అమరావతి (చైతన్యరథం): అంతర్జాతీయ వేదికపై తన మాతృమూర్తి భువనేశ్వరికి, హెరిటేజ్ ఫుడ్స్కు అరుదైన గౌరవం లభించటం పట్ల విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఇది చాలా సంతోషకర, గర్వించతగ్గ సందర్భమన్నారు. ఈ మేరకు ఎక్స్లో మంత్రి లోకేష్ పోస్ట్ పెట్టారు. అమ్మ.. మా కుటుంబానికి స్ఫూర్తినిచ్చే అదర్శమూర్తి. 2025 సంవత్సరానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) డిస్టింగ్విష్క్ ఫెలోగా ఎంపిక కావడం. నైతిక విలువలతో కూడిన నాయకత్వం గుడ్ గవర్నెన్స్, సామాజిక సేవ పట్ల మీ జీవితకాల నిబద్ధతను చాటి చెబుతోంది. కార్పొరేట్ గవర్నెన్స్లో అత్యుత్తమ ప్రతిభకు గోల్డెన్ పీకాక్ అవార్డును గెలుచుకున్నందుకు హెరిటేజ్ ఫుడ్స్కు కూడా నా సంస్థలు పోటీపడగా నిక్కచ్చి హృదయపూర్వక అభినందనలు. 410 వడపోతలో వాటిని 175కి కుదించగా, అత్యంత కఠినమైన మూడంచెల ఎంపిక ప్రక్రియ ద్వారా అగ్రస్థానంలో నిలిచి పురస్కారం అందుకోవడం ఎంతైనా ప్రశంసనీయం. రాజీలేని నిబద్ధత, కొత్త ఆలోచనలు, వాటాదారుల అచంచల విశ్వాసానికి ఈ అవార్డు నిదర్శనంగా నిలుస్తోందన్నారు.











