ప్రజలు సుఖసంతోషాలతో ఉంటే నీచులకు నచ్చదు. జగన్‌రెడ్డిలాంటి పెత్తందారులకు అస్సలు నచ్చదు. ప్రజలను ఆకలితో అలమటించేలా చేసి, వారి దుస్థితిపై చలిమంట కాచుకోవడం జగన్‌రెడ్డికి ఇష్టం. ప్రజాధనాన్ని దోచుకుని.. తాడేపల్లి ప్యాలస్‌లో దాచుకున్న జగనాసురుడు.. నేడు కూటమి ప్రభుత్వం ప్రజలకు కడుపునిండా అన్నం పెడుతుంటే జీర్ణించుకోలేక `సర్కారుపై విషంగక్కుతున్నది అందుకే.
పేదల కడుపునింపిన ‘అన్న క్యాంటీన్’లను మూయించిన నీచచరిత్ర జగన్‌రెడ్డిది. పేదల ఉన్నతికి లబ్దిచేకూర్చే పథకాలను నిర్వీర్యం చేసిందే కాకుండా, విష పత్రికలో అబద్ధాలు ప్రచారం చేస్తూ వచ్చాడు. వేల కోట్ల ప్రజాధనాన్ని బినామీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన జగన్‌రెడ్డి.. విద్యార్థుల ఆకలి తీర్చే మధ్యాహ్న భోజన పథకానికి రూపాయి కేటాయించలేకపోవడం `జగన్ నైజానికి నిలువుటద్దం. విద్యార్థులతో మామ అని బలవంతంగా పిలిపించుకుని బిల్డప్ ఇవ్వడమే తప్ప.. నిజమైన మేనమామగా ఆకలి కేకలు పట్టించుకున్న దృశ్యం ఐదేళ్ల కాలంలో ఒక్కటీ కనిపించలేదు. పథకాలకు తన పేరు పెట్టుకోవడంలో చూపించిన శ్రద్ధ, వాటి అమలుపై ఇసుమంతైనా చూపని జగన్‌రెడ్డి, విద్యార్థుల ఆకలి కేకలతో తాడేపల్లి గుడారం నుంచి శ్రవణానందం పొందాడు. ‘జగనన్న గోరుముద్ద’ పేరు పెట్టి.. ఘోరాతి ఘోరమైన ముద్ద పడేసిన కర్కోటకుడు జగన్ అన్నది జగమెరిగిన సత్యం.
ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పెద్దన్నగా ప్రచారం చేసుకున్న జగన్.. ఆయా వర్గాల విద్యార్థులకు కనీస పోషకాహారం అందించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. కోడిగుడ్లు, పాలు సరఫరా చేసిన వారికి వేల కోట్ల బకాయిలు పెట్టి విద్యార్థులకు పౌష్టికాహారం అందకుండా చేసిన ఘనత జగన్‌దే. వంట కార్మికుల జీతాలివ్వకపోవడం.. సరైన వసతులు కల్పించకపోవడం వైసీపీ ప్రభుత్వ దివాళా పాలనకు నిదర్శనం. చివరకు చిక్కీలకు రూ.56 కోట్లు బకాయిలు పెట్టిన హీనుడు జగన్ రెడ్డి.
‘గోరుముద్ద’ అంటే విద్యార్థులకు, కార్మికులకు ‘గోరుచుట్టు’
అధికారంలో ఉన్నపుడు అన్న క్యాంటీన్లు మూసేసి పేదల కడుపుకొట్టిన జగన్‌రెడ్డి `పేద విద్యార్థులకు పట్టెడన్నం పెట్టే మధ్యాహ్న భోజన పథకాన్నీ నిర్వీర్యం చేశాడు. 2014-19 టీడీపీ హయాంలో దిగ్విజయంగా అమలైన మధ్యాహ్న భోజన పథకానికి.. వైసీపీ సర్కారు తూట్లు పొడిచింది. సీఎంగా తన అసమర్థ చర్యలతో జగన్‌రెడ్డి రాష్ట్రంలో విద్యార్థులకు పట్టెడన్నం దొరకని పరిస్థితి తెచ్చాడు. కూటమి ప్రభుత్వ హయాంలో కడుపునిండుగా ఇష్టమైన భోజనం చేస్తున్న విద్యార్థులను చూసి తట్టుకోలేక విష పత్రికలో తప్పుడు ప్రచారాలు సాగిస్తోన్న జగన్‌రెడ్డి.. తన హయాంలో ‘గోరుముద్ద’ను ఘోరం చేసిన వైనానికి సమాధానం చెప్పాలి.
‘బకాయిల భోజనం’
వైసీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేసింది. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో మెనూ అమలు కాలేదు. వారు పెట్టిందే మెనూగా ఉండేది. జగనన్న గోరుముద్ద పేరుతో అందించిన మెనూ సక్రమంగా లేదని మార్పులు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు విన్నపాలను ఏనాడూ పట్టించుకోలేదు. మెనూ నచ్చకపోవడంతో చాలామంది విద్యార్థులు అయిష్టంగానే భోజనాలు చేసేవారన్నది ఎవరూ కాదనలేని నిజం.
రాష్ట్రవ్యాప్తంగా 88 వేలమందికి పైగా ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులు నెలకు రూ.10వేల వేతనం ఇస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అమలు చేయకపోవటం మోసంకాక మరేమిటి? పాలు సరఫరా చేసిన కర్ణాటక పాల ఉత్పత్తుల సమాఖ్యకు రూ.130 కోట్లు బిల్లులు పెండిరగ్‌లో పెట్టడంతో వారు చేతులు ఎత్తేయడం నిజం కాదా? కోడిగుడ్లు సరఫరా చేసే వ్యాపారులను నెలల తరబడి బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిప్పించడం వాస్తవం కాదా? కరోనా సమయంలో పాఠశాలలు తెరవకపోయినా, విద్యార్థుల ఇళ్లకు బియ్యం, గుడ్లు, చిక్కీ అందించిన కార్మికులకు కనీసం కనికరం చూపకుండా, వారి జీతాలను సకాలంలో చెల్లించకుండా క్షోభపెట్టిన జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలి.
అప్పుడే పుట్టిన పసిబిడ్డల నుంచి బడికెళ్లే పిల్లల వరకూ పోషకాహారలోపం, రక్తహీనత లేకుండా ఉండేందుకు చంద్రబాబు తీసుకొచ్చిన పథకాలను నిర్వీర్యం చేసింది జగన్‌రెడ్డే. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేసేందుకు, బినామీ కాంట్రాక్టర్లకు ప్రజాధనం దోచిపెట్టేందుకు, నాడు-నేడు పేరిట దోపిడీ సాగించేందుకు వేల కోట్ల ప్రభుత్వ సొమ్ము మంచినీళ్ల ప్రాయంగా వృథా చేసింది జగన్ సర్కారే.
మధ్యాహ్నభోజనం అమల్లో 1నుంచి 8వ తరగతివరకు చదివే విద్యార్థులకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో అమలు చేస్తుంటే, 9, 10తరగతి విద్యార్థులకు మొత్తంగా రాష్ట్రప్రభుత్వమే భరించాలి. కానీ జగన్‌రెడ్డి నిధులు కేటాయించకపోగా కేంద్రం ఇచ్చిన నిధులనూ పక్కదారి పట్టించాడు. జగన్‌రెడ్డి హయంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ అధ్వానంగా ఉండేది. చాలా పాఠశాలలకు ప్రహరీలు లేవు. వంటషెడ్లు లేవు. ప్రమాదాల్లో ప్రభుత్వం ఆదుకోకపోయినా, సదుపాయాల కల్పనను గాలికొదిలేసిన కార్మికులు చాలాచోట్ల మధ్యాహ్న భోజన పథకాన్ని చెట్లకిందే నిర్వహించేవారు. కార్మికులకు కనీస వేతనాలివ్వకుండా, గుర్తింపుకార్డులు, పీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ అమలు చేయకుండా శ్రమను దోచుకున్నది జగన్ జమానాలోనే.
అన్నలా తోడుగా నిలుస్తున్న యువ నేత
జగన్‌రెడ్డి హయాంలో పెండిరగ్‌లోవున్న బకాయిలను తీరుస్తూ, రాష్ట్రాన్ని జోన్లవారీగా విభజించి విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేక మెనూతో భోజనం అందిస్తున్న కృషి విద్యా మంత్రి నారా లోకేష్‌దే. జగన్‌రెడ్డి నియంతృత్వ ధోరణిలో రద్దు చేసిన ఇంటర్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించి, శుచి`శుభ్రత, నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులకు సంతృప్తికరమైన భోజనం అందిస్తోంది కూటమి ప్రభుత్వం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనం అందించేందుకు కూటమి ప్రభుత్వం బృహత్తర చర్యలు చేపట్టింది. మధ్యాహ్న భోజనం, సంక్షేమ పథకాలలో తృణధాన్యాలను చేర్చడం, సన్నబియ్యం వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి సంస్కరణలు నారా లోకేష్ చొరవతో ప్రవేశపెట్టిందే. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధునాతన పథకాల ద్వారా పోషకాహారంతో కూడిన భోజనం అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. తల్లిలా ప్రేమగా అన్నంపెడుతూ.. అన్నలా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే యువ నాయకత్వంలో, రాష్ట్ర విద్యార్థులు తమ కలల భవితను నిర్మించుకుంటున్నారు. అది భరించలేని జగన్ మాత్రం సొంత పత్రికలో విషపు రాతలతో గగ్గోలు పెడుతున్నాడు.
స్వరూప, అనలిస్ట్