- ప్రత్తిపాటి శరత్ అరెస్ట్ అప్రజాస్వామికం
- మరో 45 రోజుల్లో నిన్ను తిరిమి కొట్టడం ఖాయం
– మండిపడ్డ అచ్చెన్నాయుడు
అమరావతి(చైతన్యరథం): రాజకీ యం ప్రత్యర్థుల కుటుంబసభ్యులపౖౖె అక్రమ కేసులు నమోదు చేయిస్తూ జగన్మోహన్రెడ్డి పిరికిపంద చర్య లకు పాల్పడుతున్నాడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చె న్నాయుడు ఆగ్రహంవ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్‌రెడ్డికి అన్ని వైపుల నుంచి వ్యతిరేక పవనాలు వీస్తున్నా యి. ఐదేళ్ళ నుంచి జగన్‌రెడ్డి చేస్తున్న అరాచకాలకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్న సమయంలో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడు. తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుని రాజకీయంగా ఎదుర్కోలేక అతని కుమారుడిపై అక్రమ కేసులు బనాయించాడు. వ్యాపారంతో ఎటువంటి సంబంధం లేని, ఏ కంపెనీతోనూ షేర్ హోల్డర్‌గా లేని ప్రత్తిపాటి శరత్‌ను అకారణంగా అరెస్ట్ చేశారు. రాజకీయంగా ఎదు ర్కోలేకే ఇటువంటి అక్రమ కేసులతో వేధింపులకు దిగుతున్నారు. ఓటమి భయంతో ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడిని అక్రమంగా అదుపులోకి తీసుకొని.. ఆచూకీి కూడా చెప్పకుండా వేధించడం జగన్ సైకో చర్యలకు నిదర్శనం కాదా! అక్రమ కేసులు పెట్టి వేధించిన ఏ ఒక్కరిని వదలము. అందరి లెక్కలు తేలుస్తాం. అక్రమ కేసులతో ప్రతి పక్ష పార్టీ నేతలను వేధిస్తున్న జగన్ సర్కార్‌కు మరో 45రోజుల్లో రాజ కీయ సమాధి కట్టడం ఖాయం. 45రోజులు ఆగలేక జగన్‌రెడ్డి తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడు. ప్రజాస్వామ్య పరిరక్షణకై తెలుగుదేశం నిరంతరం పోరాడుతూనే ఉంటుందని ఒక ప్రకటనలో అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.