- నకిలీ పత్రాలతో ఆక్రమించి దౌర్జన్యం చేశారు
- పినిపే క్లాస్‌మేట్‌నంటూ విద్యాశాఖాధికారి దందా
- టీడీపీ కార్యకర్తలమని నేతన్ననేస్తం, పింఛన్ ఆపారు
- ఇంటిని ఆక్రమించుకున్నారని బాధితురాలి ఫిర్యాదు
- సమస్యలపై ప్రజావినతులకు పోటెత్తిన అర్జీదారులు
మంగళగిరి(చైతన్యరథం): మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ అనంత బాబు అండదండలతో పలువురు గిరిజనేతరులు.. గిరిజనుల భూములకు నకిలీ పత్రాలు సృష్టించి తమ భూములు ఆక్రమించారని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం మద్దులూరుకు చెందిన పలువురు గిరిజనులు టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. భూములు ఆక్రమించిన అక్కిస బాలకృ ష్ణ, కంగల వెంకటేశ్వరరావు, కత్తుల సోమిరెడ్డి, చెదల అబ్బాయిరెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్, లిడ్‌క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావులు అర్జీలు స్వీకరించి విచారించి చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించారు.
` ముమ్మిడివరం మండల విద్యాశాఖాధికారి రమణశ్రీ నాటి వైసీపీ మంత్రి పినిపే విశ్వరూప్ తన క్లాస్‌మేట్ అని చెప్పుకుని జిల్లా విద్యా వ్యవస్థలో అధిపత్యం చెలాయిస్తూ అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డాడని.. అతని అవినీతిపై విచారణ చేపట్టి అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేయాలని రిటైర్డ్ ఎంఈవో సత్యప్రసాద్ ఫిర్యాదు చేశారు.
` పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చీమలమర్రికి చెందిన యర్రంనేని నందియ్య తన సమస్యను వివరిస్తూ పెమ్మ నరేష్ అనే వ్యక్తి మహా సిమెంట్ ఫ్యాక్టరీలో క్యాంటీన్, అక్కడ పనిచేసే వర్కర్స్‌కు బియ్యం సరఫరా కాంట్రాక్టు ఇప్పిస్తానని చెప్పి రూ.1.20 కోట్లు తీసుకుని మోసం చేశాడు..డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే తమను చంపేస్తా మని బెదిరిస్తున్నాడు.. ఆయనపై చర్యలు తీసుకుని డబ్బులు తిరిగి వచ్చేలా చూడాలని వాపోయారు.
` తాను టీడీపీ అని చెప్పి గత ప్రభుత్వంలో నేతన్న నేస్తం రాకుండా చేశారు..93 ఏళ్ల తన అత్త పింఛన్‌ను తొలగించారు..నేతన్న నేస్తం, పింఛన్‌ను పునరుద్ధరించి తమకు సాయం చేయాలని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెంకు చెందిన కత్రపు రాధాకృష్ణమూర్తి వినతిపత్రం అందజేశాడు.
` కొవ్వూరు సబ్ రిజిస్ట్రార్ వద్ద దస్తావేజు లేఖరిగా పనిచేసే దాసరి స్టాలిన్..తన తల్లి ఆస్తిని తన కుమార్తెల పేర్లపై రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ చేయిస్తానని చెప్పి తమ వద్ద రూ. 10 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఏలూరుకు చెందిన బలే నరసరాజు ఫిర్యాదు చేశాడు. అతనిపై చర్యలు తీసుకోని న్యాయం చేయాలని వేడుకున్నాడు.
` నెలలో తిరిగి ఇస్తానని తమ వద్ద షేక్ సాయి అనే వ్యక్తి రూ.10 లక్షలు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తున్నాడని సత్యసాయి జిల్లా గార్లపెంట మండలానికి చెందిన చిలకల అమ్మాజీ ఫిర్యాదు చేశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని.. దయచేసి ఆయనపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
` తన భర్త చనిపోవడంతో తన కుమార్తె వద్దకు వెళ్లగా తన ఇంటిని యనపడ్డ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి అక్రమంగా ఆయన తల్లి పేరుపైకి ఎక్కించుకున్నాడని అన్నమ య్య జిల్లా పుల్లంపేట మండలం తిరుమలయ్యగారిపల్లెకు చెందిన చేని లక్షమ్మ ఫిర్యాదు చేసింది. దానిని రద్దు చేసి తన ఇంటిని తనకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.
` బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం అడవులదీవి రెవెన్యూ పరిధిలో ఉన్న భూములను వాన్‌పిక్ సంస్థ తీసుకోకపోయినా అవి నిషేధిత భూముల జాబితాలో చేర్చా రు. దీంతో భూ హక్కుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ భూములను నిషే ధిత భూముల నుంచి తొలగించాలని గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు.