- యాపిల్ కు ఇక్కడ నుంచే అల్యూమినియం
- హిందాల్కో పరిశ్రమ ఏర్పాటుతో ఉద్యోగాలు
- సీఎం చంద్రబాబు, లోకేష్ కు కృతజ్ఞతలు
ప్రభుత్వ చీఫ్ విఫ్, ఎమ్మెల్సీ పంచుమర్తి అమరాధ
మంగళగిరి(చైతన్యరథం): జగన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ప్రభుత్వ చీఫ్ విఫ్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. రూ.11 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని నాశనం చేశాడు. రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసి రాష్ట్రాన్ని నకిలీ మద్యం, అక్రమ మైనింగ్, కిడ్నాప్లు, అత్యాచా రాలు, ఫేక్ పోస్టులు, గంజాయి వ్యాపారంతో రాష్ట్రాన్ని గందర గోళంలోకి నెట్టారన్నారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఆ సం కల్పంలో భాగంగానే 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రినారా లోకేష్ గత 16 నెలల నుంచి దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియా, లండన్తో పాటు పలు దేశాలు తిరిగి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొచ్చారని అన్నారు. ఇప్పటివరకు రూ.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి రప్పించారని చెప్పారు. ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. అమె రికా దిగ్గజం యాపిల్ కోసం ఐఫోన్ చాసిస్ కు అవసరమైన హై-గ్రేడ్ అల్యూమినియం ఇక నుంచి కుప్పం నుంచే సరఫరా అవు తుందని తెలిపారు.
హిందాల్కో రూ.586 కోట్ల పెట్టుబడితో కుప్పంలో పరిశ్రమ ఏర్పాటు చేస్తోందని దీని ద్వారా 613 ప్రత్యక్ష ఉద్యోగాలతోపాటు లాజిస్టిక్స్, సేవలు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో వేలాది అనుబంధ ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను యాపిల్ గ్లోబల్ సప్లై చైన్లోకి లాగే గేట్వేగా కుప్పం మారిందని అన్నారు. చంద్రబాబు, లోకేష్ కష్టపడి పరిశ్రమలు తీసుకొస్తుంటే సిగ్గులేకుండా జగన్రెడ్డి దొంగ మెయిల్స్ పంపి అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు. జగన్కు తన సొంత పరిశ్రమలైనా నకిలీ మద్యం పరిశ్రమ, అక్రమ మైనింగ్ దందా, గంజాయి వ్యాపారం, మహిళలను కిడ్నాప్ చేసి వ్యాపాయం చేసే పరిశ్రమలు మూతపడతాయని జగన్ భయంతో ఉన్నారు. జగన్ పీపీఏలు రద్దు చేయడంతో ప్రజల సొమ్ము రూ.10 వేల కోట్లు ఫైన్ కట్టాల్సిన దుస్థితి వచ్చిందని మండిప డ్డారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా వారి శ్రమ వృథా. ఈ రాష్ట్రాన్ని కాపాడేది చంద్రబాబు ఒక్కడే. జగన్ కుట్రలకు పుల్స్టాప్ పెట్టేది చంద్రబాబే అని గుర్తుపెట్టు కోవాలి. కుప్పం నియోజకవర్గానికి హిందాల్కో పరిశ్రమ తీసుకొచ్చిన లోకేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.















