- ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం
- తటస్థ ప్రముఖులతో కొనసాగుతున్న యువనేత లోకేష్ భేటీలు
మంగళగిరి: అన్ని అవకాశాలున్నప్పటికీ కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేని మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, ఇందు కోసం అన్నివర్గాలు కలసి రావాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోరారు. మంగళగిరి పరిధిలోని తటస్థ ప్రముఖులతో యువనేత లోకేష్ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. గురువారం నాడు మంగళగిరికి చెందిన ప్రముఖులు పొట్టి గిరిజ, ప్రగడ రాజశేఖర్, తెంపల్లి రాఘవేంద్రరావుల ఇళ్లకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తొలుత మంగళ గిరి 32వ వార్డులో నివాసముంటున్న వైద్య దంపతులు డాక్టర్ పొట్టి గిరిజ, డాక్టర్ పొట్టి ఆది నారాయణ నివాసానికి వెళ్లి వారి కుటుంబసభ్యులను కలుసుకున్నా రు. ఆదినారాయణ సోదరులు కిరాణా వ్యాపారులుగా స్థిరపడ్డారు.
ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన సమస్యలను లోకేష్ వాకబు చేశారు. వైద్యులుగా నిత్యం వందలాది మందికి సేవలందిస్తున్న గిరిజ,ఆదినారాయణలను అభినందించిన యువనేత… రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో వైద్యసేవలు విస్తృ తం చేసేందుకు మీవంటి వారి సహకారం తీసుకుం టామని చెప్పారు. తర్వాత 14వవార్డుకు చెందిన ప్రగడ రాజశేఖర్‌ను వారి ఇంటివద్దకు వెళ్లి కలుసు కున్నారు. రాజశేఖర్ తాత ప్రగడ బాలనాగు సీకే ఎడ్యు కేషనల్ గ్రూప్‌ను ఏర్పాటుచేసి విద్యాదాతగా పేరొందారు. రాజశేఖర్ కుటుంబం మంగళగిరిలో అతిపెద్ద యార్న్ ఎక్స్‌పోర్టర్స్ గా చేనేత వ్యాపారరంగంలో ఉన్నారు. ఈ సందర్భంగా చేనేతలు, విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను లోకేష్ దృష్టికి రాజశేఖర్ తీసుకురాగా, తాను శాసన సభ్యుడిగా ఎన్నికయ్యాక తొలి ప్రాధాన్యత చేనేత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమేనని చెప్పారు. మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ జూనియర్ కాలేజి మేనేజ్ మెంట్స్ అసోసియేషన్ కార్యదర్శిగా రాజశేఖర్ అందిస్తున్న సేవలను కొనియాడారు. మంగళగిరి అభివృద్ధికి మీ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. చివరిగా 25వవార్డుకు చెందిన తెంపల్లి రాఘవేంద్రరావును ఆయన నివాసంలో కలుసు కున్నారు. రాఘవేంద్రరావు విజయవాడలో టివిఎల్ ఎలక్ట్రికల్ కంపెనీ అధినేతగా, దేశవ్యాప్తంగా వివిధ కంపెనీలకు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్నా రు. అన్నిరకాల వనరులు, అవకాశాలున్న మంగళ గిరిని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, ఇందు కు అన్నివర్గాలు కలిసి రావాలని లోకేష్ కోరారు.












