- సీమలో కియా ఫ్యాక్టరీ నా గుర్తు… పారిపోయిన జాకీ జగన్ గుర్తు
- నేను తొమ్మిది డీఎస్సీలిచ్చా.. జగన్ ఒక్కటీ ఇవ్వలేదు
- మద్యం, ఇసుక డబ్బుతో జగన్ ప్యాలెస్ నుంచి కంటెయినర్లు
- నా వయసు గురించి మాట్లాడే జగన్ చల్లటిపూటే సభలు పెడుతున్నాడు
- కర్నూలు రాజధానిగా మారిందా?.. జగన్ అబద్ధాల పుట్ట
- సంపద సృష్టించి ఆదాయం పెంచుతా.. పేదలకు పంచుతా
- మార్పుకోసం యువత పోరాడాలి.. ఉద్యోగాలిచ్చే బాధ్యత నాది
- ఎన్డీఏలో రెండుసార్లు ఉన్నాం.. మైనారిటీలకు ఎటువంటి హానీ జరగలేదు
- బనగానపల్లి ప్రజాగళం సభలో చంద్రబాబు ఉద్ఘాటన
బనగానపల్లె (చైతన్యరథం): ఇరిగేషన్ ప్రాజెక్టున్నీ పూర్తిచేసి రాయలసీమను కోనసీమలా సస్యశ్యామలం చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్ఘాటించారు. పిల్లకాకి జగన్ అడుగుతున్నాడు రాష్ట్రానికి నేను ఏం చేశానని..ఎక్కడ చూసినా నా ముద్ర కనిపిస్తుంది.. కరువు సీమలో కార్ల పంట పండిరచిన కియా కంపెనీ నా గుర్తయితే, కమీషన్ల కోసం వైసీపీ నేతల బెదిరింపు లతో పారిపోయిన జాకీ కంపెనీ జగన్ గుర్తని చంద్ర బాబు అన్నారు. నావయసు గురించి జగన్ మాట్లాడు తున్నాడు. నాలాగ మధ్యాహ్నం ఎండలో రెండు సభలు పెడితే అతడి సత్తా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ గత ఎన్నికల్లో రాయలసీమలో జనం అత్యధిక స్థానాలు కట్టబెడితే ఇక్కడి ప్రజలకు జగన్ తీరని ద్రోహం చేశా రని ధ్వజమెత్తారు. ప్రజాగళం పేరుతో వచ్చా. సింహ గర్జన, శంఖారావం చేయడానికి వచ్చా. అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకువచ్చి వైసీపీని చిత్తుచిత్తుగా ఓడిరచడా నికి వచ్చా.మీరు సిద్ధమా?సాగునీటి ప్రాజెక్టులను పడు కోబెట్టి ఇక్కడి రైతుల గొంతు కోశారన్నారు. అధికారం లోకి రాగానే సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి రాయల సీమకు సాగు, తాగునీటి కష్టాలు తీరుస్తానని చంద్ర బాబు భరోసా ఇచ్చారు.
పవిత్రమైన రోజు
కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశంపార్టీ జెండా ను 42ఏళ్లుగా మోస్తూనే ఉన్నారు. మీ ఉత్సాహం చూస్తుంటే మళ్లీ ఘనంగా గెలిపిస్తారనే నమ్మకం వచ్చిం ది. నా తమ్ముళ్లు అనుకంటే తెలుగుదేశం విజయం సునాయాసం. ఈ సభకు జనసైనికులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. నిరంతరం విజయం కోసం శ్రమిస్తు న్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే ఎన్డీఏతో జట్టుకట్టాం. సామాజిక న్యాయం కోసం పోరాడే ఎమ్మా ర్పీఎస్ కూడా మనతో కలిసింది. అందరం కలిసిన తర్వాత గెలుపు సునాయాసం.అందులో ఎలాంటి అను మానం లేదు. ఇప్పటినుంచి అన్‌స్టాపబుల్. టీడీపీ ఆవి ర్భవించి 42ఏళ్లు. ఒక మహనీయుడు శుభమూహూ ర్తాన పెట్టిన పార్టీ తెలుగుదేశం. తెలుగుజాతి ఆత్మగౌర వం చాటిచెప్పిన రోజు ఇది. తెలుగుజాతికి గుర్తింపు వచ్చిన రోజు ఇది. బడుగు,బలహీనవర్గాలకు రాజకీయ ప్రాధాన్యత లభించిన రోజు ఇది. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన పరిచయం చేసిన రోజు ఇది. సంపద సృష్టించడం, వచ్చిన సంపద పేదవారికి పం చాలనే ఆలోచనతో ముందుకు వెళ్లాం. పేదవారికి అండగా ఉంటాం. భవిష్యత్‌లో మీకోసమే పనిచేస్తా. పేదరికం లేని రాష్ట్రంగా చేసే వరకు మీకు అండగా టీడీపీ ఉంటుందని 42వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా చెబుతున్నా. తెలుగువారు ప్రపంచంలోనే గుర్తింపు పొందాలనేది మా ఆశయం. ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ భావాలతో ముందుకు వెళ్లాం. దేశం లోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాం. జాతీయస్థాయిలో ఏ పార్టీకి దక్కని గౌరవం టీడీపీకి దక్కింది. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటుచేశాం. ఎన్డీఏలో భాగస్వాములు అయ్యాం.క్రీస్తుశకం ఏవిధంగా ఉందో, తెలుగుజాతికి తెలుగుదేశం శకం కూడాఅంతే. తెలుగు దేశం పూర్వం, తెలుగుదేశం తర్వాత అని తెలుగుజాతి గుర్తుకుపెట్టుకునే రోజు. అలాంటి పవిత్రమైన రోజు బనగానపల్లి రావడం తన అదృష్టమని చంద్రబాబు అన్నారు.
పేదలకు పెన్షన్ ప్రారంభించిందే టీడీపీ
పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వాలని ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేశారు. కేజీ రూ.2కే బియ్యం ఇచ్చిన ఘనత టీడీపీది. రైతులకు సాగునీటి కోసం అనేక సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించారు. రాయలసీమకు కృష్ణాజలాలు తీసుకురావాలని ఆలోచన చేసిన మహాను భావుడు ఎన్టీఆర్. అన్నివర్గాలకు సంక్షేమం అందించా రు. పేదవారికి, వృద్ధులకు రూ.30తో పెన్షన్ ప్రారం భించిన పార్టీ తెలుగుదేశం. టీడీపీ పాలనలో వెనుక బడిన వర్గాలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికం గా ముందుకు తీసుకెళ్లాం. సంపద సృష్టించి పేదవారికి పంచాలనేది మన ఆశయం. పేదరికం నిర్మూలించడా నికి టీడీపీ పనిచేస్తోంది.జాతీయ రహదారులతో పాటు రోడ్లన్నీ బాగయ్యాయంటే టీడీపీదే ప్రధానపాత్ర. నేడు జనం సెల్ ఫోన్లు వాడుతున్నారంటే టీడీపీ చూపించిన చొరవే కారణం. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసు కువచ్చిన పార్టీ తెలుగుదేశం.అవుకులో కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారంటే, ఓర్వకల్లులో కూడా వెయ్యి మెగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టు వచ్చిందంటే టీడీపీ దూరదృష్టే కారణం. 2020 విజన్‌తో హైదరాబాద్‌ను ప్రపంచం లోనే నెం.1 నిలబెట్టిన ఘనత టీడీపీదేనని చంద్రబాబు అన్నారు.
రాజధాని లేకుండా చేశారు
రాష్ట్రవిభజన తర్వాత అనేక సమస్యలు వచ్చాయి. సమస్యల నుంచి పరిష్కారం చూపించే బాధ్యత టీడీపీ తీసుకుంది. నదుల అనుసంధానం కోసం పెద్దఎత్తున కార్యక్రమాలు చేశాం. పోలవరం పనులు 72శాతం పూర్తిచేశాం. గోదావరి నీటిని రాయలసీమకు తీసుకు రావాలనేది మా సంకల్పం. పెట్టుబడులు పెద్దఎత్తున తీసుకువచ్చాం. కియా పరిశ్రమను పేద జిల్లా అనంత పురానికి తీసుకువచ్చిన ఘనత టీడీపీది. అమరావతిపై కూడా సైకో మాట్లాడుతున్నాడు. మూడు రాజధానులు ఏర్పాటు చేశానని చెబుతున్నాడు. ఒక రాజధానిగా చెప్పిన కర్నూలు అభివృద్ధి అయిందా? రాష్ట్రానికి రాజ ధాని లేకుండా చేశారు. మూడు ముక్కలాటతో మనకు చిరునామా లేకుండా చేసిన వ్యక్తి జగన్‌రెడ్డి అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఇచ్చేది పది, దోచేది వంద
జగన్‌రెడ్డి పాలనలో అందరూ నష్టపోయారు. రైతులు బాగుపడలేదు, సబ్సిడీలు రావడం లేదు. గిట్టుబాటు ధరలేదు, పొలాలకు నీరు లేదు, మహిళ లకు రక్షణ లేదు, నిత్యావసర ధరలు పెరిగాయి. ఇచ్చేది పది, దోచేది వంద. పెట్టుబడులు రాలేదు, యువతకు ఉద్యోగాలు రాలేదు. కూలీలకు ఉపాధి లేదు, భవన నిర్మాణ కార్మికులకు పనిలేదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు కార్పొరేషన్ రుణాలు ఇవ్వలేదు, రూపాయి సబ్సిడీ ఇవ్వలేదు. ఏ ఒక్కరికీి సాయం చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా అందడం లేదు. పీఎఫ్ డబ్బులు కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఫ్యాన్‌ను చిత్తుచిత్తు చేసేందుకు యువత ఉత్సాహం చూపిస్తోంది. మీ భవిష్యత్, మీ పిల్లల భవిష్యత్ మేం చూసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
తాగునీరు కూడా లేదు
తాగునీరు, సాగునీరు ఇవ్వలేని జగన్ ఎన్నికలకు వస్తున్నాడు. వారోనికోసారి స్నానం చేసే పరిస్థితి. ఈ రోజు నువ్వు కడుక్కోవడానికి కూడా రాయలసీమలో నీరు లేదని జగన్ రెడ్డిని అడుగుతున్నా. మొన్నటివరకు పరదాలు కట్టుకుని తిరిగారు. చెట్లన్నీ కొట్టేశారు. పాఠశాలలు మూయించి కూలీ మనుషులను తీసుకెళ్లారు. ఇప్పుడు జరుగుతున్న జగన్ సభలకు కూడా కిరాయి జనాన్ని తీసుకెళుతున్నా ఉండటం లేదు. మధ్యలోనే వెళ్లిపోతున్నారు. జగన్ సాయంత్రం మీటింగ్ లు పెట్టుకుంటున్నా వెలవెలబుతున్నాయి. బస్సు యాత్ర తుస్సయ్యింది. మిట్టమధ్యాహ్నం పెడుతున్నా మా సభలకు జనం భారీగా తరలివచ్చి విజయవంతం చేస్తున్నారు. మిమ్మల్ని ఓడిరచడానికి ప్రజలు సిద్ధమై మా సభలకు వస్తున్నారని చంద్రబాబు ఉద్ఘాటించారు.
చరిత్రహీనుడు జగన్‌రెడ్డి
ప్రతి ఇంటిని, ప్రతి ఊరిని నాశనం చేసిన చరిత్రహీనుడు జగన్ రెడ్డి. రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, దాడులు, కేసులు తప్ప జగన్ రెడ్డికి ఏమీ తెలియదు. బుగ్గలు నిమిరి, ముద్దులు పెట్టి ఒక్క ఛాన్స్ అన్నావు, తండ్రి లేని బడ్డన్నావు, చిన్నాన్నను చంపేశావు. చెల్లెల్ని జైలుకు పంపాలని చూస్తున్నావు. చిన్నాన్నను చంపిన దోషులను పక్కనపెట్టుకుని తిరుగుతున్నారు. వారికే సీటు ఇచ్చి చిన్నాన్న ఆత్మను క్షోభపెట్టడం న్యాయమా? ఉమ్మడి కర్నూలుకు జగన్ చేసిందేమీ లేదు. గత ఎన్నికల ముందు బాబాయి గొడ్డలిపోటు, కోడికత్తి డ్రామా ఆడారు. ఇప్పుడు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కంటెయినర్‌ల్లో అవినీతి డబ్బులు తరలిస్తున్నారు. పైకి మాత్రం వంటసామాగ్రి కోసం, ఫర్నిచర్ కోసం ఆ కంటెయినర్లంటూ వైసీపీ నేతలు బొంకుతున్నారు. మద్యంలో దొంగిలించిన, ఇసుకలో బొక్కిన డబ్బులు, అడ్డంగా సంపాదించిన డబ్బులను పోలీసుల సహకారంతో కంటెయినర్లలో తరలించి ఓట్లు కొనాలని చూస్తున్నారు. ఫుల్‌గా తాగించి మభ్యపెట్టాలని చూస్తున్నారు. నంద్యాలలో మీటింగ్ పెట్టి రూ. 10 కోట్లు ఒక్క బస్సులకే ఖర్చుపెట్టారు. వచ్చిన డ్వాక్రా సంఘాల మహిళలు ఒక్కరు కూడా బస్సులు దిగలేదు. పోలీసులు బతిమిలాడినా, కాళ్లు పట్టుకున్నా మేం వెళ్లిపోతామని మహిళలు వెనుతిరిగారు. మనం 7 మీటింగ్ లు పెట్టాం. ఎప్పుడు పెట్టినా యుద్ధానికి సిద్ధమని ప్రజలు చెబుతున్నారని చంద్రబాబు అన్నారు.
మనది విజన్, జగన్ ది పాయిజన్
ఈ జిల్లాలో నేను అభివృద్ధికి నాంది పలికాను. రూ. 365 కోట్లతో సాగునీటి ప్రాజెక్టును తీసుకువస్తే దానిని ఆపేశారు. నందికొట్కూరులో మెగా సీడ్ ఫ్యాకర్టీని తీసుకువస్తే అదీ పోయింది. ఎమ్మిగనూరులో టెక్స్ టైల్ పార్క్ పెడితే రద్దు చేశారు. ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ టౌన్ షిప్ ఏర్పాటు చేద్దామనుకున్నాం. 6 వేల కోట్లతో సోలార్ పార్క్ లు ఏర్పాటుచేసి 5వేల మందికి ఉద్యోగాలు కల్పించాం. మనది విజన్, జగన్ ది పాయిజన్. నాశనం చేయడంలో దిట్ట. కర్నూలు, ఓర్వకల్లులో 90 కోట్లతో విమానాశ్రయం కడితే జగన్ రెడ్డి వచ్చి రిబ్బన్ కట్ చేశాడు. నువ్వు కట్టలేవు, ఎవరో కట్టినదానికి రిబ్బన్ కట్ చేస్తావు, నీ రంగేసుకుంటావు. దానికి కాదు మీ ముఖానికి వేసుకోవాలి రంగు అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
నేనూ రాయలసీమ బిడ్డనే
1,800 కోట్లతో బనగానపల్లిలో అభివృద్ధి పరిగెత్తించిన నేత జనార్థన్ రెడ్డి. గతంలో అలాంటి వ్యక్తికి ఓటేయకుండా దొంగకు ఓటేశారు. నీరు, విద్య, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల ద్వారా రాయలసీమ దశ, దిశ మారుతుందని నేను సంకల్పించాం. నేనూ రాయలసీమ బిడ్డనే. పిల్లకాకి అడుగుతున్నాడు నేను ఏం చేశానని. నా వయసు గురించి మాట్లాడుతున్నాడు. నాలాగ మధ్యాహ్నం రెండు మీటింగ్ లు పెడితే తెలుస్తుంది? ఏం చేశావని నన్ను అడిగే అర్హత జగన్‌కు లేదు. ఎక్కడ చూసినా నా ముద్ర కనిపిస్తుంది. హైదరాబాద్ ఎవరు కట్టారంటే, అవుటర్ రింగ్ రోడ్డు, విమానాశ్రయం, ఐటీ ఉద్యోగాలు అంటే ఎవరి పేరు చెబుతారు? కియా మోటార్ వచ్చిందంటే ఎవరి పేరు చెబుతారు? నీ పేరు చెబితే ఏం గుర్తుకు వస్తాయో చెప్పాలి. రాయలసీమలో 52 సీట్లు ఉన్నాయి. 49సీట్లు జగన్‌కు కట్టబెట్టి టీడీపీ తరఫున నన్ను, బాలకృష్ణ, కేశవ్‌నే గెలిపించారు . ఇంత ఘనంగా గెలిపిస్తే ఈ ప్రాంతానికి జగన్ చేసిందేమిటి? రాయలసీమలో 102 సాగునీటి ప్రాజెక్టులు రద్దు చేశాడు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల కోసం నేను రూ. 12వేల కోట్లు ఖర్చుపెట్టాను. ప్రాజెక్టులు పరుగులు పెట్టించాను. జగన్ రెడ్డి ముష్టి 2వేల కోట్ల ఖర్చుపెట్టాడు. సాక్షిలో ప్రకటనల కోసం చేసిన ఖర్చు అంతకన్నా ఎక్కువే. ఒక్క ఇండస్ట్రీ తీసుకురాలేదు, ఉద్యోగం ఇవ్వలేదు. మీకు కులం, మతం కావాలా, మీ భవిష్యత్ అవసరం లేదా అని చంద్రబాబు అడిగారు.
జగన్‌రెడ్డి రాయలసీమ ద్రోహి
కియా మన బ్రాండ్, జాకీ పరిశ్రమ పారిపోవడం జగన్ బ్రాండ్. మీ భవిష్యత్ నాది. రాయలసీమను హార్టికల్చర్ హబ్ చేయాలని 90శాతం సబ్సీడీతో డ్రిప్ ఇస్తే జగన్ రద్దు చేశాడు. పది లక్షల ఎకరాలకు డ్రిప్ ఇస్తే రాయలసీమలో రైతులకు మేలు జరుగుతుంది. కోనసీమ కంటే మిన్నగా రాయలసీమను తయారు చేస్తాం. రాయలసీమలో ముచ్చుమర్రి పూర్తిచేశాం. సిద్ధాపురం, పులకుర్తి, గోర్వకల్లు రిజర్వాయర్, పులికనుమ, అవుకు టన్నెల్ పూర్తిచేశాం. రాయలసీమ ఆప్తులు ఎవరు, ద్రోహులు ఎవరు. జగన్‌రెడ్డి రాయలసీమ ద్రోహి.
అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది
మాదిగలకు ఏబీసీడీ కేటగిరీ గతంలో నేనే పెట్టా. ఎన్డీఏ కూడా ఒప్పుకుంది. మళ్లీ మాదిగలకు, అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది. జగన్ రెడ్డి అప్పులతో రాష్ట్రం అధోగతిపాలైంది. గతంలో నేను 9 డీఎస్సీలు ఇచ్చాను. ఎన్టీఆర్ 3 ఇచ్చారు. మొత్తం 12 డీఎస్సీలు నిర్వహించాం. జగన్ ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు. ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. జాబు రావాలంటే బాబు రావాలని చంద్రబాబు అన్నారు.
టీడీపీతోనే మహిళలకు న్యాయం
మహిళలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం. డ్వాక్రా సంఘాలు, ఆస్తిలో సమానహక్కు, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్లు పెట్టాం. మహిళలను శక్తిమంతం చేస్తాం. అధికారంలోకి వచ్చిన తరువాత ఆడబిడ్డ సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాం. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తాం. ముగ్గురుంటే రూ. 4500 వస్తాయి. తల్లికి వందనం పేరుతో స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇస్తాం. ముగ్గురుంటే 45వేలు వస్తాయి. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. యువతకు నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తాం. మెగా డీఎస్సీ నిర్వహిస్తాం. వర్క్ ఫమ్ హోం తీసుకువస్తాం. మండల కేంద్రంలో వర్క్ స్టేషన్లు కడతాం. అన్నదాతలకు ఏడాదికి రూ.20వేల సాయం చేస్తాం. డ్రిప్ పరికరాలు ఇస్తాం. బీసీలకు రక్షణ చట్టం తీసుకువస్తాం. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాం. పెన్షన్ ను రూ.200 నుంచి 2వేలు చేసింది నేను. దీనిపైనా జగన్ అబద్ధాలే చెబుతున్నాడు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతినెలా ఒకటో తేదీన మీ ఇంటికే రూ.4వేలు పెన్షన్ పంపిస్తాం. ఒక నెల తీసుకోకపోతే రెండో నెల ఇస్తాం, రెండో నెల తీసుకోకపోతే 3నెలలు ఒకేసారి ఇస్తాం. సంపద సృష్టిస్తాం…ఆదాయం పెంచుతాం. సూపర్-6 పథకాలు జగన్ అసాధ్యం అంటున్నాడు…అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం టీడీపీ, ఎన్డీఏకే సాధ్యం. నీ లాగా దోచుకుంటే అసాధ్యం అవుతుంది…కష్టపడితే ఏదైనా సాధ్యం అవుతుంది. వాలంటీర్ల వ్యవస్థను తీసేయను. ద్రోహుల కోసం పనిచేయవద్దని చెబుతున్నా. ప్రజాస్వామ్యంగా ఉంటే మీ ఉద్యోగాలు గ్యారంటీ. వాలంటీర్లు చదువుకుని ఉంటే 5వేలు కాదు.. జీతాలు పెంచే విధంగా చేస్తాం. చదువుకున్న వ్యక్తులకు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇప్పించి రూ.50వేలు సంపాదించేలా చేస్తానని చంద్రబాబు చెప్పారు.
సైకో పోవాలి- రాష్ట్రం నిలబడాలి
రాష్ట్రంపై 12 లక్షల కోట్ల అప్పు ఉంది. వ్యవస్థలు ఛిన్నాభిన్నం చేశారు. జనార్థన్ రెడ్డి లాంటి సౌమ్యుడిపై అక్రమ కేసులు పెట్టారు. అనేక మందిని జైలుకు పంపారు. నాకు కూడా అక్రమ కేసులు తప్పలేదు. తప్పుడు కేసులు పెట్టిన వారికి చక్రవడ్డీతో సహా తీరుస్తాం. సైకో పోవాలి- రాష్ట్రం నిలబడాలి. అందుకే కలిసొచ్చే పవన్ తో పొత్తు పెట్టుకున్నాం. వ్యతిరేక ఓటు చీలకూడదు. బీజేపీతో కూడా కలిసి కలయిక ఏర్పాటుచేశాం. ఈ పొత్తు మాకోసం కాదు.. భావితరాల భవిష్యత్ కోసం. కేంద్రంలో ఎన్డీఏ వస్తుంది. మొదటి ఎన్డీఏ ప్రభుత్వంలలో నేను ఉన్నా. 2014-19 మధ్య ఎన్డీఏలో ఉన్నా. అప్పుడు ఏ ఒక్క మైనార్టీకైనా అన్యాయం జరిగిందా అని నేను అడుగుతున్నా. అభివృద్ధి, సంక్షేమం చేశాం. ఉర్దూ రెండో అధికార భాషగా చేశా. హజ్ హౌస్ కట్టా. ఫైనాన్స్ కార్పోరేషన్ పెట్టా. రంజాన్ తోఫా, షాదీ ఖానాలు, మసీదులకు నిధులు, మౌజన్, ఇమామ్ లకు గౌరవ వేతనం ఇచ్చాం. ఆడబిడ్డల పెళ్లిళ్లకు నిధులు ఇచ్చాం. విదేశీ విద్య కోసం 15 లక్షల ఆర్థికసాయం చేశాం. మతసామరస్యం కాపాడిన పార్టీ తెలుగుదేశం. ఏ మైనార్టీకి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాది, మాది. ఏ మతానికి, కులానికి అన్యాయం జరగదు. తెలుగుడ్డపై పుట్టినవారందరూ తెలుగువారే. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా సైకోను ఇంటికి పంపించాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
బనగానపల్లెకు పట్టిన శని కాటసాని రామిరెడ్డి
కాటసాని రామిరెడ్డి బనగానపల్లెకు పట్టిన శని. మైనింగ్ యజమానులను రాయల్టీ విషయంలో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎస్సీలను బినామీలుగా పెట్టుకుని ప్రైవేటు స్థలాలను కబ్జా చేశారు. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన రవ్వలకొండను మింగేసిన అనకొండ కాటసాని. సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి కమీషన్లు, నాటుసారా వ్యాపారంలో దిట్ట. బనగానపల్లెలో బొలేరా బ్యాచ్, రౌడీ బ్యాచ్ సెటిల్ మెంట్లు, ఆగడాలు మితిమీరాయి. అజాత శత్రువు బీసీ జనార్థన్ రెడ్డికే కోపం వస్తే విపత్తు జరగబోతోంది. ఈ విపత్తులో వైసీపీ భస్మం అవుతుంది. ఎన్ని సమస్యలు ఉన్నా జనార్థన్ రెడ్డి ప్రజల కోసం పోరాడుతున్నారు. బనగానపల్లె పట్టణంలో పేదలకు ఇంటి స్థలాల కింద 2 సెంట్లు ఇస్తాం, నాపరాయి పరిశ్రమకు గత టీడీపీ ప్రభుత్వంలో అమలుచేసిన విధానాలు అమలుచేస్తాం. రింగ్ రోడ్డును రివర్స్‌లో పెట్టారు.
టీడీపీ ప్రభుత్వం వచ్చాక రింగ్ రోడ్డు పనులు పూర్తిచేస్తాం, కోయలకుంట్లలో బైపాస్ రోడ్డు మంజూరుచేస్తాం, బనగానపల్లెలో ఇంజనీరింగ్ కాలేజీ, స్కిల్ డెవలప్ సెంటర్, మైనార్టీ మహిళలకు ఆర్థిక చేయూత కార్యక్రమాలు, ఆటో నగర్ ఏర్పాటుచేస్తాం. బనగానపల్లె, కోయలకుంట్లలో పెండిరగ్‌లో ఉన్న షాదీఖానాలు పూర్తిచేస్తాం. లైమ్ స్టోన్ ఇష్టారాజ్యంగా తవ్వకుండా చూస్తాం. పరిశ్రమలు ఇక్కడ పెట్టేవారికే గనులు లీజుకు ఇస్తాం, యవతకు ఉద్యోగాలు ఇస్తాం. ఎండలో కూడా ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. దీనిని మర్చిపోలేను. ప్రజల జీవితాలను నాశనం చేసిన వ్యక్తికి తగిన గుణపాఠం చెప్పాలి. సైకో పోవాలి, సైకిల్ రావాలి. టీడీపీ బలపర్చిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి. వైసీపీని చిత్తుచిత్తుగా ఓడిరచాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవడమే మన ధ్యేయం కావాలని చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు.