే, విద్యార్థులకు మాత్రం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. జగన్ విశాఖ, అనంతపురం, గుంటూరు లో మూసేసిన స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించడంతో పాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం అని లోకేష్ హామీ ఇచ్చారు.
ధనదాహంతో తాళిబొట్లు తెంచేస్తున్నాడు
రిచ్ మోహన్ ధన దాహం ఇంకా తీరలేదు అందుకే మహిళల తాళిబొట్లు కూడా కొట్టేస్తున్నాడు. మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టి 25వేల కోట్లు అప్పు తెచ్చాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం అని చెప్పారు. రిచ్ మోహన్ రైతుల్ని కూడా దోచేస్తున్నాడు. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగుల మందులు అన్ని జగన్ బ్రాండ్లే. రిచ్ మోహన్ పరిపాలనలో పురుగుల మందులు పనిచేయవు. జగన్ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లుఅని లోకేష్ హెచ్చరించారు. రిచ్ మోహన్ ఉద్యోగస్తులు దాచుకున్న డబ్బు కూడా కొట్టేస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. మీకు తెలియకుండా మీ వస్తువు దొంగిలిస్తే దొంగ అంటాం. ఏకంగా పోలీసుల డబ్బులే కొట్టేసాడు స్టిక్కర్ మోహన్. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడుఅని ఆరోపించారు.
బిసిలను చావుదెబ్బతీశాడు
బీసీలను చావుదెబ్బ తీసాడు రిచ్ మోహన్. పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు.బీసీలకు శాశ్వత కుల ధృవ పత్రాలు అందిస్తాం. బీసీలమని ఆరు నెలలకోసారి కుల ధృవ పత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి లేకుండా చేస్తాం. మొబైల్ లో ఒక్క బటన్ నొక్కగానే ఇంటికి బిసి కుల ధృవ పత్రాలు వచ్చే ఎర్పాటు చేస్తాం.అవి శాశ్వత కుల ధృవ పత్రాలు గా ఉపయోగపడేలా చట్టం లో మార్పులు తీసుకొస్తాం. దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు ఇస్తాం అని లోకేష్ వెల్లడించారు.
జగన్ పాలనలో దళితులపై దమనకాండ
దళితుల పై వైసిపి పాలనలో దమనకాండ కొనసాగుతూనే ఉంది. డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలైంది. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్న వరకూ వచ్చింది. ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు వరప్రసాద్ కి గుండు కొట్టించారు, మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ని కొట్టి చంపారు, జగన్ లిక్కర్ స్కామ్ పై పోరాడినందుకు ఓం ప్రతాప్ కి చంపేసారు. పెద్దిరెడ్డి అవినీతి పై పోరాడినందుకు జడ్జ్ రామకృష్ణ ని హింసించారు. ఒక్క కేసులో అయినా దళితుల పై దాడి చేసిన వారికీ శిక్ష పడిందా? సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని చంపేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కి సన్మానం చేసి ఉరేగించారు. వైసిపి పాలనలో దళితులను చంపడానికి జగన్ స్పెషల్ లైసెన్స్ ఇచ్చారు అని ఆరోపించారు.
మైనారిటీలనూ మోసగించిన జగన్
మైనార్టీ సోదరులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. మైనారిటీలను వైసిపి ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడు. మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు. ఆత్మహత్య చేసుకోవడం మైనార్టీలు మహా పాపంగా భావిస్తారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కేవలం వైసీపీ నాయకుల వేధింపుల వల్లే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇబ్రహీం అనే ముస్లిం నేతను నరసరావుపేటలో దారుణంగా నరికి చంపేశారు. పలమనేరులో మిస్బా అనే పదో తరగతి చెల్లిని వైసీపీ నాయకుడు సునీల్ టీసీ ఇప్పించి, బలవంతంగా వేధించడంతో, చదువుకు దూరం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు లో హాజీరాని అత్యాచారం చేసి చంపేశారు. ఆమె తల్లికి కనీసం పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధించింది. టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. హజ్ యాత్రకు సహాయం చేసాం. ఆనాడు బీజేపీ తో పొత్తు ఉన్నా మైనార్టీల పై ఒక్క దాడి జరగలేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపలేదుఅని లోకేష్ వివరించారు.
రెడ్డిసోదరులు కూడా ఆలోచించాలి
డోన్ లో ఉన్న రెడ్డి సోదరులు కూడా ఒక్క సారి ఆలోచించండి. మీరు జగన్ ని గెలిపించడం కోసం ఆస్తులు అమ్ముకున్నారు. ఇప్పుడు మీకు కనీస గౌరవం ఉందా? కేవలం పెద్దిరెడ్డి, సజ్జల రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి తప్ప మిగిలిన రెడ్లు ఎవరైనా బాగుపడ్డారా? ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఎమ్మెల్యేలుగా ఉన్న డోన్ కి ఇప్పుడు ఒక అసమర్ధ ఎమ్మెల్యే ఉన్నారు. అసెంబ్లీ లో ఆయన చెప్పిన అన్ని గాలి కధలు ఎవరూ చెప్పి ఉండరు. ఆర్థికశాఖ మంత్రి నియోజకవర్గం అంటే ఎలా ఉండాలి? అభివృద్ధిలో డోన్ నంబర్1 గా ఉండాలి. కానీ డోన్ పరిస్థితి చూస్తే నాకు బాధేస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు.
డోన్ లో అభివృద్ధి నిల్లు… అవినీతి ఫుల్లు!
మీ ఎమ్మెల్యే గారి పేరు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి. డోన్ లో అభివృద్ధి నిల్లు. అవినీతి ఫుల్లు. ఈయన నియోజకవర్గంలో ఉండేది తక్కువ. ఢిల్లీలో ఉండేది ఎక్కువ ఎందుకో తెలుసా అప్పు కోసం. అందుకే ఈయనకు అప్పుల అప్పారావు అని పేరు పెట్టా. అప్పుల అప్పారావు అవినీతిలో మాత్రం తోపు. నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గనులు ఏమి వదలడం లేదు. ఆఖరికి కరోనాని కూడా క్యాష్ గా మార్చుకున్నారు మన అప్పుల అప్పారావు. డోన్ నియోజకవర్గాన్ని కేకు ముక్కల్లా కోసి తన బంధువులకు పంచేసారు. ఇసుక ఒకరికి, మట్టి ఒకరికి, మైన్స్ ఒకరికి అని లోకేష్ ఆరోపించారు.
బుగ్గన గారి దోపిడీ స్టయిలే వేరు
దోపిడీ లో ఈయన స్టయిల్ వేరు. ఇక్కడ ఉండే క్రషర్లు, మైన్ల యజమానులకు భారీగా పెనాల్టీలు వేస్తారు. తరువాత ఈయన మనుషులు రంగంలోకి దిగి సెటిల్మెంట్ అంటూ డబ్బులు కొట్టేస్తున్నారు. కరోనా టైంలో సహాయనిధి అంటూ మైన్స్ యజమానుల నుండి డబ్బులు వసూలు చేసి మింగేసారు మన అప్పుల అప్పారావు. డోన్ నియోజకవర్గంలో అక్రమ ఇసుక, మట్టి రవాణా మొత్తం అప్పుల అప్పారావు మేనల్లుడు గజేంద్రరెడ్డికి అప్పగించారు. ఒక ట్రాక్టర్ ఇసుక రూ.6000, టిప్పర్ రూ.25000 వరకూ అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. కరోనాని కూడా క్యాష్ చేసుకుంది అప్పుల అప్పారావు కుటుంబం. ఈయన అన్న బుగ్గన హరినాధ్ రెడ్డి ఎండిగా ఉన్న కంపెనీ నుండి ప్రభుత్వం పీపీఏ కిట్లు కొనుగోలు చేసింది. ఈ కాంట్రాక్టులో కోట్లు కొట్టేసారు. ప్యాపిలి మండలం బూరుగుల గ్రామంలో సర్వే నంబర్ 870 లో దాదాపు 500 ఎకరాలు కాజేశారు మన అప్పుల అప్పారావు అనుచరులు. డోన్ రూరల్ మండలం కమలాపురం గ్రామానికి చెందిన అర్జున్ రెడ్డికి చెందిన 5 కోట్లు విలువ చేసే భూమిని గజేంద్ర రెడ్డి కబ్జా చేసారు. బేతంచెర్ల టౌన్ లో సర్వే నెం.123 వంక పోరంపోగు స్థలం కబ్జా చేసి బిల్డింగులు కట్టేసారు వైసిపి నేతలు. బేతంచెర్ల మండలం, గొర్లగుట్ట గ్రామంలో దేవుని మాన్యం భూములు 26 ఎకరాలు కొట్టేయడానికి స్కెచ్ వేశారు. 15 మంది బినామీల పేర్లతో ఓర్వకల్లు ఏరియాలో లీజులు పొంది అక్రమ మైనింగ్ చేస్తున్నారు అని ఆరోపించారు.
డోన్ లో యథేచ్చగా గంజాయి, మద్యం
డోన్ పట్టణంలో మట్కా, అక్రమ మద్యం, గంజాయి విచ్చలవిడిగా ఏరులై పారుతోంది. ఈ దందా వెనుక ఉంది అప్పుల అప్పారావు అనుచరులే. ఒక మహిళా న్యాయవాది ఆటోలో వెళ్తుంటే గంజాయి మత్తు లో ఉన్న బ్లేడ్ బ్యాచ్ ఆమెని బెదిరించారు. అంటే ఇక్కడ ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో అర్దం చేసుకోవచ్చు. అప్పుల అప్పారావు ప్రధాన అనుచరులైన కౌన్సిలర్ దినేష్, ప్రసాద్ కర్ణాటక నుండి మద్యం తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. సొంత పార్టీ నాయకులకు కూడా రక్షణ లేదు. వైసిపి నాయకుడు నాగార్జునరావుకి చెందిన 3 ఎకరాల భూమిని కబ్జా చేసారు అప్పుల అప్పారావు అనుచరులు. రాప్తాడు ఏరియాలో ఇండస్ట్రియల్ హబ్ దగ్గర బినామీ పేర్లతో ౩౦౦ ఎకరాలు కొన్నారు. ఆఖరికి పక్క రాష్ట్రం కర్ణాటక బాగల్కోట ఏరియాలో అక్రమ మైనింగ్ చేస్తుంది ఈ అప్పుల అప్పారావు ఫ్యామిలీ. వైసిపి మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది. మైనింగ్ అక్రమాల పై పోరాడిన లద్దగిరి శ్రీను ని వైసిపి మైనింగ్ మాఫియా హత్య చేయించింది. ఇక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ గురించి లోకాయుక్తా కూడా సీరియస్ అయ్యింది అంటే ఎంత దారుణ పరిస్తితి ఉందో అర్థం చేసుకోవచ్చు అని లోకేష్ వివరించారు.
పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
జగన్ పాదయాత్రలో డోన్ కి వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చారు. డోన్ ను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మోడల్ నియోజకవర్గం దేవుడెరుగు. అస్సలు అభివృద్ధి జరగని నియోజకవర్గాల లిస్ట్ లో డోన్ ఒకటి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. హంద్రీనీవా జలాలతో డోన్ లో ఉన్న చెరువులు అన్ని నింపేస్తా అన్నాడు. నింపాడా? టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే హంద్రీనీవా జలాలు తీసుకొచ్చి ఇక్కడ చెరువులు నింపుతాం. నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. డోన్ లోని రుద్రాక్షల గుట్ట ప్రాంతంలో 15 సంవత్సరాలకు పైగా అక్కడ నివాసం ఉంటున్న సుమారు 1000 పేద కుటుంబాలను ప్రభుత్వ ఆసుపత్రి కట్టే నెపంతో ఖాళీ చేయించడం జరిగింది. వారు నిరసన వ్యక్తం చేయగా ప్రత్యామ్నాయంగా వేరే చోట నివాస స్థలాలు ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటి వరకూ దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు అని లోకేష్ పేర్కొన్నారు.
డోన్ ను అభివృద్ధి చేసింది టిడిపినే
డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది టిడిపి. సాగు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసింది టిడిపి. గ్రామాల్లో సిసి రోడ్లు, పంచాయతీ భవనాలు, రోడ్లు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది టిడిపి. డోన్ నియోజకవర్గంలో మామిడి, అరటి రైతుల కష్టాలు నాకు తెలుసు. సబ్సిడీతో డ్రిప్, ప్యాక్ హౌస్ కోసం గతంలో ఇచ్చినట్టు 2 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. మైనింగ్, కలర్ స్టోన్ పాలిష్ ఫ్యాక్టరీల యజమానులు పడుతున్న ఇబ్బందులు నాకు తెలుసు. రాయల్టీ మూడు రెట్లు పెంచేసారు. కరెంట్ బిల్లు నాలుగు రెట్లు పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని పన్నులు తగ్గించి ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు వచ్చేలా చేస్తాం. ప్యాపిలి మండలంలో 4 లైన్ రోడ్డు పనులు మొదలు పెట్టి ఆపేసారు ఆ పనులు మేము పూర్తి చేస్తాం. డోన్ లో పాలిటెక్నిక్ కళాశాల, ప్యాపిలి లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చెయ్యాలి అనే డిమాండ్ ఉంది. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే సానుకూల నిర్ణయం తీసుకుంటాం. నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తాం. అప్పుల అప్పారావు చాలా తప్పులు చేసారు. టిడిపి నాయకులను వేధించారు, కార్యకర్తలపై కేసులు పెట్టారు. జైలుకి పంపారు. నేను ఊరుకోను అప్పుల అప్పారావు అండ్ గ్యాంగ్ కి సరైన ట్రీట్మెంట్ ఇస్తా. మా నాయకులు, కార్యకర్తల జోలికి వచ్చిన అందరికి చుక్కలు చూపించడం ఖాయం. వడ్డీతో సహా చెల్లిస్తా అని హెచ్చరించారు.