- జగనన్న ఆరోగ్య సురక్ష’, ‘ఆరోగ్యశ్రీ’ పేరుతో జగన్ కొత్త నాటకాలు
- జగన్‌రెడ్డి కల్తీ మద్యంతో గాల్లో కలిసిన 30 వేల పేదల ప్రాణాలు, 30 లక్షల మంది ఆసుపత్రుల పాలు
- పేదల ఆరోగ్యంపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రాష్ట్రంలో కల్తీమద్యం అమ్మకాలు నిలిపివేయాలి
- గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను కట్టడిచేయాలి
అమరావతి: రాష్ట్రంలో తాండవిస్తున్న ఆరోగ్య విపత్తుని కప్పిపుచ్చడానికే జగన్‌రెడ్డి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ‘ఆరోగ్యశ్రీ’ పేరుతో ప్రజల్ని మోసగిస్తున్నాడని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి విమర్శించారు. 57నెలల వైసీపీ పాలనలో జగన్‌రెడ్డి అమ్మిస్తున్న కల్తీమద్యం కారణంగా పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన 35లక్షల మంది పైగా ప్రజలు ఆసు పత్రుల పాలయ్యారన్నారు.ఆరోగ్యాలు కాపాడుకోవడాని కి ఆస్తులు అమ్ముకునే దుస్థితికి వచ్చారన్నారు. ఆ మాత్రం స్తోమత కూడా లేక 30వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో మంగళవారం మాల్యాద్రి విలేకరులతో మాట్లాడుతూ జగన్‌రెడ్డి తనధనదాహంతో కల్తీ మద్యం అమ్మిస్తూ లక్షలాది ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాడని మండిపడ్డారు. రూ.2 లక్షల కోట్ల విలువైన నాసిరకం మద్యాన్ని జగన్‌రెడ్డి ఈ నాలు గున్నరేళ్లలో అమ్మించాడు. ఈ మొత్తంలో లక్ష కోట్ల సొమ్ము జగన్‌రెడ్డి, వైసీపీ మద్యం మాఫియాకు చేరింది. రూ.2లక్షల కోట్ల విలువైన మద్యాన్ని పేదలతో తాగిం చి, 30వేల మంది ప్రాణాలు తీసి, 35లక్షల మందిని అనారోగ్యం పాలుచేసిన ఘనత జగన్‌రెడ్డిదే. పేదల కష్టార్జితం వారి భార్యాపిల్లలు తినాలి. కానీ ఆ సొమ్ము ను జగన్‌రెడ్డి కల్తీమద్యం అమ్మకాలద్వారా తన ఖజానా కు చేర్చుకున్నాడు. జగన్‌రెడ్డి అమ్ముతున్న కల్తీ మద్యం తో పేదలు తమ పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం కూడా అందించలేకపోవడంతో చిన్నారుల మరణాలు కూడా పెరిగాయని మాల్యాద్రి ఆవేదన వ్యక్తం చేశారు.
వైద్యప్రమాణాల ర్యాంకుల్లో దిగజారిన రాష్ట్రం
రాష్ట్రంలో వైద్యప్రమాణాలు ఎలా ఉన్నాయో తెలియ చేస్తూ నీతి అయోగ్ వెల్లడిరచి న ర్యాంకింగ్స్ సమాచా రం చూస్తే జగన్‌రెడ్డి పాలనలో ప్రజారోగ్యం ఎంత అథ మంగా ఉందో అర్థమవుతుంది. ఆరోగ్య ప్రమాణాల్లో చంద్రబాబు హయాంలో దేశంలో 4వ స్థానంలో ఉన్న రాష్ట్రం.. జగన్‌రెడ్డి జమానాలో 10వ స్థానానికి దిగజారింది
ప్రజల ఆరోగ్యాన్ని ఉద్ధరించానంటూ జగన్‌రెడ్డి వం దలకోట్ల ప్రజల సొమ్ముతో తన అవినీతి పత్రిక సాక్షిలో దుష్ప్రచారం చేసుకుంటున్నాడు తప్ప వాస్తవంలో జరి గింది, జరుగుతోంది అందుకు పూర్తి విరుద్ధం. జగన్ నిజంగా వైద్య ఆరోగ్య రంగాన్ని ఉద్ధరించి, ప్రజల ఆరోగ్య ప్రమాణాలు పెంచితే నీతిఅయోగ్ ర్యాంకింగ్స్ లో రాష్ట్రం ఎందుకు 10వ స్థానానికి దిగజారిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. తన సాక్షి పత్రికలో తప్పుడు సమాచారంతో ప్రకటనలు ఇచ్చినంత మాత్రా న ప్రజల ఆరోగ్యం బాగుపడుతుందని జగన్ అనుకుం టే అంతకు మించిన నయవంచన మరోటి ఉండదని మాల్యాద్రి అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆరోగ్య శ్రీ ఆసుపత్రులకు ఉన్న బకాయిల సంగతేమిటి జగన్?
ఆరోగ్య శ్రీ వైద్యసేవలకు సంబంధించి ప్రభుత్వం నుంచి తమకు రూ.1000కోట్లు రావాల్సిఉందని, బకా యిలు తక్షణమేచెల్లించాలని డిమాండ్‌చేస్తూ జగన్‌ప్రభు త్వానికి నెట్‌వర్క్ ఆసుపత్రులు అనేకమార్లు లేఖలు రాసింది నిజం కాదా? ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల కు చెల్లించాల్సిన బకాయిలుచెల్లించకుండా పేదలకు ఎలా నాణ్యమైన వైద్యం అందుతుందో, ఎంతకాలం తప్పుడు సమాచారంతో ప్రజల్ని మోసగిస్తాడో జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. పేదలపై తనకే గొప్ప ప్రేమ ఉన్నట్టుగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ పేరుతో జగన్‌రెడ్డి పేదల్ని మోసగిస్తున్నాడని మాల్యాద్రి తప్పుబట్టారు.
జగన్‌రెడ్డి అసమర్థతతో కరోనా సమయంలో 50 వేల ప్రాణాలు పోయాయి
సీఎంఆర్‌ఎఫ్(ముఖ్యమంత్రి సహాయ నిధి) కింద చంద్రబాబునాయుడు తనహయాంలో రూ.1500కోట్లు ఖర్చుపెడితే,జగన్‌రెడ్డి నాలుగున్నరేళ్లలో రూ.500కోట్లు కూడా ఖర్చుపెట్టలేదు. కేంద్ర్రప్రభుత్వం ఇచ్చిన నిధులు రూ.500 కోట్లు కూడా దారి మళ్లించాడు.కరోనా సమయంలో ఆక్సిజన్ కూడా అందుబాటులో ఉంచలేని జగన్‌రెడ్డి అసమర్థతతో దాదాపు 50వేల మంది చని పోయారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా సమయం లో రాష్ట్రంలో వైద్యప్ర మాణాలను జగన్‌రెడ్డి దారుణం గా దిగజార్చాడు. ఆఖరికి మాస్కులు అడిగాడన్న అక్క సుతో దళిత వైద్యుడైన సుధాకర్‌ని దారుణంగా హిం సించి, అతని ప్రాణాలు పో వడానికి కారకుడయ్యాడని మాల్యాద్రి దుయ్యబట్టారు.
మాదకద్రవ్యాలతో దాదాపు 1750 మంది యువత బలవన్మరణాలు
రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న కల్తీ మద్యం అమ్మకాలు చాలవన్నట్టు జగన్‌రెడ్డి తన ధనదాహాం కోసం ఏకంగా మాదకద్రవ్యాలను సొంత పార్టీవారి తోనే అమ్మిస్తూ యువత భవిష్యత్‌ను సర్వనాశనం చేస్తు న్నాడు. వైసీపీ నేత, నెల్లూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ కుమారుడే హైదరాబాద్‌లో డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. కాకినాడ ఎమ్మెల్యేకి చెందిన మనుషులు గుజరాత్ నుంచి విజయవాడ అడ్రస్‌తో రూ.21వేల కోట్ల విలువైన డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడ్డారు. ఇలా రాష్ట్రంతో పాటు దేశంలో ఎక్కడ మాదకద్రవ్యాలు, గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉన్న ఘటనలు కోకొల్లలు. జగన్‌రెడ్డి యువతను మాదక ద్రవ్యాలకు బానిసల్ని చేయడం వల్ల.. నిరుద్యోగ సమ స్యలు తట్టుకోలేక రాష్ట్రంలో దాదాపు 1750మంది యువత బలవన్మరణాలకు పాల్పడ్డారు. ప్రజల ఆరో గ్యాన్ని రక్షించడం అంటే ఇదేనా అని జగన్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. ఈ విధంగా తన వైఫల్యాలు, అసమర్థత, ధనదాహంతో రాష్ట్రంలో నెలకొన్న ఆరోగ్యవిపత్తు నుం చి ప్రజల దృష్టిని మళ్లించడానికే జగన్‌రెడ్డి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ అనే పేరుతో కొత్త జగన్నాటకం మొద లెట్టాడని మాల్యాద్రి స్పష్టం చేశారు.
చంద్రబాబు 22 మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేస్తే.. జగన్‌రెడ్డి 5 మాత్రమే తీసుకొచ్చాడు
వైద్యకళాశాలల ఏర్పాటుపై కూడా జగన్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. చంద్రబాబునాయడు తన హయాంలో రాష్ట్రంలో 22 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, జగన్‌రెడ్డి 57నెలల పాలనలో కేవలం 5మాత్రమే స్థాపించాడు. 5మెడికల్ కాలేజీల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యా ర్థులకు దక్కాల్సిన సీట్లను కూడా బహిరంగ మార్కెట్లో అమ్మకానికి పెట్టాడు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో చంద్రబాబు నాయుడు చేసిన దానితో పోలిస్తే జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లలో చేసింది ఆవగింజంత మాత్రమే. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చి తన తండ్రి పేరు పెట్టాడని మాల్యాద్రి విమర్శించారు.
కల్తీమద్యం.. మాదకద్రవ్యాలు రాష్ట్రంలో లేకుండా చేయాలి
జగన్ రెడ్డికి నిజంగా ప్రజలపై ప్రేమే ఉంటే, మరీ ముఖ్యంగా పేదల ఆరోగ్యం కాపాడాలని ఉంటే తక్షణ మే రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మకాల్ని కట్టడిచేయాలి. అదే విధంగా మాదకద్రవ్యాలు, గంజాయిని రాష్ట్రంలో లేకుండా చూడాలి. పేదల ఆరోగ్యం కాపాడాలనే చిత్త శుద్ధి జగన్ రెడ్డికి ఏమాత్రం ఉన్నా ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన రూ.1000కోట్లు తక్షణమే చెల్లించాలి. మందుల కుంభకోణానికి పాల్పడుతున్న వారు, ఆరోగ్యశ్రీలో కుంభకోణానికి పాల్పడిన వారితో పాటు.. 108,104 అంబులెన్సుల కొనుగోళ్లలో అవక తవకలకు పాల్పడిన వారిపై వెంటనే కఠినచర్యలు తీసు కోవాలి. పేదల ఆరోగ్యాన్ని కాపాడేందుకు చేయాల్సింది చేయకుండా, పళ్లెంలో పాయసం పోసి కొంగ ముందు ఉంచినట్టు ఉపయోగం లేని చర్యలతో, ఉత్తుత్తిమాటల తో ప్రజారోగ్యం బాగుపడదనే వాస్తవాన్ని జగన్ రెడ్డి గుర్తించాలి. ప్రచారపిచ్చి, అక్రమార్జన కోసం ప్రజల ఆరోగ్యాన్ని గాల్లో దీపంగా మార్చిన జగన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధిచెబుతారని మాల్యాద్రి హెచ్చరించారు.