- ఇందన వినియోగాన్ని తగ్గిద్దాం
- జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు
- పాలకొల్లులో రూ.5.15 కోట్లతో పనులకు శ్రీకారం
పాýకొల్లు(చైతన్యరథం): ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన “నా దేశం- నా బాధ్యత” పిలుపు మేరకు తాను కూడా పొదుపును పాటిస్తున్నట్లు జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రజలందరూ ఇంధన విని యోగాన్ని తగ్గించి వారానికి ఒకరోజు “నో వెహికల్ డే” పాటించాలని పిలుపునిచ్చారు. పాలకొల్లు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రూ.5.15 కోట్లతో పలు అభివృద్ధి పనులకు కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. మండు టెండను లెక్క చేయకుండా పలు గ్రామాల్లో ఎలక్ట్రికల్ మోటార్‌సై కిల్‌పై పర్యటిస్తూ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. పాలకొల్లు మండలంలోని లంకలకోడేరు, దగ్గులూరు, బల్లిపాడు, జొన్నలగరువు, శివదేవుని చిక్కాల, తిల్లపూ డి గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. లంకలకోడేరు గ్రామంలో రూ.40 లక్షలతో చినపేట చర్చ్ వద్ద రాపాక ఛానల్‌పై సీసీ వాల్, పైప్ కల్వర్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, దగ్గులూరు గ్రామ పరిధిలో రూ. 7.60 లక్షలతో యర్రల కోడు మైనర్ డ్రైన్‌పై గ్రావెల్ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, బల్లిపాడు గ్రామ పరిధి గోపాల స్వామి గుడి సమీపంలో రూ.1.60 కోట్లతో రాపాక ఛానల్‌పై సీసీ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, శివదేవునిచిక్కాల గ్రామ పరిధిలో జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో రూ.49.50 లక్షలతో రాపాక ఛానల్‌పై సీసీ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.
రూ.91.80 లక్షలతో తాగునీటి పనులు, మైక్రో ఫిల్టర్ ప్రారం భోత్సవం, రూ.22.50 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవం, రూ.44.90 లక్షలతో జొన్నల గరువు బస్ స్టాండ్ సమీపంలో నెంబర్ 2 బ్రాంచ్ ఛానల్‌పై గ్రావెల్ రోడ్ నిర్మాణ పనులకు శంఖుస్థాపన, రూ.55 లక్షలతో జొన్నలగరువు వద్ద తాగునీటి పనులు ప్రారంభోత్సవం, తిళ్ళపూడి రోడ్ ఇటుకల బట్టి సమీపంలో రూ.50 లక్షలతో వంతెన, గ్రావెల్ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, తిళ్ళపూడి గ్రామ పరిధిలోని భగ్గేశ్వరం మురుగు కాలువపై రూ.43.50 లక్షలతో గ్రావెల్ రోడ్ పనులకు శంకుస్థాపనలు చేశారు. తిల్లపూడి గ్రామంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. గత వైసీపీ ఐదేళ్ల పాలనలో రైతాం గం కంట కన్నీరు రాగా..నేడు కూటమి ప్రభుత్వంలో వారి కుటుం బాల్లో ఆనందం కనిపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఏఎంసీ చైర్మన్ కోడి విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
















