- వారి గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు
- స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ తగ్గించి అన్యాయం
- జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు
- గౌడ, శెట్టిబలిజ భవన నిర్మాణంలో శ్రమదానం
పాలకొల్లు(చైతన్యరథం): వైసీపీ పాలనలో బీసీలను అడుగడు గునా దగా మోసం చేసిన జగన్‌కు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డా రు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం ఆయన రూ.3 కోట్లతో జరుగుతున్న గౌడ, శెట్టిబలిజ కళ్యాణ మండప స్లాబ్ నిర్మాణ పనుల్లో కార్మికులతో కలిసి పనిచేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో 1.50 కోట్లు మంజూరై మొదటి స్లాబు పనులు జరిగాయన్నారు. వైసీపీ ప్రభు త్వంలో రూపాయి ఖర్చు, అరబస్తా సిమెంట్ పని నోచుకోలేద న్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కళ్యాణ మండప నిర్మాణ పనులు మొదలుపెట్టి పూర్తి చేసే బాధ్యత తనదని మాట ఇచ్చా.. నేడు మాట నిలుపుకునేలా ప్రభుత్వంతో మూడు కోట్లు నిధులు మంజూరు చేయడంతో మళ్లీ పనులు మొదలయ్యా యన్నారు. బీసీ అంటేనే టీడీపీ..టీడీపీ అంటే నే బీసీ పార్టీగా ఆదరించారని గుర్తుచేశారు. 4 దశాబ్దాల నుంచి ఉన్న 34 శాతం బీసీల స్థానిక సంస్థల రిజర్వేషన్‌ను 24 శాతం తగ్గించిన బీసీ ద్రోహి జగన్ అని పేర్కొన్నారు.
జగన్ రిజర్వేషన్ తగ్గించడంతో 16 వేల పోస్టులు స్థానిక సంస్థలలో బీసీలు నష్ట పోయారన్నారు. నాడు వైసీపీ పాలనలో బీసీలను అడుగడుగునా దగా మోసం చేసిన జగన్‌కు బీసీల గురించి మాట్లాడే అర్హత లేద న్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, గౌడ శెట్టిబలి జ కళ్యాణ మండప కమిటీ నాయకులు మేకా కోటే శ్వరరావు, పీతాని వెంకట్, పెచ్చెట్టి బాబు, అప్పారి ఉమామహేశ్వ రరావు, అంగర చిన్న, బొక్క గంగాధర్‌రావు, ఏఎంసీ చైర్మన్ కోడి విజయ భాస్కర్, మామిడిశెట్టి పెద్దిరాజు, కడలి గోపాలరావు, గండేటి వెంకటేశ్వరరావు, చిట్టూరి ఏడుకొండలు, కుక్కల సత్యనా రాయణ, గోపాలకృష్ణ, గుబ్బల ఏడుకొండలు, రాచమల్ల మీరయ్య, కౌరు సందీప్ కుమార్, కేతరాజు, నున్నబోయిన సత్యనారాయణ, తదితరు నాయకులు పాల్గొన్నారు.















