- ప్రశ్నిస్తే రౌడీలను పెట్టి దాడి చేయించారు
- అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
- ప్రజావినతుల్లో బాధితురాలు కె.దొడ్డమ్మ ఆవేదన
- అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్సీ నాయుడు, బంగార్రాజు
మంగళగిరి(చైతన్యరథం): ఎస్సీ మాలలమైన తమ భూములను ఆక్రమించుకుని పట్టాలు తెచ్చుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంధువులు రౌడీలతో దాడి చేయించారని అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం కె.సి.పల్లి పంచాయతీకి చెందిన కె.దొడ్డమ్మ ఫిర్యాదు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన ప్రజా వినతుల స్వీక రణ కార్యక్రమంలో నేతల ముందు తన సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చా రు. కలెక్టర్‌కు చెప్పినా తమకు న్యాయం జరగలేదని.. తమను కొట్టిన పెద్దిరెడ్డి బంధువులు ఎమ్.శ్రీనివాసులరెడ్డి, ఎం.వెంకట రమణారెడ్డి, రాజారెడ్డి, రవికుమార్‌రెడ్డి గురునాథ్‌రెడ్డిలపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఎమ్మె ల్సీ బీటీ నాయుడు, ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ బంగార్రాజు అర్జీలు స్వీకరించారు.
` తల్లిదండ్రులు లేని తనను నమ్మించి నాని అనే వ్యక్తి మోసం చేసి పెళ్లి చేసు కోవడమే కాక తన వద్ద ఉన్న బంగారం, డబ్బులు తీసుకుని తనను, తన తమ్ముడిని చంపేందుకు యత్నిస్తున్నాడని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసుస్టేషన్ పరిధికి చెందిన బాలిక ఫిర్యాదు చేసింది. పోలీసుస్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపింది. తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరింది.
` దేవాదాయ శాఖకు సంబంధం లేకపోయినా తమ భూమిని దేవాదాయ శాఖ భూమిగా ఆన్‌లైన్‌లో నమోదు చేశారని కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కుం కనూరు గ్రామానికి చెందిన వలగొండ లింగమూర్తి తెలిపారు. అధికారులు విచారించి తమకు న్యాయం చేయాలని వినతిపత్రం ఇచ్చాడు.
` జిల్లాలో నిరుపయోగంగా ఉన్న ధోబీఘాట్లకు మరమ్మతులు చేసి రజకులకు సాయం చేయాలని కడప జిల్లాకు చెందిన రజక సంఘం నాయకులు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు.
` గత ప్రభుత్వంలో వరదల్లో పంట పూర్తిగా దెబ్బతిని రూ.2 కోట్ల వరకు నష్టం వచ్చిందని, టీడీపీ కార్యకర్త కావడంతో తనకు తప్ప గ్రామంలోని వారందరికీ పంట నష్టపరిహారం ఇచ్చారని కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చాగంటి పాడు గ్రామా నికి చెందిన కళ్ళం శ్రీనివాసరెడ్డి తెలిపాడు. గత ప్రభుత్వం ఎకరా పసుపు పంటకు రూ.92 వేల పరిహారం ప్రకటించి ఇచ్చిందని.. దాని ప్రకారం తనకు 60 ఎకరాల పసుపు పంట నష్టానికి పరిహారం అందాల్సి ఉందని.. ఇప్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
` దివ్యాంగుడినైన తన ప్రమేయం లేకుండా తమ భూమి 12 ఎకరాలను తన కుటుంబసభ్యులే అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకుని తనకు బతకడానికి ఆధారం లేకుండా చేస్తున్నారని నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఇస్కపాలెం గ్రామానికి చెందిన బొల్లినేని మహేంద్రబాబు ఫిర్యాదు చేశాడు. తనకు భార్య, కుమార్తె ఉన్నా రని.. దయచేసి అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
` పూర్వం నుంచి ఉన్న దారిగుండా తమను చేలోకి వెళ్లకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటూ ఇబ్బంది పెడుతున్నారని ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నాయు డుపల్లె గ్రామానికి చెందిన హనుమమ్మ ఫిర్యాదు చేసింది. అధికారులు తమ చేనుకు దారి సమస్యను పరిష్కంరిచాలని వేడుకుంది.
` గత ప్రభుత్వం రీ సర్వే చేయక ముందు వరకు తమ భూమి ఆన్‌లైన్‌లో సక్రమంగా ఉందని.. రీ సర్వే పేరుతో తమ భూమిని తగ్గించి చూపుతున్నారని ఏలూరు జిల్లా నూజివీడు మండలం రామన్నగూడెంకు చెందిన పసుపులేటి సాంబ య్య ఫిర్యాదు చేశాడు. తమ భూమి రెండు ఎకరాలను ఆన్‌లైన్‌లో ఉండేలా చూడాల ని విజ్ఞప్తి చేశాడు.