- నేడు చంద్రబాబు పాలనలో బలోపేతానికి చర్యలు
- మంత్రి నిమ్మల రామానాయుడు
పాలకొల్లు (చైతన్యరథం): జగన్ ఐదేళ్ల పాలనలో గోదావరి ఏటిగట్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, నేడు చంద్రబాబు పాలనలో అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో గోదావరి ఏటిగట్టు పటిష్టత పనులను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా దొడ్డిపట్ల గ్రామంలో మంత్రి రామానాయుడు విలేకరులతో మాట్లాడారు. గోదావరికి వరద వస్తే బూరుగుపల్లి వద్ద ఏటిగట్లకు గండ్లు పడి పది, పన్నెండు మండలాలు ముంపునకు గురవుతాయనే అంచనాతో 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ముందస్తుగా రూ 6 కోట్లు నిధులు మంజూరు చేయించి గ్రోయిన్స్ నిర్మాణంతో అడ్డుకట్ట వేశామన్నారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వంలో ఏటి గట్ల పటిష్టతక రూపాయి వ్యయం కూడా చేయలేదు. తట్టమట్టి పనులకూ నోచుకోకపోవడంతో వరద వచ్చిన సమయంలో బలహీనంగా ఉన్న గట్లు వద్ద గండ్లు పడకుండా గట్టు వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు, యువకులు కలిసి రెండు, మూడు రోజులు రాత్రింబవళ్లు కాపలా కాసి ట్రాక్టర్లపై ఇసుక, సంచులు, బాదులు వంటివి సమకూర్చుకొని కాపాడుకున్నారన్నారు.
ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని….నిధుల సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు.. గోదావరి ఏటిగట్టు పటిష్టతకు అత్యంతం ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఆనాడు జగన్‌కు 151 సీట్లు ఇచ్చి అధికారం కట్టబెడితే అన్ని రంగాలను సర్వనాశనం చేసి వదిలిపెట్టాడని, నేడు ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా అభివృద్ధి, సంక్షేమం దిశగా సీఎం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తూ, పవన్ కళ్యాణ్ తోడు, ప్రధాని మోదీ అండతో మంచి పాలన అందిస్తున్నారనే విషయం ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్డెక్కి పోరాటం చేస్తేనే గాని వరద సాయం అందేది కాదని, నేటి కూటమి ప్రభుత్వంలో వరద నీరు గడప వద్దకు వస్తుందని తెలిసిన వెంటనే సాయం అందించామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇరిగేషన్ అత్యవసర పనులు నిమిత్తం సీఎం చంద్రబాబు మంజూరు చేసిన రూ. 320 కోట్ల నిధుల పనులను మార్చి నెలాఖరులోగా పూర్తయ్యేలా దృష్టి పెట్టామన్నారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసిన ఏటిగట్లను బలోపేతం చేయడం, డ్రైన్ల పూడిక పనులు, గేట్లు, షట్టర్లు, లాకులు, రోప్‌లు వంటి అత్యవసర పనులను సరిచేస్తున్నామన్నారు.
నాడు ఇరిగేషన్ శాఖలో 12 సంవత్సరాలుగా పెండిరగ్‌లో ఉన్న ఉద్యోగుల ప్రమోషన్లకు ఆమోదముద్ర వేస్తూ ఉద్యోగుల గౌరవాన్ని కాపాడుతున్నామన్నారు. గత ప్రభుత్వం రాజకీయ ప్రేరేపితంగా 386 మంది ఇరిగేషన్ ఉద్యోగులపై విజిలెన్స్ కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతుంటే, వాటి నుండి ఉద్యోగులను విముక్తులను చేశామని మంత్రి రామానాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోదావరి ఏటిగట్టు కన్జర్వేషన్సీ ఇంజనీరింగ్ అధికారులు, నాయకులు బోనం నాని, మామిడి శెట్టి పెద్దిరాజు, ఆరిమిల్లి రామశ్రీనివాసరావు, రుద్రరాజు సత్యనారాయణరాజు, బొప్పన హరికిషోర్, చిట్టూరి రామాంజనేయులు, చేగొండి రవిశంకర్, డేగల సత్తిపండు, తోలేటి చంటి, గుబ్బల మోహన్రావు, సేరు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.