- పశ్చాత్తాప పడుతుంటే.. చిన్న తప్పంటారా?
- డ్రగ్స్ కొండారెడ్డిని వెనకేసుకు రావడం బాధాకరం
- రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
మంగళగిరి (చైతన్యరథం): పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తి నేడు పశ్చాతాపం పడుతుంటే… జగన్ చిన్న తప్పుని వాదిం చడం విడ్డూరంగా ఉందని రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడా రు. పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తిని జగన్ వెనకేసుకొని రావడం బాధాకరమన్నారు. పరకామణి కేసులో ఎవరిని రక్షించడా నికి జగన్ ప్రయత్నిస్తున్నాడని ప్రశ్నించారు. పరకామణి చిన్న చోరీ అంటున్న జగన్.. ఆ కేసు గురించి అంతలా ఎందుకు స్పందిస్తు న్నారో చెప్పాలన్నారు. గతంలో జగన్ చేసిన పాపాలు నేటికీ ఆ పార్టీని వెంటాడుతున్నాయని పేర్కొన్నారు.
పాపాలు నుంచి బయటపడడానికి జగన్ ఆపసోపాలు పాడుతున్నారని మండిపడ్డా రు. పరకామణి కేసులో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది.. తప్పు చేసిన ఎవర్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ కేసులో పెద్ద కుట్ర దాగి ఉంది.. ఎవరిని కాపాడడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కేసులో ఫిర్యాదు దారుడు సీఐ సతీష్కుమార్ ఎలా చనిపోయారు అనే దానిపై విచారణ సాగుతుంది.. దీనిపై త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.
“కూటమి ప్రభుత్వంలో యువత భవిత కోసం ఈగల్ అనే టాస్క్ ఫోర్స్ వ్యవస్థను తీసుకొచ్చాం. జగన్ హయాంలో పదేళ్ల చిన్న పిల్లోడు నుంచి ముసలి వారు వరకు డ్రగ్స్, గంజాయికి బానిసలయ్యారు. విశాఖపట్నానికి చెందిన గంజాయి సరఫరా దారుడు పులగాం కొండారెడ్డిని ఇవాళ జగన్ వెనకేసుకుని వస్తున్నాడు. కొండారెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థులకు డ్రగ్స్, గంజా యి సరఫరా చేస్తుంటాడు. చిన్న పిల్లలకు డ్రగ్స్ సరఫరా చేసిన వాళ్లు కూడా జగన్ దృష్టిలో అమాయకులు. సొంత బాబాయిని చంపిన వ్యక్తులను జగన్ వెనుకేసుకొని వచ్చారు. గత వైసీపీ నాయకులు లిక్కర్, శాండ్. డ్రగ్స్, ల్యాండ్ మాపియాకు పాలుడా రని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రౌడీ షీటర్లు, డ్రగ్స్ సరఫరా దారులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపుతోందన్నారు. లిక్కర్ స్కాంలో ముఖ్యపాత్ర జగన్రెడ్డిదని ఆరోపించారు. ఈ కేసులో రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి లాంటి చాలామంది అరెస్టయ్యారు. ఈ కేసులో ఎంతటి వారు ఉన్నా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
సీబీఎన్ బ్రాండ్తో పరిశ్రమలు క్యూ కడుతున్నాయి
జగన్ ఐదేళ్ల పాలనలో పరిశ్రమలు పారిపోయాయి. రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ పోయింది. బ్రాండ్. సీబీఎన్ నినాదంతో రాష్ట్రానికి ఇవాళ పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. 2047 విజన్ లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తం ఇవాళ మన రాష్ట్రం వైపు చూస్తోంది. మొన్న విశాఖ సీఐఐ సదస్సే ఇందుకు మచ్చుతునక. ముఖ్యమంత్రి చంద్రబాబు, యువ నాయకుడు నారా లోకేష్ పనితీరుతో పెట్టుబడుల పరంపర కొన సాగుతుంది. కర్నూల్ సిటీ.. డ్రోన్ సిటీగా అభివృద్ధి జరుగుతుంది. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అవుతుంది. కడప స్టీల్ ప్లాంట్ కలల ను సాకారం చేస్తున్నాం.. అతి త్వరలోనే నిర్మిస్తాం. కొప్పర్తి సెజ్ రూ.1000-1500 కోట్లతో ఆధునికీకరించాం. ఓర్వకల్లు సెజ్లో రిలయన్స్ వారు పెట్టుబడులు పెట్టారు. వైసీపీ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ నాశనం చేస్తే.. కూటమి ప్రభుత్వం సరి చేస్తోంది. జగన్ నిర్వాకంతో రాయలసీమలో చాలా మంది రైతులు నష్ట పోయారు. పోలవరం 70 శాతం పూర్తి చేశాం. అమరావతిలో ఇవాళ అభివృ ద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. అమరావతి బ్రాండ్ నిలబెట్టి ప్రపంచ సాయి నగరంగా కూటమి ప్రభుత్వం తీర్చిదిదుతుందని స్పష్టం చేశారు.














