- సంప్రదాయం గుర్తుచేసిన లోకేష్
- సంస్కారం పాటించిన కొరియన్లు
- బూట్లు తీసి భూమి పూజలో పాల్గొనాలని కోరిన మంత్రి లోకేష్
- బూట్లు విడిచి శాస్త్రోక్తంగా భూమి పూజలో పాల్గొన్న ఎల్జీ ప్రతినిధులు
శ్రీ సిటీలో రూ.5000 కోట్లకు పైగా పెట్టుబడితో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ నెలకొల్పనున్న సంస్థకు భూమి పూజ కార్యక్రమంలో గొప్ప సంస్కారానికి శ్రీకారం చుట్టారు కొరియన్లు. భారతదేశంలో పూజ సంప్రదాయాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గుర్తుచేయగా, అత్యంత భక్తిశ్రద్ధలతో సంప్రదాయాన్ని పాటిస్తూ కొరియన్లు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐదేళ్లలో లక్షలాది ఉద్యోగాల కల్పన లక్ష్యంగా అడుగులు ముందుకేస్తున్న మంత్రి నారా లోకేష్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్‌ను శ్రీ సిటీకి తీసుకొచ్చారు. ఎల్జీ ఈ ప్లాంట్ ద్వారా 2000 ఉద్యోగాలు కల్పించనుంది. పూర్తిస్థాయిలో ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభమైతే, దేశంలో 70 శాతం ఏసీలు ఏపీ నుంచి సరఫరా కానున్నాయి.
అద్భుత ప్రయోజనాలు కలిగే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ భూమి పూజ కూడా సంస్థ ప్రతినిధుల సంస్కారానికి ప్రతీకగా నిలిచింది. ఎల్జీ ప్రతినిధులు షూలతో పూజా కార్యక్రమం వద్దకు వచ్చారు. దీంతో బూట్లు తొలగించి పూజా కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. హిందూ సంప్రదాయాన్ని గౌరవిస్తూ, ప్రతినిధులందరూ తమ బూట్లను విడిచిపెట్టి.. నేలపై కూర్చొని కొబ్బరికాయలు కొట్టి భూమి పూజను దిగ్విజయంగా, శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.