- అక్రమాలపై గ్రీవెన్స్‌లో బాధితుల ఫిర్యాదు
- అర్జీలు స్వీకరించిన ప్రభుత్వ విప్ అనురాధ
మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమ వారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, మాజీ మంత్రి, ఏపీ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ సుజయ్‌కృష్ణ రంగారావు అర్జీలు స్వీకరించారు. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం బుచ్చిపాపన్నపాలెం గ్రామానికి చెందిన అంజిరెడ్డి సమస్యను వివరిస్తూ తమ గ్రామంలో సర్వే నెం. 152/1 లో 0.50 సెంట్ల భూమి ఉండగా పోతురెడ్డి సుబ్బారెడ్డి సుమారు 0.20 సెంట్లను కబ్జా చేశారు. సుబ్బారెడ్డికి, తమకు ఉన్న పొలం హద్దు గట్టును ట్రాక్టరుతో పగులగొట్టి ఆక్రమంగా దున్నుకుని సాగుచేసుకుంటున్నాడు. రెండు సార్లు సర్వేయర్‌ను తీసుకు వచ్చి హద్దు రాళ్లు వేయించుకున్నా వాటిని అక్రమంగా తొలగించి తమ దుర్భషలాడి చంపుతామని బెదిరిస్తున్నాడు. దీనిపై రొంపిచర్ల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు న్యాయం జరగలేదు. అలాగే 04-10-2025న పి.వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి య.1.55 సెంట్ల పొలంలో గట్టు పగులగొట్టి భూమిని ధ్వంసం చేశాడు. దీని వెనుక మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరుల ప్రోత్సా హం ఉంది. రాజకీయ కక్షతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటు న్నాం. స్థానిక ఎస్‌ఐ కూడా న్యాయం చేయకుండా బెదిరింపులకు గురిచేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకుని భూమి సమస్యను పరి ష్కరించాలని కోరారు.
భూమి సమస్యను పరిష్కరించండి
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం అక్కపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో తనకు ప్రభుత్వం 1993లో అసైన్‌మెంట్ కింద సర్వే నం.634/2లో 4.94 సెంట్ల భూమిను మంజూరు చేసింది. తనకు ఐదుగురు అన్నదమ్ములు ఉన్నప్పటికీ వారిలో ముగ్గురికి ఇప్పటికే ప్రభుత్వం వేరువేరు సర్వే నంబర్లలో (634/1, 634/2, 634/3) భూములు మంజూరు చేసింది. అయితే తాను పొందిన భూమిని కూడా పంచాలని అన్నదమ్ములు ఒత్తిడి చేస్తూ ఇంటికి వచ్చి గొడవపడి గ్రామ సర్పంచ్ సహకారంతో అసైన్‌మెంట్ భూమిపై పంచాయతీ పత్రాలు తయారు చేసుకున్నారు. దీంతో తనకు ఉన్న 4.94 సెంట్ల భూమిలో ప్రస్తుతం 1.70 సెంట్లు మాత్రమే తన ఆధీనంలో ఉంది. మిగతా భూమిని వీఆర్వో చట్ట విరుద్ధంగా ఇతరులకు సంక్రమింపజేశారు. వారిపై చర్యలు తీసుకుని తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరాడు.
ఎంపీడీవో అక్రమాలు
గుంటూరు జిల్లా తాడికొండ మండలం గరికపాడు గ్రామానికి చెందిన బ్రహ్మేశ్వరరావు గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. గత ప్రభుత్వ హయాంలో ప్రజల కోసం పనిచేయాల్సిన ఎంపీడీవో తన పదవిని, కులాన్ని ఉపయోగించి స్వప్రయోజనార్థం అక్రమాలకు పాల్పడ్డారు. ఈ విషయంపై తాడికొండ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైనప్పటికీ మూడేళ్లు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే తన బావ పిన్నక వెంకటకృష్ణ 2004లో లాం పంచాయతీ అమరావతి మెయిన్ రోడ్ ఫేసింగ్‌తో 314 చ.గజాల స్థలం కొని అందులో 182 చదరపు గజాల స్థలం మల్లికార్జునకు విక్రయించ గా అందులో అతను షాపులు నిర్మించుకున్నాడు. మిగిలిన 132 చదరపు గజాల స్థలాన్ని ఎంపీడీవో పొన్నరుసు శ్రీనివాస పద్మాకర్ అధికార దుర్వినియోగం చేసి అక్రమంగా ఆక్రమించి విద్యుత్ కనె క్షన్, డోర్ నంబరు తీసుకున్నారు. వారిపై చర్యలు తీసుకుని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
భూమి ఆక్రమించి సాగుచేస్తున్నారు
పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్ళ గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో వారసత్వంగా ఉన్న సర్వే నెం.427లో సుమారు రెండు న్నర ఎకరాలు 1971 పాత పత్రాల ఆధారంగా తమకు హక్కులు ఉన్నప్పటికీ ఇటీవల కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి పంటలు సాగు చేస్తున్నారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులకు అనేకసార్లు వినతులు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. స్థానిక వీఆర్వో రూ.10,000 లంచం అడుగుతున్నారు. వారిపై చర్యలు తీసుకుని భూమి సమస్యను పరిష్కరించాలని కోరాడు.
భూమిని తమ పేరుతో ఆన్‌లైన్‌లో ఎక్కించాలి
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కె.గోపాలపురం గ్రామానికి చెందిన సత్యనారాయణ గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తిరుమలాయపాలెం గ్రామం సర్వే నం.427లో 0.93 సెంట్ల భూమి ఉన్నప్పటికీ ఆన్‌లైన్ రికార్డుల్లో పొరపాటున కేవలం 0.065 సెంట్లు మాత్రమే తన పేరుమీద నమోదైంది. తన వద్ద ఉన్న దస్తావేజులు, రెవెన్యూ పాస్‌బుక్ రికార్డులు, గ్రామ సర్వేయర్ ఇచ్చిన సర్వే రిపోర్టు ప్రకారం మొత్తం 0.93 సెంట్లు తన అను భవంలో ఉంది. ఆన్‌లైన్ రికార్డుల్లో ఉన్న పొరపాటును సరిదిద్ది తమ తండ్రి కర్రీ అప్పారావు పేరుతో ఉన్న భూమిని తమ పేరు మీదగా సరిగా నమోదు చేయాలని కోరాడు.
భూమిని తగ్గించి చూపారు
ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన శ్రీనివాసరావు గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో సర్వే నంబర్ 248లో 2 ఎకరాలు 5 సెంట్ల భూమి కలిగి ఉంది. కానీ రికార్డుల్లో 1 ఎకరం 96 సెంట్లు మాత్రమే నమోదు అయింది. సర్వే నంబర్ 248లో మొత్తం 34 సెంట్లు అదనంగా ఉందని అధికారులు చెబుతున్నా రు. కానీ తమకు తమ హక్కులో ఉన్న 4 సెంట్లు తగ్గించబడ్డాయి. ఆ భూమిని తిరిగి తమ పేరుపై నమోదు చేయించి న్యాయం చేయాలని కోరాడు.
భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా డబ్బు డిమాండ్
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం నూకనపెల్ల గ్రామానికి చెందిన రఫీ గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామానికి చెందిన పీరాం బీ నుంచి 2018లో అగ్రిమెంట్ ఆధా రంగా రూ. 5 లక్షలకు య.1.98 సెంట్ల భూమి కొనుగోలు చేశా ను. అయితే పీరాం బీ భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా అదనంగా మరో రూ.5 లక్షలు డిమాండ్ చేసింది. రైల్వే కోడూరు కోర్టులో కేసు వేసి ఇంజెక్షన్ ఆర్డర్ పొందాను. అయినప్పటికీ పీరాం బీ, ఆమె అనుచరులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి భూమిని బల వంతంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరాడు.
















