న్యూఢిల్లీ(చైతన్యరథం): రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ఢిల్లీలోని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికివెళ్లారు. రామ్మోహన్నాయుడు, శ్రావ్య దంప తులకు జన్మించిన చిన్నారిబాబుకి లోకేష్ ఆశీస్సులుఅందజేశారు. ఈ సందర్భంగా బాబును ఎత్తుకొని ముద్దాడారు. అక్కడే ఉన్న మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి సతీమణి బండారు మాధవీలతని క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు.