నారావారిపల్లె (చైతన్యరథం): తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో నిర్వహించిన దివంగత నారా రామ్మూర్తినాయుడు ప్రథమ వర్థంతి కార్యక్రమంలో కుటుంబసభ్యులతో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. నారావారిపల్లెలోని తమ నివాసంలో బాబాయి రామ్మూర్తినాయుడు ప్రథమ వర్ధంతికి సంబంధించిన క్రతువులో పాల్గొన్నారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి రామ్మూర్తినాయుడు స్మృతివనం వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్య క్రమంలో నారా, నందమూరి కుటుంబ సభ్యులతోపాటు పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నారు.