- దోషులకు అండగా నిలిచిన క్రూరుడు
- కల్తీ మద్యానికి ఆయనే బ్రాండ్ అంబాసిడర్
- గత ప్రభుత్వంలో నిందితులపై చర్యలు లేవు
- కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే విమర్శలా
- టీడీపీ పొలిట్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి
మంగళగిరి (చైతన్యరథం): కల్తీ మద్యంతో వేలమంది ప్రాణాలు తీసిన జగన్రెడ్డి కల్తీ మద్యానికి అసలైన బ్రాండ్ అంబాసిడర్ అని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభు త్వంలో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారింది. కల్తీ మద్యానికి చాలా మంది అనారోగ్యానికి గురై మరణించిన సంఘటనలను మనం ఎన్నో చూశాం. ఈ రోజు కల్తీ మద్యం గురించి జగన్రెడ్డి మాట్లాడుతూంటే దెయ్యాలు వేదాలు వళ్లించినట్లు ఉంది. జగన్ రెడ్డి పాలనలో స్వయంగా వారి పార్టీ నాయకులే డిస్టిలరీలను ఏర్పాటు చేసి నగదుకు లిక్కర్ అమ్ముకుని సొమ్ము చేసుకున్న సంఘటనలు చూశాం. వైసీపీ పాలనలో రూ.3 వేల నుంచి రూ.4 వేల కోట్ల మద్యం కుంభకోణం జరిగింది. మీరు కూడా కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం అంటూ మాట్లాడుతున్నారు. తెలుగు దేశం, కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు
అధికారంలో ఉన్నా శాంతి భద్రతలపై కానీ, అవినీతి, ఆరాచకాల పాలిత సింహస్వప్నంలా వ్యవహరించారు. ఈ రోజు ప్రజల ఆరోగ్యమే.. ప్రభుత్వ బాధ్యత, భద్రత అని నకిలీ మద్యం అమ్మకా లపైన, తయారీ కేంద్రాలపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుం టుంది. అంతేకాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు కల్తీ మద్యం తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహిస్తుంది. ఇందులో పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వంలో ఎటు వంటి అవినీతి, ఆరాచక వ్యవహారాలు ఎవరు చేసినా కూడా చర్య లు తీసుకునేందుకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని టీడీపీ నాయకులనే సస్పెండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కల్తీ మద్యం వ్యవ హారంలో రాజీపడే పడేది లేదని హెచ్చరించారు. పార్టీ ఇన్చార్జి జయచంద్రారెడ్డిని, సురేంద్రనాయుడు అనే వ్యక్తిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పోలీసులు కూడా వారి మీద చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఎక్కడో మద్యం కుంభకోణం జరిగితే ప్రభుత్వం మీద విషప్రచారం చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
ఉనికి కోసమే విష ప్రచారం
జగన్ రెడ్డి అరాచక పాలన నుంచి ప్రజలు తేరుకుని ఈ ఏడాదిన్నర కాలంలో రాష్ట్రం ఆర్థికంగా, అభివృద్ధి పరంగా ముం దుకు పోతూ దేశంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ కార్యక్ర మాలను ప్రజల కోసం అమలు చేస్తుంటే ఉనికిని కాపాడుకు నేందుకు ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తున్నారు. మీరు మద్యం కుంభకోణంలో రూ.3500 కోట్లు అవినీతి చేశారని ఆధారాలతో సహా సిట్ కోర్టు ముందు పెట్టిన తరువాత మీరు పార్టీకి చెందిన ఎంపీలు కానీ, సీఎంఓ సంబంధించిన మాజీ అధికారులు కానీ జైళ్లలో 70-80 రోజులు ఉండాల్సిన పరిస్థితి.
వాళ్లను నువ్వు సస్పెండ్ చేశారా? వాళ్ల మీద కనీస తాత్కాలిక చర్యలు తీసుకు న్నారా? మీరు అధికారంలో ఉన్నప్పుడు మద్యం కుంభకోణం భాగస్వాములు అయిన వారితో మాకు ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని ఎన్నడైనా మీడియా ముందుకు చెప్పారా? అని ప్రశ్నించారు. ఎంత అవినీతి కుంభకోణం జరిగిన మీ పార్టీ నుంచి ఎటువంటి చర్యలు ఉండవు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వ పాలన నిరంతరం ఒక సమర్థ వంతమైన, నీతివంతమైన పరిపాలన, అవినీతి లేని పరిపాలన చేస్తుందని
తెలిపారు.
చర్యలు తీసుకుంటే విమర్శలా?
కల్తీ మద్యంపై పోలీసు అధికారులు, ఎక్సైజ్ అధికారులను ఆదేశాలిచ్చి అన్ని రకాలుగా దోషులను అరెస్టు చేసి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గత ప్రభుత్వం పాలనలో కల్తీ మద్యం తాగి విజయవాడకు చెందిన వారు మరణిస్తే.. మీ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడిన విషయాలు ప్రజలు ఇంకా మరచిపోలేదు. “చచ్చిపోతే.. చచ్చిపోయారు.. పోయిన వారందరూ పోయారు” అంటూ ఇష్టానుసారంగా మాట్లాడిన విషయం మీకు గుర్తు లేదా..? మీరు మరచిపోయిన ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేని పరిస్థితి. మద్యం వ్యాపారం అంటే ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేయడమేనని జగన్ రెడ్డి 2019 ఎన్నికల్లో చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. సంపూర్ణ మద్యనిషేదాన్ని అమలు చేస్తానని అధికారం లోకి వచ్చిన తరువాత మద్య నిషేధం చేయకపోగా, జే బ్రాండ్లను తీసుకువచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారని ధ్వజమెత్తారు.
జే బ్రాండ్లతో 35 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు
కల్తీ మద్యంతో ఇబ్బంది పడకూడనే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. పేదల ఆరోగ్యంతో పాటు వారి ఇళ్లను గుళ్ల చేసి వారి జీవితాలతో గత వైసీపీ ప్రభుత్వం ఆడుకుంది. జగన్రెడ్డి పాలనలో జరిగిన మద్యం కుంభకోణం వల్ల అధికారులే కాదు.. వారి కింద ఉన్న అటెండర్లు కూడా జైలుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా పారదర్శక పాలన అందిస్తుందనే విషయాన్ని ప్రజలు గ్రహించాలి. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా జే బ్రాండ్ కల్తీ మద్యం వల్ల 35 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు.. కల్తీ మద్యానికి మూల విరాట్ ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న వస్తే అది జగన్రెడ్డి మాత్రమే అనే విషయం ప్రజలకు స్పష్టం తెలియజేయాల్సిన అవస రం ఉంది. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, భూ మాఫియా, ఎర్ర చందనం మాఫియా… ఇటువంటి మాఫియా అన్నింటి కోసమే వైసీపీ ప్రభుత్వం పాలన సాగించింది. అందుకే ఈ రోజు ఆర్థికంగా చితికిపోయి.. ఆదాయం లేక నాశనం చేస్తే… దానిని గాడిన పెట్టేందుకు చంద్రబాబు చేస్తున్న కష్టం ప్రజలందరూ కళ్లతో చూస్తున్నారు. అభివృద్ధి-సంక్షేమం ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని స్పష్టం చేశారు.
కల్తీ మద్యంతో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు
గత ప్రభుత్వ పాలనలో మద్యం రేట్లు పెంచి.. దాన్ని మళ్లీ కల్తీ మద్యం రూపంలో విక్రయించి అక్రమ అదాయాన్ని పొంది.. ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి కొట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం రేట్లను తగ్గించింది. నాణ్యమైన మద్యం, అన్ని రకలైన మద్యాన్ని అందు బాటులోకి తీసుకువచ్చి ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా.. వాళ్ల ఆరోగ్య పాడుకాకుండా నాణ్యమైన మద్యం తోనే అమ్మకాలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వ పాలనలో కల్తీ మద్యం వల్ల దాదాపు 30 వేల మంది కాలేయం దెబ్బతిన్నట్లు మెడికల్ రిపోర్టులు ఆధారాలతో సహా ఉన్నాయి. నరాల వ్యాధి వల్ల దాదాపు 12,600 మంది ఆనారోగ్యం పాలైనట్లు మెడికల్ రిపోర్టులు ఉన్నాయి. ఇన్ని రకాలుగా వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజల ఆరోగ్యం, ప్రజల అస్తులు, ప్రభుత్వానికి అదాయం రాకుండా నష్టం కలిగించే పనులు మీరు చేసి.. కల్తీ మద్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రొత్సహించి నాశనం చేస్తే, కూటమి ప్రభుత్వం వాటిని బాగు చేస్తూ పారదర్శక పాలన అందిస్తుంటే చూసి ఓర్వలేక ఉనికి కోసం లేనిపోని అసత్య ప్రచారాలను సృష్టిస్తూ రోత మీడియా ద్వారా పెద్ద పెద్ద రాతలు రాస్తూ నమ్మించే ప్రయ త్నం చేస్తున్నారు. జగన్రెడ్డి ఎన్ని కుట్రలు పన్నని కూడా రాష్ట్ర ప్రజలేవ్వరు కూడా నమ్మే స్థితిలో లేరు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ ఎవరు అని చిన్న పిల్లాడిని అడిగిన జగన్రెడ్డేనని టక్కున చెప్పే స్తాడు. రాష్ట్రాన్ని నాశనం చేసిన ముఖ్యమంత్రి చీకటి చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తిగా జగన్రెడ్డి మిగిలిపోయాడనే విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తు చేసుకోవాలని హితవుపలికారు.